aaa

భారత ఎన్నికల సంఘం కార్యదర్శి, సలహాదారు - కొమ్మజోస్యుల జగన్నాధ రావు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ప్రజాస్వామ్యం లో అతి ముఖ్యమైనదీ, నిర్ణాయకమైనదీ వోటు హక్కు - స్వేఛ్ఛాయుతమైన ఎన్నికలు - ప్రజలు తమ వోటు హక్కును సద్వినియోగపరచుకుని నచ్చిన అభ్యర్ధిని ఎంపిక చేసుకోవడం. కరుడుగట్టిన నేరస్థులకు ఆలవాలముగా ఉన్న బీహార్ రాష్ట్ర ఎన్నికలను 2005 లో సజావుగా నిర్వహించి దేశం దృష్టిని ఆకట్టుకుని బీహార్ హీరో గా అవతరించిన భారత ఎన్నికల అబ్జర్వర్ (పర్యవేక్షకుడు) - కొమ్మజోస్యుల జగన్నాధ (కే జే) రావు గారు. ఉగ్రవాదుల బెడద ఉన్న జమ్మూ కాశ్మీర్ లో, సంఘటనా రహిత ఎన్నికలు నిర్వహించారు. అంతే కాదు కరుడు గట్టిన ఉగ్రవాదిని నిర్భందించారు. జామ్మూ కాశ్మీర్, బీహార్ లో సమర్ధవంతముగా సంఘటనా రహిత ఎన్నికలు నిర్వహించినందుకు దేశ ప్రజల నుండి మన్ననలు అందుకున్నారు. భారత రాష్ట్రపతి శ్రీ ఏ పీ జే అబ్దుల్ కలాం నుండి అభినందనలు అందుకున్నారు.

సుజావుగా 2005 బీహార్ ఎన్నికలు - ' హీరో ' కే జే రావు
ఉపద్రవాలు, మరణాలు, రిగ్గింగ్ లు, లూటి బీహార్ లో సర్వ సాధారణం. ఇక ఎన్నికలలోనైతే చెప్పనక్కర లేదు. అన్నీ విచ్చలవిడిగా ఉండేవి. ఇలాంటి చోట ఏ ఘటనలు లేకాండా స్వేఛ్ఛాయుత ఎన్నికలు నిర్వహించడం ద్వారా యావత్ భారత దేశ దృష్టిని ఆకట్టుకున్నారు. బీహార్ రాష్ట్రంలో అత్యంత గౌరవనీయ వ్యక్తిగా ఎదిగారు. ఉదంతాలూ, సంఘటనారహిత ఎన్నికలను - " రావు ఎఫెక్ట్ " గా పత్రికలు అభివర్ణించాయి.

వార్తా పత్రిక - ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ - " నెగ్గింది నితీష్ కుమార్? లాలు ప్రసాద్, రాం విలాస్ పాశ్వాన్? - వీళెవ్వరూ కాదు. జన హృదయాలలో నెగ్గిన వాడు - ఎన్నికల సంఘం సలహాదారు కే జే రావు " అని వ్రాసింది.

" రావు ఫినామినా " బాగా పనిచేసింది. వోటర్లు నిర్భయముగా వోటింగులో పాల్గొన్నారు. ఫలితాలు చెప్పనక్కరలేదు. కుల రాజకీయాలు పనిచేయలేదు. డబ్బు సంచులు గెలుపును ఇవ్వలేకపోయాయి. ప్రజాభిమతమే గెలిచింది. సమర్ధవంతముగా ఎన్నికలు నిర్వహించడంతో, నీతీష్ కుమార్ రథసారధిగా ఎన్నికవడం జరిగింది. ఇది బీహార్ ఎన్నికలలోనే కాదు - భారత ఎన్నికల నిర్వహణా చరిత్రలోనే మలుపురాయి అని చెప్పవచ్చు. స్వేఛ్ఛాయుత ఎన్నికలు ఎలా నిర్వహించాలో చేసి చూపించారు కే జే రావు గారు.

మారు మూల ప్రాంతాలకు సైతం మోటర్ సైకిల్ మీదా వెళ్ళి వోటర్లకు అండగా నిలిచి సామాన్యులకి దిలాసా ఇచ్చారు.

" ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలోని కరుడు గట్టిన గూండాలను, రాజకీయ - అపరాధులను ఎదుర్కొన్నారు. కొన్ని సందర్భాలలో అంగ రక్షకులు లేకుండా పర్యటనలు చేశారు. ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చు!. రావు గారు ఇండియన్ ఆర్మీ కూడా సాహసించని ప్రాంతాలకు వెళ్ళారు. " జమ్మూ కాశ్మీర్ లో విపత్కరం సృష్టించగల ఉగ్రవాదిని నిర్భందించారు " - అని కే జే రావు గారిని ఉద్దేశించి భారత ఎన్నికల సంఘం మాజీ అధ్యక్షుడు శ్రీ జే ఎం లిండో అభివర్ణించారు.

బాల్యం, చదువు, ఉద్యోగం

కొమ్మజోస్యుల జగన్నాధ రావు (కే జే రావూ) గారు మార్చ్ 1, 1942 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర, శ్రీకాకుళం జిల్లా కొండల మామిడివలసలో జన్మించారు. ప్రాధమిక విద్య పూర్తి చేసిన తరువాత, విశాఖపట్నం ఏ వి ఎన్ కాలేజి లో చదువుకున్నారు. కొంత కాలం మెట్టపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లో అధ్యాపకుడిగా పనిచేసి, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యు పి ఎస్ సీ) నిర్వహించిన పరీక్షలలో ఉత్తీర్ణులై, నవంబర్, 1966 లో భారత ఎన్నికల సంఘం లో అసిస్టెంట్ గా చేరారు. నలబై ఏళ్ళ పాటు ఇదే సంస్థలో విభిన్న హోదాలలో పనిచేశారు. 2002 లో ఎన్నికల సంఘం కార్యదర్శిగా రెటైర్ అయ్యారు. కానీ ఎన్నికల సంఘానికి వీరి సేవల ఆవశ్యకత ఏర్పడటటంతో ఎలక్షన్ అబ్జర్వర్ గా పనిచేశారు -, సలహాదారుగా కీలకమైన జమ్మూ కాశ్మీర్, బీహార్ లలో సుజావుగా ఎన్నికలు నిర్వహించారు.

" వృత్తి రీత్యా పదవులలో ఎదుగుతానా అన్న విచారం లేక, చేసేది పరిపూర్ణ ఆత్మవిస్వాసంతో, ధైర్యంగా, నిర్భయంగా పనిచేశారు కే జే రావు గారు " అన్నారు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎన్నికల కమీష్నర్ శ్రీ కే మాధవ రావు గారు.

భారత ఎన్నికల సంఘం అధ్యక్షుడు, శ్రీ జే ఎం లిండో తన పుస్తకం " క్రానికల్ ఆఫ్ ఆన్ ఇంపాసిబుల్ ఎలెక్షన్ " లో రావు గారు ధైర్యాన్ని, దీక్షని, నిర్భయంగా ఎన్నికలు నిర్వహించే దైర్య, స్థైర్యాలను కొని ఆడుతూ, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల " రియల్ హీరో " గా ఉదాహరించారు. పై అధికారుల నుండి ఇలాటి మెప్పు పొందడం ఉద్యోగ పర్వంలో ఉన్నవాడికి, అందులోనూ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాడికి సులభ సాధ్యం కాదు. ఇలా జరిగింది అంటే అది కే జే రావు గారి వ్యక్తిత్వం ఎంత శ్రేష్టమైనదో పరిచయం చేస్తోంది.

కామన్ వెల్త్ ఆఫ్రికన్ దేశం - జింబాబ్వేలో ఎన్నికల నిర్వహణా శిక్షణను నిర్వహించారు. యునైటెడ్ నేషన్స్ శ్రీ రావు గారి సేవలను, అక్టోబర్ 2004 లో జరిగిన ఆఫ్గనిస్తాన్ జాతీయ అధ్యక్ష ఎన్నికలలో " ఇన్వెస్టిగేషన్, ఎంఫోర్స్ మెంట్ అధికారిగా " వినియోగించుకుంది.

2004 లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల అంతర్జాతీయ పర్యవేక్షకుడిగా (అబ్సర్వర్ గా) ఉన్నారు.

ఆల్ ఇండియా మెనేజ్ మెంట్ సంస్థ, ఎన్నికలు సంఘటనా రహితముగా నిర్వహించినందుకు పారితోషకం, " పబ్లిక్ సర్వీసెస్ ఎక్సలెన్స్ అవార్డు " ఇచ్చి గౌరవించింది. దీన్ని అప్పటి రాష్ట్రపతి శ్రీ ఏ పి జే అబ్దుల్ కలాం చేతులమీదుగా అందుకున్నారు.

భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం శ్రీ రావు గారికి ఓ ప్రత్యేక పని అప్పచెప్పింది. అదేమిటంటే - ఢిల్లీ లోని నివాశ ప్రాంతాలలో " వాణిజ్య " సముదాయాల మూసివేసే బాధ్యత. ఈ పని కూడా సమర్ధవంతంగా నిర్వహించారు.

అటు హెలికాఫ్టర్, కార్, జీప్ లు, ఇటు స్కూటర్, యెడ్ల బండిలోనూ బిహార్ అంతటా తిరిగి జనాలకి నమ్మకం, భరోసా ఇచ్చి ఎన్నికలలో పాల్గొనేటట్టు చేశారు. ఎక్కడ నుంచి అభియోగాలు వచ్చినా వెనువెంటనే విచారించి తగు చర్యలు తీసుకున్నారు. ఎంత మారు మూల ప్రాంతమైనా సరే లెక్క చేయకుండా స్కూటర్ మీద వెళ్ళిపోయి స్థానికంగా విచారించి తగిన నిర్ణయాలు తీసుకున్నారు.

బిహార్ కన్నా కాశ్మీర్ లో ఎన్నికల నిర్వహణ సులువుగా అయ్యిందని చెప్పవచ్చు. " కాశ్మీర్ ఉగ్రవాదులదే బెడద. కానీ బీహార్ లో ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ వాళ్ళు ఏరకమైన గొడవ లేపుతారో తెలియదు " అని ఓ సందర్భంలో ఉద్ఘాటించారు కే జే రావు గారు.

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. బోగస్ వోట్ల జాబితాను కొంత వరకూ ప్రక్షాళణ చేశారు. రిగ్గింగ్ ను కళగా మార్చిన పశ్చిమ బెంగాల్ "లెఫ్ట్ " పార్టీలు, వోటర్ల జాబితాలలో చేసిన అవక తవకలను కనుక్కుని వమ్ము చేశారు.

మంచినీరు దొరక్క ప్రజలు అల్లలాడుతూ ఉంటే, " మందు " మటుకూ టాంకర్లలో తోలుకెళ్ళి పోయిస్తున్నారు - వోట్లు ఆకట్టు కోవడానికి - ఇది దురదృష్టం అన్నారు రావు గారు.

ఆంధ్రప్రదేశ్ లో లక్ష బెల్టు షాపులు ఉన్నాయి - వీటిని తొలగించాలి అని చెపితే ఎక్సైజ్ కమీష్ నర్ - " బెల్ట్ షాపులు లేవు " అని చెప్పారు. మరునాడు రాష్ట్రంలో 7,000 మధ్యం బెల్ట్ షాపులు మూసివేసినట్టు వార్త వెలువడింది అని కే జే రావు గారు ఉదహరించారు.
జమలేని డబ్బు ముప్పై నాలుగు కోట్ల రూపాయల నగదును పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో యాబై లక్షల బోగస్ వోటర్ల జాబితాను చెత్తబుట్టలో పారేశారు.

మంచినీరు దొరక్క ప్రజలు అల్లలాడుతూ ఉంటే, " మందు " మటుకూ టాంకర్లలో తోలుకెళ్ళి పోయిస్తున్నారు - వోట్లు ఆకట్టు కోవడానికి - ఇది దురదృష్టం అన్నారు రావు గారు.

" కే జే రావు గారు, ఎన్నికల సంఘం లో చావ ఉన్న వ్యక్తిగా నిలిచారు " అని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి ఐ వి సుబ్బారావు అన్నారు. చీఫ్ ఎలెక్షన్ కమీష్నర్ - జే ఎం లిండో " కే జే రావు ఈస్ హాడ్ నట్ టొ క్రాక్ " అని ఉదాహరించారు.

పీ శ్రీనివాస రావు, గౌరీ శంకర్ రచించి " కే జే రావు - ఒక స్పూర్తి, ఒక దిక్సూచి " పుస్తకం విలువడించారు.

ఫేం

కే జే రావు ఫేం సంస్థ వ్యవస్థాపకుడు; కార్యదర్శి. మాజీ భారత చీఫ్ ఎలెక్షన్ కమీష్నర్ జే ఎం లిండో ఇతర సభ్యులలో ఉన్నారు. భారత దేశంలో స్వేఛ్ఛాయుత ఎన్నికలు, నేర చరిత్రలేని వ్యక్తులకు పరిరక్షించే ఉద్దేశంతో ఈ సంస్థను నెలకొల్పారు.

ఎన్ ఎస్ యు ఐ సంస్థాగత ఎన్నికల నిర్వహించవలసినదిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధి కోరినప్పుడు - నేర చరిత్ర గలవారిని, ఎన్నికల నుండి బహిష్కరిస్తానని ఈ షరతులకు సమ్మతమైతేనే ఎన్నికలు నిర్వహిస్తానని చెప్పారు. రాహుల్ సరే అన్నారు. ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, తదితర రాష్ట్రాలలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించారు. ఇలా స్వాంతంత్ర పరిరక్షణకు ఒక విధంగా తన వంతు కృషి చేస్తూనే ఉన్నారు రావు గారు.

ఫౌండేషన్ ఫర్ అడ్వాన్స్ మెంట్ ఆఫ్ ఎలెక్షన్స్ (ఫేం) - ద్వారా పంజాబ్ లో ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఎన్నికలు, ఉత్తరాఖండ్ లో ఎన్ ఎస్ యు ఐ పార్టీ అంతర్గత ఎన్నికలు నిర్వహించారు. నేర చరిత్ర ఉన్న వారిని ఎన్నికల బరిలో నిల్చోనీయకండా వారించారు.

ఎన్నికలలో ఎలక్ట్రానిక్ వోటింగ్ మషీన్ (ఈ వీ ఎం) లు చక్కగా వాడచ్చనీ, అవి " టాంపర్ ప్రూఫ్ " అని, వాటిని కట్టు దిట్టమైన భద్రతలో ఉంచి వొట్లు లెక్కించ వచ్చని తెలిపారు రావు గారు.

డబ్బుతో, మందుతో వోట్లు కొనే నికృష్ట పద్ధతిని నిందించారు. వాటి ప్రభావాన్ని తగ్గించడానికి శాయసక్తులా ప్రయత్నించారు, ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ " కాన్సర్ ఆఫ్ కరప్షన్ ని వదల్చాలి " అని వ్యాఖ్యానించారు కే జే రావు గారు.

ప్రపంచంలో అతిపెద్ధ ప్రజాస్వామ్యమైన భారత దేశ రాజకీయ పార్టీలలో ఆంతర్గత ప్రజాస్వామ్యం (ఇంటర్నల్ డెమాక్రసి) చాలా తక్కువ. పార్టీ అధినాయకులు నిర్ణయాలు చేస్తారు. ప్రాధమిక స్థాయిలో పనిచేసిన వారి వినికిడి పైకి వెళ్ళదు. క్రమంగా, స్వేచ్చగా, తగినట్టుగా ఎన్నికలు రాజకీయ పార్టీలలో నిర్వహిస్తే అది రాజకీయ పార్టీలని బలోపేతం చెయ్యడమేకాకుండా, అవినీతి, అర్ధ బలం, ధన బలం ఎదుర్కోవడానికి సరైన మార్గం అవుతుందని వక్కాణించారు. రాజకీయ పార్టీలు వింటున్నాయా!

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు

ఇమెయిల్

ప్రదేశం 

సందేశం

 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech