- రావు తల్లాప్రగడ
 
ప్రధాన సంపాదకులు:
రావు తల్లాప్రగడ 

సంపాదక బృందం:
తమిరిశ జానకి
కస్తూరి ఫణిమాధవ్
సి. కృష్ణ
తాటిపాముల మృత్యుంజయుడు

వెబ్ రూపకల్పన :
సి.కృష్ణ, హైదరాబాద్.

 

కూచిపూడి నాట్య సమ్మేళనం

ఆ.వె.|| భాగ్యనగరిదయ్యె భాగ్యమంతయు కూడ,

కూచిపూడినాట్య కుంకుమంటి!

ఆ కళామతల్లికమరుచు అలరెనో

కాలిగజ్జెగ సిలికానుయాంధ్ర!

సుజనరంజని పాఠకులందరికీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు! గత నెల డిసెంబర్ మాసంలో సిలికానాంధ్ర నిర్వహించిన అంతర్జాతీయకూచిపూడి నాట్యసమ్మేళనానికి లభించిన ఘనవిజయం గురించి చెప్పడానికి మాటలు చాలవు. ఆ విజయాన్ని మాకన్నా ఆంధ్రదేశంలోని పత్రికలూ, టీవీ చానళ్ళే బాగా చెబుతాయి. ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కిరణ్‌కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ నరసింహన్, మంత్రులు దగ్గుబాటి పురందరేశ్వరీదేవి, వట్టి వసంత కుమార్, ఇంకా అనేకమంది  మంత్రులు, మాజీమంత్రులు, సుప్రసిద్ధ కళాకారులు హాజరయ్యి సిలికానాంధ్రను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 2800మంది కళాకారులు ఒకేవేదికపైన ఒకేసారి కూచిపూడి నృత్యం చేసి మరొక్క సారి తమ గిన్నీసు రికార్డుని తామే అధిగమించి సరికొత్త రికార్డును సాధించారు. ఈ విజయాన్ని దృశ్యరూపంలో మీకు అందించి మీ మన్ననలను అందుకోవాలని సిలికానాంధ్ర ఆరాటపడుతోంది.

 
 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

గత సంవత్సరంలో సుజనరంజని కూడా ఎన్నో విజయాలను సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాల మాధ్యమంలో మీ అందరినీ చేరుతూ మెప్పిస్తున్న ఈ పత్రిక నెలకు మిలియను హిట్లకు పైగా నమోదు చేసుకొని, అత్యధికంగా చదువబడే తెలుగు అంతర్జాలమాస పత్రికగా మీ ముందు నిల్చింది. ఎన్నో సాహితీ వైజ్ఞానిక పరమైన పరిశోధనలను, వ్యాసాలను, అందించి తనదైన మేలిమి స్థానాన్ని సంపాదించుకుంది. ఒక ప్రక్క కథలు, కవితలు, కబుర్లు, నీతులు నిండిన శీర్షికలను అందిస్తూ, భావితరాలకు మన సంస్కృతి పట్ల, మన విజ్ఞానం పట్ల అవగాహను పెంచుతూ, ముందుకు సాగుతోంది మన సుజనరంజని.

 

ఈ సంవత్సరం నుంచీ ప్రతి నెలా ఒక సరిక్రొత్త శీర్షికను మీకు అందించాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా, ఈ జనవరి నెలనుంచీశ్రీ మందపాటి సత్యంగారు అందించే "సత్యమేవ జయతే" అనే సరిక్రొత్త శీర్షికను ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. మందపాటి సత్యంగారు సుజనరంజని పాఠకులకి సుపరిచితులు, ఒక ఉత్తమ ప్రవాసాంధ్ర రచయిత! గత నాలుగు దశాబ్ధాలుగా వారి రచనలను ప్రపంచ వ్యాప్తంగా అన్ని పత్రికలూ ప్రచురించాయి. అందరు ఆంధ్రులూ ఆదరించారు. వీరి చమత్కార శైలి, కొంటె పొడుపులు, ఒక ప్రక్క నవ్వు తెప్పిస్తూనే, మరొక ప్రక్క మహత్తర సందేశాలను అందిస్తుంది. ఈ క్రొత్త శీర్షికను కూడా మీరలాగే ఆదరించి ఆనందిస్తారని సుజనరంజని నమ్ముతోంది.

అలాగే ఈ నెల శ్రీమతి దశిక శ్యామలా దేవిగారి "సాహితీ సదస్సు సభా భయం" అనే ప్రత్యేక వ్యాసాన్ని కూడా మీ ముందుకు తెస్తున్నాము. వీరు కూడా సుజనరంజని పాఠకులకు సుపరిచితులు, ఒక సుప్రసిద్ధ రచయిత్రి.

 

ఇంకా అనేక క్రొత్త శీర్షికలను త్వరలో ప్రవేశ పెట్టబోతున్నాము. మన పత్రిక ఉనికిని అందరికీ తెలియజేయండి. చదవండి. చదివించండి. సుజనరంజని, సిలికానాంధ్రలు సాధించిన ఈ విజయాలు - మీ విజయాలు. వీటిని అందరితో పంచుకోండి. వీటిని మరింతగా పెంచుకోండి.

 

మరొక్కసారి అందరికీ ఆంగ్ల నూతన వర్ష శుభాకాంక్షలు!

 

మీ

రావు తల్లాప్రగడ

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech