aa

 పుస్తక పరిచయం  సాహితీ అంబరాన్ని తాకే "దిగంబర" 
                                                                                    - శైలజా మిత్ర

       

''చెట్టే కదా ! అని తేలిగ్గా కొట్టి పారేయ్యకు 
చెట్టంటే.. ఆకులు
, కొమ్మలు
పువ్వులు
, కాయలే కావు.. 
చెట్టంటే కాలుష్య హాలా హలాన్ని మింగి
 
ప్రాణవాయువును పంచే గరళ కంటుడు
"

అంటూ "ఆకుపచ్చని ఆయుధం" అనే కవితతో పర్యావరణం కాపాడాలన్న భాద్యతతో ఒక మంచి మనసున్న కవిగా ఈ కవితా సంపుటిని ప్రారంభం చేయడం గర్వించాల్సిన విషయం.ప్రపంచంలో ప్రతి ఒక్కరు సమాజంలోని దుస్సంఘటనలకు ఆవేదన చెందుతాడు. కానీ ఒక బాధను, ఆవేదనను తనకు తానే అనుభవించేలా బాధపడే వాడు మనసున్న కవిగా మనగలుగుతాడు.  ఆ విధంగా మౌనశ్రి మల్లిక్ కవిగా మొదట్లోనే మన్ననలు పొందారు.. 

 
 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

నేడు సమాజ౦ లో సామరస్యం లేక ఏది చెడు, ఏది మంచి అనేది నిర్ణయించుకోకుండా తనకు తానే అయోమయంలో పడి ఒక అధికారం కోసమో, కాస్తంత ధనం కోసమో వెదుకులాడుతూ, మానవత్వం మరచి కాలం వెళ్ళ దీస్తోంది.ఖచ్చితంగా చెప్పాలంటే  ప్రేమ లేదు. ఆదరణ, ఆత్మీయత లేదు. అంతా అవసరమే. అందుకేనేమో ఈ కవి ఇలా స్పందిస్తారు..

"గాలి , నీరు, కలుషితం
మాట
, మంచి, కలుషితం
నువ్వు నవ్వు కలుషితం..
అంతా కలుషితం..

కలుషితం కానిది అమ్మ మాత్రమె"  అంటూ వీరి " అమ్మ ఒడిలోకి వెళదాం" అందే కవిత్వంలో మనిషిని నీకేమి కావలంటావు అని నిలదీశారు. పదాల్లో గజిబిజి లేకుండా స్పష్టంగా ప్రతి కవిత ఇక్కడ పొందుపరిచారు. వరంగల్ జిల్లాలోని వర్ధన్న పేటలో పుట్టి పెరిగిన కవి దాదాపు పదేళ్లుగా నగరంలోనే స్తిరపద్దరు. సహజంగానే వీరి కవిత్వంలో ఆత్మీయత ఉంటుంది.. ఎందుకంటే మట్టి వాసన, పాత నగర ప్రజల జీవన దుస్థితి, తగ్గిపోతున్న మానవీయత, నిలవడానికి నీడలేకుండా చేసుకుంటున్న మానవ అయోమయ స్తితి ని కళ్ళకు కట్టినట్లు పొందుపరిచారు.  ఉదాహరణకి.. నేడున్న చేనేత కార్మికుల దుస్థితి ఎవరికీ తెలియనిది కాదు. కానీ రైతు స్తితిగతులు కళ్ళకు కనిపిస్తుంది కానీ చేనేత కార్మికుల స్ధితి వారికి  మాత్రమె అర్థమవుతుంది అన్న మాట ఇక్క్కడ కవిత రూపంలో ఎలా పొందుపరిచారో గమనిస్తే..

"మీరందరూ ధరించి మురిసిపోయే 
రంగు రంగుల బట్టలు
మా నరాలను దారాలుగా మార్చిన అల్లిక
 
నలుపు రంగు కోసం
 
మా చర్మం పైపొరను కరిగిస్తాం.
 

తెలుపు రంగు కోసం రెండో పొరను కరిగిస్తాం " అంటూ శరీరంలో ఒక్కో రంగుకోసం ఒక్కో పొర ఎంతగా కరిగిస్తాడో అనే విషయాన్ని ఎంతో ఆవేదనగా తెలిపారు. ఇందులోనే చివరలో "అణచబడ్డ మా పుర్రెలు/ మందుపాతరలై గాలిలోకి లేస్తాయి " అంటారు ఆవేశంగా. కానీ ఇలా అణచబడ్డ ప్రతి గుండె ఇలా ఆలోచిస్తే ఎలాగా అనిపించక మానదు కూడా. వీరి కవిత్వంలో మానవీయ స్పందన ఉంది. సమాజం పట్ల బాధ్యత ఉంది.  ఎంతో ఆత్మీయమయిన బాల్యం,పుట్టి పెరిగిన పల్లె, ఈత నేర్పిన గురువు, చెట్టు, ప్రపంచీకరణ దుశ్చర్యలు అన్నీ అక్షర రూపంలో మనకు దర్శనమిస్తాయి. 

ఇవే కాకుండా నేడు మన వాతావరణాన్ని కులం, మతం, వర్గం, వాదం అన్నీ దూరం చేస్తున్నాయి. అని తెలుసుకుని విసిగిపోయిన ఈ కవి ఇలా స్పందిస్తారు " నాకు ఏ మతం వద్దు/ నాకు ఏ దేవుడు వద్దు / నాకు మానవత్వమనే మతం కావాలి/ సాటి మనిషిని మనిషిగా చూసే / మనిషే దేవుడు కావాలి.."  అని 'నిజమ్మేదోట్టు" అనే కవితలో తమ ఆవేదనను వ్యక్త పరిచారు.  అలాగే " నాన్న పరిమళం" మనీషి" చావు మరణం ఒకటి కాదు" లాంటి కవితలు గుండెను తట్టి పలకరిస్తాయి..ఈ సంపుటిలో 55 కవితలున్నాయి. ప్రతి ఒక్కటి ఒక్కో భాద్యత నెరిగిన సైనికుడిలా కనిపిస్తాయి. నేనున్నాను కదాని ఓదార్చే అమ్మలా కనిపిస్తాయి. అలాంటివే ఈ పాశవిక చిత్రాలు.. ఒక ద్రోహి ఊరేగింపు అడవితల్లి, ఇలా ప్రతిఒక్క టి పాటకుల్ని అలరిస్తాయి ప్రముఖ కవులు శ్రీ మౌనశ్రి మల్లిక్ గారు మొదట మానవతా వాది.. సహజంగా స్నేహశీలురు, కలం కాలంతో ఎదుగుతున్న నిరంతర కృషీ వలురు.   సామాజిక భాద్యత మనతో  ఉన్నంతకాలం మనం మనలోనే ఉంటాము. ఆ విధంగా ఆలోచిస్తే వీరు ప్రముఖుల వరుసలో నిలుచున్నవారే అందుకు సందేహం లేదు. ఈ కలం కలకాలం కవుల వాకిళ్ళలో మరింత కమనీయంగా దర్శనమిస్తుందని ఆశిద్దాం..

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech