"సమస్యాపూరణం:
ఈ
క్రింది
"సమస్యని"
అంటే
ఆ
వ్యాక్యన్ని
యదాతధంగా
ఒక
పద్యంలోకి
ఇమిడ్చి
వాడుకుంటూ
రాయాలి.
ఒకవేళ
పద్యం
కాకపోయినా
ఒక
కవిత
రాసినా
కూడా
వాటిని
మేము
సగౌరవంగా
స్వీకరిస్తాము.
మీ
జవాబులు
ఈ-మెయిల్
(విద్యుల్లేఖ)
ద్వారాకాని
(rao@infoyogi.com)
ఫాక్స్
ద్వారాకానీ
(fax: 408-516-8945)
మాకు
జనవరి
20వ
తారీఖు
లోపల
పంపించండి.
ఈ మాసం సమస్యలు
ఉత్తమ
పూరణలను
తరువాయి
సంచికలో
ప్రచురిస్తాము.
ఇక్కడ రెండు సమస్యలను ఇస్తున్నాం. ఈ రెండికీగానీ, లేక ఏ వొక్క
దానికైనాగానీ మీరు మీ పూరణలను పంపవచ్చు
తే.గీ.||
లింగమడ్డువచ్చె గుడిని మ్రింగ బోవ
ఆ.వె.||
బేరమాడబోతె నేరమాయె
క్రితమాసం సమస్యలు
కం.||
ఆకలి ఆనందమయమె
ఆ.వె.||
సురను త్రాగ బట్టి సురులు యైరి
ఈ సమస్య లకు వచ్చిన ఉత్తమ పూరణలు ఇలా వున్నాయి.
మొదటి పూరణ -
-
గండికోట విశ్వనాధం,
హైదరాబాద్
,
కం.||
శ్రీకరమౌ వ్రత శీలికి
భీకర పోరున విధి నెరపెడి వీరునికిన్
సకియ కవుగిలి సరసునికి
ఆకలి ఆనందమయమె- అనిపించు మదిన్
కం.||
ప్రకటిత భక్తియు నిష్ఠ ప
రాకాష్టకు జన నొక శివరాత్రహరహమున్
ఆకలి ఆనందమయమె
ఒకపరి వుపవాస దీక్ష ఒప్పుగ పరగన్
ఆ.వె.||
పాల
సంద్ర మధన కాలమందావిర్భ
వింప,
వేష
ధారి విష్ణు మూర్తి
మాయ
చే,
దొరకిన మధురామృతంబగు
సురను త్రాగ బట్టి సురలు యైరి.
రెండవ పూరణ -
వేదుల బాలకృష్ణ,
శ్రీకాకుళం
ఆ.వె.||
సురను త్రాగబట్టి సురలైరి దేవతల్
అమరులైరి నిత్య యవ్వనులును
అట్టి సురను తెచ్చి ఆరగించక నిశా
చరులు అసురులగుచు సమసినారు!
కం.||
ఏకలి యుగంబు జనులకు
శ్రీకరముగ జ్ఞానవృద్ధిచేకూర్చి ఇలన్
సౌకర్యములను పెంచెను
ఆ"కలి" ఆనందకరమె అగుటను వినమే!
మూడవ పూరణ - పర్వతనేని రాధికారాగమంజరి
కం.||
ఆకలి పరిపరి విధములు
ఈ కలిలో తిండికొరకు,నెన్నిటికొరకో
ఆకలి దుఃఖమె గానీ
ఆకలి ఆనందమయమె ఆత్మస్తుతిలో.
తిండిలేకపోవటం ఒక్కటే కాక మనుషులకు అనేక రకాలైన ఆకళ్ళు ఉంటాయి.ఏ
ఆకలియైనా నిజానికి దుఃఖాన్ని కలిగిస్తుందేగానీ
,తనను
తాను పొగడుకోవటం అనే ఆకలిమాత్రం ఆనందమయమే.ఇంకా,ఇంకా
ఆ ఆకలి పెరిగినకొద్దీ ఆనందంగానే ఉంటుంది
నాలుగవ పూరణ- కృష్ణ అక్కులు,
హైదరాబాద్
కం||
సోకులు చూడ తగిలినే
షాకులు,
కరువాయె నిదుర,
సరిగా కాదే
ఆకలి,
అనందమయమె
నీకౌగిలి,
సాటిరాదె నింకొక స్వర్గం
ఆ.వె||
బీరు త్రాగ బట్టి బీపి షుగరులొచ్చె
కాల్చగ సిగరెట్టు క్యాన్సరొచ్చె
వ్యాధులేమిరాని వారె సురజనులు
సురను త్రాగ బట్టి సురులు యైరి
ఆ.వె||
చదువు వచ్చి నోడు పదవిరాక నేడ్చె
తళుకు వొళ్ళు బాల తార నయ్యె
చదువు రాని వాడు చక్కగ మంత్రయ్యె
సురను త్రాగ బట్టి సురులు యైరి
ఆ.వె||
వెన్న తినగ నయ్యె కన్నయ్య కృష్ణుడు
గిరిని మోయ నయ్యె గిరిధరుడును
మధిర గ్రోల వచ్చె మధము అసురులకు
సురను త్రాగ బట్టి సురులు యైరి
ఐదవ పూరణ- యం.వి.సి.రావు,
బెంగళూరు
ఆ.వె.||
పాల కడలి చిలికి,
పడతి పంచునపుడు
సురను త్రాగ బట్టి సురులు యైరి
సురను త్రాగ మరిగి సుదతి పంచనిపుడు
నేర వృత్తులైరి నేటియువత
కం.||
ఆకలి ఎరుగని రోగికి
ప్రాకటమగు ప్రకృతి వైద్య పద్ధతి లోనన్
ఆకుల పసరును ఇవ్వగ
ఆకలి ఆనందమయమె ఆయ్యెను మిగులన్
ఆరవ పూరణ-
రావు తల్లాప్రగడ, శాన్ హోసే, కాలిఫోర్నియా
ఆ.వె.||
అసురుడవ్వుతావు పిసరంత సారాని
త్రాగలేకపోతె! తందనాన!
సురను త్రాగ బట్టి సురులు వారమరులు!
త్రాగియింకతొక్కు! తందనాన!
కం.||
పీకలదాకను మ్రెక్కుతు
కేకలు పెట్టుతు అరగక గిలగిల మనగా,
ఆకలి ఆనందమయమె
నీకును అపుడపుడిటులను నిక్కము భోక్తా!
ఏడవ
పూరణ -
- ఎఱ్ఱా విశ్వనాధం,
శాన్ హోసే,
కాలిఫోర్నియా
కం.||
ఆకలి ఆకలి కలియని
ఆకలి యని అలమటించు దౌరా తగునా?
ఆకలి యయినది కనుకనె
ఆ"కలి" ఆనందమయమె అతివా నాకున్
సూచన: "కలి" అనగా పులిసిన గంజితో కలసిన అన్నము
కం.||
ఇక కృత త్రేతా ద్వాపర
మాకలి యని నాల్గు యుగములవనిని;
ఇందున్
ఇక కలియుగమిది గనుకను
ఆకలి ఆనందమయమె యగునందరికిన్
ఆ.వె.||
చుట్ట త్రాగ బట్టి చుట్టాలు వీరలు;
అట్లు తినుట బట్టి అయిన వారు;
సురను త్రాగనట్టి వీరలు అసురులు;
సురను త్రాగ బట్టి సురులు వారు.
|