me.jpg

జ్యోతిష్యులు - డా. పిడపర్తి సుబ్రహ్మణ్యం.

బెనారస్ హిందు విశ్వవిద్యాలయంలో ఆచార్య(MA) మరియు చక్రవర్తి(Ph.D) పట్టాలను పొంది రాష్ట్రీయ సంస్కృత సంస్థానంలో జ్యోతిష్య శాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు.               జ్యొతిష్య శాస్త్ర సంబంధిత అధ్యయనంలో విశేషమైన కృషిని, సేవలను అందిస్తున్న డా. పిడపర్తి సుబ్రహ్మణ్యంగారిని సుజనరంజని పాఠకులకు పరిచయం చేయడానికి గర్విస్తున్నాము..

  

http://www.jagjituppal.com/images/2aries.gif

            మేషరాశి

అశ్విని (అన్ని  పాదాలు), భరణి (అన్ని  పాదాలు), కృత్తిక (మొదటి పాదం) 

 

ఈ నెల యొక్క మొదటి పదహేనురోజులు ఉత్సాహరహితములు. అనుకోని ఇబ్బందులు దీనత్వాన్ని తెచ్చి పెట్టే అవకాశములు ఎక్కువ. అధికారుల మరియు ప్రభుత్వోద్యోగుల సహకారములు లభించు అవకాశములు లేవు. అవమానములు ఎదురయ్యే అవకాశములు ఉన్నవి. ఖర్చులకు రెక్కలు వచ్చును. పూర్తి అవబోయే కార్యములు వాయిదా పడు అవకాశములున్నవి. కానీ ఈ విపత్కర పరిస్థితులు మొదటి రెండు సప్తాహములు మాత్రమే ఉండును కావున సమయమును ధైర్యముగా అధిగమించవలెను.
ఉత్తరార్థములో చెప్పుకోదగ్గ మార్పులు లేవు. కానీ పూర్వార్థములో చెప్పబడిన విపత్కర మరియు విపరీత పరిస్థితులు ఉండవు. అవమానములు మరియు ధనవ్యయము చాలా వరకు తగ్గును. కార్యములు సిద్ధించడము ప్రారంభిస్తాయి. కానీ వేగవంతముగా కాదు. కార్యములు క్రమేణ ఫలలితములను ఇవ్వడము ప్రారంభిస్తాయి. కానీ ఈ రాశివారిలో ఈ సమయమునందు కొంత ఉగ్రస్వభావము కనిపించు అవకాశమున్నది.
అనుకూలముగా ఉన్న గ్రహశాతము చాలా తక్కువ కావున ఈ రాశివారు ఈ మాసమునందు అనుకూల ఫలితములను పొందు నిమిత్తము తగిన విధముగ భగవన్నామస్మరణము చేయవలెను. సూర్య ప్రార్థన మరియు రుద్రార్చన వీరికి మానసిక శాంతిని, కార్యసాఫల్యతను ఇవ్వగలదు.
 

http://www.jagjituppal.com/images/2taurus.gif

వృషభరాశి

కృత్తిక (2,3,4 పాదములు), రోహిణి (అన్ని పాదాలు), మృగశిర (1,2 పాదాలు

 

ఈ మాసపు పూర్వార్థము ఆరోగ్యపరముగా ఇబ్బందికరముగా కనబడుతున్నది. అందువలన ఈ రాశివారు ఆరోగ్యవిషయములో ఎటువంటి అశ్రద్ధ చేయరాదు. ఎటువంటి ఉద్రేకములకు మరియు ఆవేశములకు లోను కారాదు. కలహములకు అవకాశమున్న కారణముగ ఏ విషయమునందు అతిగా ప్రతిస్పందించరాదు. ప్రస్తుతము సమయము ఏ విధముగానూ అనుకూలముగా కనబడని కారణముగా ఈ రాశివారు ఎటువంటి కొత్త పనులను ప్రారంభించరాదు.
ఉత్తరార్థము కొంత మెరుగా ఉండును. ఈ మెరుగు పూర్వార్థముతో పోల్చినపుడు మాత్రమే అని గ్రహించాలి. పరిస్థితులు చక్క బడడానికి కొంత సమయము అవసరము. కావున సహనముతో వేచి చూడగలరు. ఉత్తరార్థములో ధనవ్యయము మరియు ఆత్మన్యూనతా భావము కలుగు అవకాశమున్నది. ఏ విషయమును కూడ పరువు ప్రతిష్ఠతో జత చేసి చూడరాదు. ఆ విధముగ చేసిన మానసిక ఒత్తిడి హద్దులు దాటగలదు.
ప్రస్తుతము ఈ రాశివారికి అన్ని గ్రహముల అనుగ్రహము అవసరము కావున వీరు అందిరికీ ముఖ్యుడైన సూర్యభగవానుని ముఖ్యముగా ఆరాధించుకోవాలి. ఆదిత్య హృదయస్తోత్రమును ప్రతిదినము క్రమము తప్పకుండ పఠించిన అన్ని రకముల ఆపదలయందు వీరికి శుభము కలుగగలదు. అనగ ఆపదలు వీరికి నష్టమును కలిగించవు.

http://www.jagjituppal.com/images/2gemini.gif

మిథునరాశి

మృగశిర (3,4 పాదాలు), ఆరుద్ర (అన్ని పాదాలు), పునర్వసు (1,2,3 పాదాలు)

 

 

ఈ రాశివారి ఆత్మస్థైర్యమును మరియు సహనమును పరీక్షించు సమయమిది. ఈ సమయములో ఏ గ్రహమూ అనుకూలముగా లేదు. మొదటి మూడు నాలుగు రోజులు బుధుని అనుకూలత కనిపిస్తున్ననూ ఆ ప్రభావము పరిస్థితుల పై ఏ మాత్రము ప్రభావమును చూపు అవకాశము లేదు. కావున వీరు ఈ పరీక్షలో ఉత్తీర్ణులవ్వడానికి ప్రయత్నించాలి. అన్ని విషయములందున సహనముతో వ్యవహరించాలి. ఆవేశము, అనాలోచిత నిర్ణయములు దిద్దుకోలేని నష్టములు కలిగించ వచ్చును. కావున జాగ్రత్త అవసరము.
ఉత్తరార్థము కూడ ఇంచుమించు ఇదేవిధముగా ఉండు అవకాశమున్నది. ఇబ్బందుల రకములో మార్పు ఉండవచ్చును కానీ ఇబ్బందులు తొలగుతాయి అని చెప్పలేము. స్త్రీలతో, కుటుంబము వారితో, బయటివారితో, అధికారులతో, పిల్లలతో, పెద్దలతో ఇలా ప్రత్యేకించి చెప్పనవసరము లేదు. అందరితో, మరియు అందరి విషయములోనూ ఆచి తూచి వ్యవహరించగలరు. సాధ్యమయినంత వరకు నిర్ణయాత్మకమైన పనులను వాయిదా వేసుకోగలరు.
ఆదిత్యహృదయస్తోత్రము మరియు శివారాధన మానసిక స్థైర్యమును మరియు అనుకూల పరిస్థితులను కలిగించుటలో సహకరించగలవు.

http://www.jagjituppal.com/images/2canc.gif

ర్కాటక రాశి

పునర్వసు (4 పాదం, పుష్యమి (అన్ని పాదాలు),ఆశ్లేష (అన్ని పాదాలు)

 

 

ఈ రాశివారికి ప్రస్తుతము సమయము పూర్తిగా అనుకూలముగా ఉన్నది. వారి మనోగతములు మరియు అభీష్టములు అయిన కార్యములను నెరవేర్చుకొనుటకు ఇది మంచి సమయము. పూర్తి అనుకూలత మాసపు పూర్వార్థములోనే ఉన్న కారణముగ ఈ రాశివారు ఈ అవకాశమును పూర్తిగా సద్వినియోగ పరచుకోగలరు. ఆధికారికములు మరియు వ్యక్తిగతములు అయిన నిర్ణయాత్మకములైన కార్యములను మరియు కార్యక్రమములను ఈ సమయములో పూర్తిచేసుకోవడానికి ప్రయత్నించుకోవాలి.
ఉత్తరార్థములో తాత్కాలికముగ రెండు గ్రహములు ప్రతికూలస్థానమును పొందుతున్నవి. ఈ రెండు గ్రహముల ప్రతికూలత ముఖ్యముగ ఆరోగ్యముపై ప్రభావమును చూపు అవకాశమున్నది. అందులోనూ ముఖ్యముగ ఉదరసంబంధమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశములు ఎక్కువ. కావున బయటి భోజనమును తిరస్కరించుట, ఆహారనియమములను పాటించుట అవసరము.
ఆహార సంబంధిత ఇబ్బందులను దూరముగా ఉంచుటకు ప్రాణాయామమును మరియు పద్మ వజ్రాసనములను ప్రయత్నించగలరు. ప్రాణాయామమునందు ప్రణవమునకు ఎక్కువ అవకాశమును ఇవ్వగలరు.

http://www.jagjituppal.com/images/2eo.gif

సింహరాశి

మఖ(అన్ని పాదాలు), పూర్వ ఫాల్గుణి(అన్ని పాదాలు), ఉత్తర ఫాల్గుణి (1 పాదం)

 

ధనవ్యయము మరియు హీనభావన ఈ రాశివారిని ఈ మాసపు పూర్వర్థములో మానసికముగ ఇబ్బందిపెట్టు అవకాశములున్నవి. దీనికి తోడు గత కొంత కాలముగా నడచుచున్న ఏలినాటి శని మరియు ఇప్పుడే ప్రారంభమయిన అష్టమగురుల కారణముగా ఈ పూర్వార్ధము వీరిని శారీరకముగ మరియు మానసికముగ ఒత్తిడికి గురి చేయగలవు. కానీ ఈ విపత్కర పరిస్థితి కొంత కాలమునకు మాత్రమే పరిమితమయినది.
ఉత్తరార్థము వీరికి పూర్తి అనుకూలముగా ఉండగలదు. శని గురుల దుష్ప్రభావము వీడకున్ననూ మిగిలిన గ్రహముల శుభత్వము కారణముగ వీరికి విశేష శుభములనివ్వగలదు. ఉత్తరార్ధములో విరోధుల ప్రాబల్యము పూర్తిగా తగ్గగలదు. ధనాగమమునకు అనేక మార్గములు సుగమమవ్వగలవు. సుఖము మరియు లాభము వీరికై వేచియుండు సమయమిది. కావున ఈ రాశివారు ఈ అవకాశమును సద్వినియోగపరచుకోగలరు.
ప్రస్తుతసమయములో వీరికి ఎక్కువ ఇబ్బంది శని గురుల వల్ల కలుగుచున్న కారణముగ వీరు ప్రతి నిత్యము శివారాధన చేయుట మంచిది.

http://www.jagjituppal.com/images/2virgo.gif

కన్యా రాశి

ఉత్తర ఫాల్గుణి (2,3,4 పాదాలు), హస్త (అన్ని పాదాలు), చిత్ర (1,2 పాదాలు)

 

గ్రహముల ఆనుకూలత కన్నా వ్యతిరేకతే అధికముగా ఉన్నది. ఆ కారణముగ చికాకులు, త్రిప్పట, పొందిన వాగ్దానములు పూర్తిగాకుండుట జరుగగలవు. ఈ సమయములో ప్రతీ పనికి ఒకటికి రెండు సార్లు ప్రయత్నించవలసి వచ్చును. అధికారులు, ఆప్తులు హామీలు ఇవ్వగలరు కానీ వానిని పూర్తి చేయలేరు. కావున ఎక్కువ సందర్భములలో నిరాశ పడే అవకాశములున్నవి. వ్యతిరేకలు కారణముగ పనులు ఆగిపోగలవు. కావున మాసపు పూర్వార్ధములో ఆచి తూచి వ్యవహరించగలరు. సాధ్యమయినంత వరకు కార్యములను కొంత కాలమునకు వాయిదా వేసుకోగలరు. మితృలనుండి ఈ సమయములో సహకారము లభించగలదు.
ఉత్తరార్ధము కూడ మిశ్రమముగానే ఉండును. కొన్ని గ్రహముల స్థానమార్పు ధనవ్యయమును సూచిస్తుంటే మరి కొన్నింటి మార్పు వీరికి ధనలాభమును సూచిస్తున్నది. అనగ ఈ సమయములో రాక పోక సమానముగ ఉండు అవకాశమున్నది. బుధుని మార్పు కారణముగ ఈ సమయములో స్వజనులవిషయములందు మరియు కుటుంబమునందు వృద్ధి జరుగును. వ్యాపారాదులయందు మరియు పెట్టుబడులయందు లాభములు కలుగు అవకాశములు కూడ ఉన్నవి. కానీ జాగ్రత్త అవసరము.

http://www.jagjituppal.com/images/2libra.gif

తులారాశి

చిత్ర (3,4 పాదాలు), స్వాతి (అన్ని పాదాలు), విశాఖ (1,2,3 పాదాలు)

 

      

ఈ రాశివారికి పూర్వార్ధము చాలా వరకు అనుకూలముగా కనబడుతున్నది. ఏలినాటి శని ప్రభావముగా త్రిప్పట అధికముగా ఉండును. కానీ ఇది ప్రత్యేకముగా ఈ మాసములో ప్రారంభమవకపోవడంతో కొత్తగా దాని ప్రభావమేమీ అనుభవములోకి వచ్చు అవకాశములేదు. ఆధికారికములైన కార్యములు సాధ్యమయినంతవరకు పూర్వార్ధములోనే కార్య రూపము దాల్చు అవకాశములున్నవి.
ఉత్తరార్ధములో శారీరిక సమస్యలు తలెత్తు అవకాశమున్నది. జ్వరపీడ బాధించు అవకాశమున్నది. కానీ పూర్వార్ధములో తటస్థుడుగా నున్న కుజుడు ఉత్తరార్థములో పూర్తి అనుకూలుడుగా మారుతుండుటచే వీరికి ప్రత్యేకముగ లాభములను కలిగించు అవకాశము కూడ ఉన్నది. ఈ సమయములో వీరికి ఎదురు చెప్ప ఎవరూ సాహసించు అవకాశములేదు.
కుజ ప్రభావకారణముగ వివిధ మార్గములు ద్వారా ధన ప్రాప్తిని, కలహములు, వివాదములు మరియు కోర్టు వాజ్యములయందు విజయమును కూడ కలిగించు అవకాశమున్నది, ఉత్తరార్ధములో ప్రత్యేకముగ శారీరిక ఇబ్బందులు సూర్యుని అర్ధాష్టమ స్థితి వలన కలుగుచున్నవి కావున ఈ గోచర దుష్ప్రభావమును నుండి శాంతిని పొందుటకు ఆదిత్య హృదయ స్తోత్రమును పఠించగలరు.
 

http://www.jagjituppal.com/images/2scorp.gif

వృశ్చికరాశి

విశాఖ (4 పాదం), అనూరాధ (అన్ని పాదాలు), జ్యేష్ట (అన్ని పాదాలు)

 

ప్రస్తుతమాసము ఈ రాశివారికి అనుకూలము గా ఉన్నది. పూర్వార్ధములో వంచనలు, విత్తభ్రంశము మరియు కంటికి సంబంధించిన రోగములకు అవకాశమున్నది. అధికారులు మరియు పాలకులకు దగ్గరయ్యే అవకాశములు కనబడుచున్న కారణముగ అటువంటి ప్రయత్నములనము సలుపగలరు. ఈ సమయములో అత్యుత్సాహము కారణముగ కొంత పరాభవమును పొందగలరు. కానీ ఈ స్థితి కేవలము మొదటి వారమునకే పరిమితము. ఆ తదుపరి స్నేహితులు మరియు బంధజనుల సహకారప్రభావమున అభివృద్ధిని పొందగలరు.
ఉత్తరార్ధములో పెద్ద మార్పులు గోచరించుటలేదు. కుజుని దుష్ప్రభావము ఉత్తరార్ధములో నశించి తటస్థస్థానమును చేరుచుండుటచే ఈ సమయములో కార్యములందు వేగమును గమనించగలరు. అధికాధికముగ ఇబ్బందులు కుజుని కారణముగ ఏర్పడుచుండుట వలన ఈ కుజుని మార్పు వీరికి చాలా వరకు ఊరటను కలిగించగలదు.

http://www.jagjituppal.com/images/2saggi.gif

ధనూరాశి

మూల (అన్ని పాదాలు), పూర్వాషాడ (అన్ని పాదాలు), ఉత్తరాషాడ (1 పాదం)

       

ప్రస్తుతము పరిస్థితులు ఈ రాశివారికి ఉద్రిక్తముగ ఉన్నవి. ప్రయాణాదులయందు జాగ్రత్త అవసరము. హృదయరోగ పీడితులయ్యే అవకాశములు ఎక్కువగా కనిపించుచున్నవి. వైభవమునందు క్షీణత గోచరించుచున్నది. పరిస్థితులు కల్లోలముగా కనిపిస్తున్నాయి కావున ఆచి తూచి వ్యవహరించవలసిన అవసరము చాలా ఎక్కువగా కనబడుతున్నది. ఈ ప్రతికూలత పూర్వార్ధమునందు కనబడుతున్నది.
ఉత్తరార్ధములో చెప్పుకోదగ్గ అనుకూలత రాకున్ననూ ప్రతికూల పరిస్థితులలో మార్పులు సంభవించుచున్నవి. ఉద్రేకములకు, ఉద్రిక్తతలకు మరియు కలహములకు కారణమగుచున్న గ్రహములు ఈ సమయములో తమ దుష్ప్రభావమును వేరు ప్రాంతములకు మార్చుచున్నవి. ఈ మార్పు కారణముగ ప్రభుత్వము మరియు అధికారుల నుండి ఒత్తిడి పెరుగు అవకాశమున్నది. ప్రభుత్వశాఖల తనిఖీలు వీరిని ఇబ్బంది పెట్టు అవకాశములు కూడ ఉన్నవి.
ముఖ్యముగ ఈ రాశివారికి సూర్య కుజుల వలన ఆర్ధిక శారీరిక మరియు సామాజిక ఇబ్బందులు కనిపిస్తున్న కారణముగ వీరు సూర్య నమస్కారములు, ఆదిత్య హృదయస్తోత్రపఠనము, శివాలయ సందర్శనము క్రమము తప్పకుండ చేయవలెను.

http://www.jagjituppal.com/images/2capricon.gif

మకరరాశి

ఉత్తరాషాడ (2,3,4 పాదాలు), శ్రావణ (అన్ని పాదాలు), ధనిష్ట (1,2 పాదాలు)

 

మంచి తలంపుతో తలపెట్టిన కార్యములు మాత్రమే ఈ సమయములో సఫలీభూతములయ్యే అవకాశములున్నవి. ఈ రాశివారికి ప్రత్యేకముగా ఈ మాసములో వ్రాయుటకు ఏమియునూ లేదు. ధనవ్యయము వివిధమార్గములలో తారసపడగలదు. నిరుత్సాహము వెన్నంటి నిలుస్తుంది. స్త్రీ వర్గము కన్నెర్ర చేసే అవకాశములున్నవి. కావున ఈ రాశివారు పూర్వార్ధములో చెప్పబడిన ఇబ్బందులనుండి తప్పించుకొను మార్గములను అన్వేషించుకోవాలి.
ఉత్తరార్ధములో ఉద్రిక్తతలు పెరుగు అవకాశమున్నది. హృదయవికారములు ఇబ్బంది పెట్టగలవు. కలహములు అనుకోకుండా ఎదురవ్వడము వలన నిర్ణయము తీసుకొనుట ఇబ్బందికరముగా మారు అవకాశమున్నది. ఈ రాశివారికి కూడ ఇబ్బందులు కుజ రవుల వలన కలుగుచున్న కారణముగ వీరునూ సూర్య నమస్కారములు, ఆదిత్య హృదయస్తోత్రపఠనము, శివాలయ సందర్శనము క్రమము తప్పకుండ చేయవలెను.
 

http://www.jagjituppal.com/images/2aqua.gif

కుంభరాశి

ధనిష్ట (3,4 పాదాలు), శతభిష (అన్ని పాదాలు) , పూర్వాభాద్ర (1,2,3 పాదాలు)

 

పూర్వార్ధము చాలా వరకు అనుకూలముగ ఉన్నది. ఈ సమయములో సాధ్యమయినంత వరకు పనులను చక్కబెట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఉత్తరార్ధములో పరిస్థితులు విపరీతముగా ఉండే అవకాశములు పూర్తిగా ఉన్న కారణముగ ముఖ్యమైన పనులను ఈ సమయములో చక్కబెట్టుకోవడము శ్రేయస్కరము. పూర్వార్ధము కార్యములలో వీరికి పూర్తి సంతృప్తి లభించగలదు. వీరి ప్రయత్నానుగుణముగ వీరికి ధనలాభము కలుగు అవకాశమున్నది. ఆగి ఉన్న బాకీలు మరియు రావలసిన ధన వ్యవహారములు ప్రయత్నించిన సఫలీకృతములు కాగలవు.
ఉత్తరార్ధము పూర్వార్ధముకు భిన్నముగా ఉన్నది. కార్యములందు విఘ్నములు ప్రారంభమయ్యే సూచనలు కనబడుతున్నాయి. నానా వ్యయములు, మానసిక వేదన, కుటుంబమునందు మనస్పర్ధలు, నేత్రముయందు పీడ వీరికి ఇబ్బందులు కలిగించే అవకాశములున్నవి. కల్మషములేని కార్యములు మాత్రము ఫలించగలవు.
సూర్యారాధన వీరికి గోచర దుష్పభావమునుండి కొంతవరకు ఊరటను కలిగించగలదు.
 

 

http://www.jagjituppal.com/images/2psices.gif

మీనరాశి

పూర్వాభాద్ర (4 పాదం), ఉత్తరాభాద్ర (అన్ని పాదాలు), రేవతి (అన్ని పాదాలు)

ఈ మధ్యకాలములో జరిగిన గురుని మార్పు కారణముగ ఈ రాశివారు ఇప్పటికే మానసిక ఒత్తిడిని మరియు కార్యస్థానమునందు వ్యతిరేకతను అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితినుండి కొంతవరకు ఊరట పూర్వార్ధములో లభించగలదు. సూర్యప్రభావకారణముగ అధికారుల అండదండలు వీరికి లభించు అవకాశములున్నవి. కొన్ని గ్రహములయందు తటస్థభావము ఉండుటచే కలహములు లేక విభేదములు ప్రస్తుతము వీరికి ఇబ్బంది కలిగించవు.
ఉత్తరార్ధము పూర్వార్ధముకన్నా మెరుగుగా ఉండు అవకాశమున్నది. ఈ సమయములో అన్నరగంములయందు వీరికి కార్యసాఫల్యత కలుగగలదు. ధనలాభము మరియ రావలసిన బకాయిలు తిరిగి పొందుటకు ఇది అనువైన సమయము. కోర్టువాజ్యములను ఈ సమయములో తమకనుకూలముగ మార్చుకొనగలరు. వ్యాపార లావాదేవీలు, కార్యాలయములందలి కార్యములు, కొత్తపనుల ప్రారంభమునకు ఇది అనువైన సమయము కావున ఈ అవకాశమును సద్వినియోగ పరచుకోగలరు.

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech