రచన - రావు తల్లాప్రగడ, సంగీతం - సాయి మానాప్రగడ

  ఈ గీతం వినడానికి:  
          (బటన్ నొక్కాక పాట వినడానికి అవసరమైతే కొంచెం వేచి ఉండగలరు)              
 
 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

వర్షం (గజల్)

ఎవరికుంది తడవాలని ఈ వర్షంలో, ఉరుములలో పిడుగులమడిలో ఈ ఆరాటం తీరేనా!

విల్లులతో చల్లిన ముల్లుల జల్లులతో, ఈ కల్లల చల్లటి ఒడిలో నా ఆరాటం తీరేనా!

చక్కనియా చినుకులలో, చిందులనే తొక్కాలనె, చిరుకాంక్షే నామదిలో చిగురిస్తూ ఉదయిస్తే,

పెనుగాలీ ఉప్పెనలై, నను సాంతం మింగేస్తే, తడవాలని తపియించే నా ఉబలాటం తీరేనా!

ఎవరికుంది తడవాలని ఈ వర్షంలో, ఉరుములతో పిడుగులమడిలో ఈ ఆరాటం తీరేనా!

విరబూసిన సనజాజిని, తనచేతుల తాకాలనే, తొందరలో తుమ్మెదనై మోహిస్తూ దూకొస్తే,

భువిరాలిన బ్రమరంపై, నీ పాదపు బరువేస్తే, తగిలిననూ తాకాలనే నా ఆరాటం తీరేనా!

ఎవరికుంది తడవాలని ఈ వర్షంలో, ఉరుములతో పిడుగులమడిలో ఈ ఆరాటం తీరేనా!

మనసిచ్చిన మమకారం, నిను సైతం సహియిస్తూ, నినునిన్నుగ నిలువెల్లా ప్రేమిస్తూ పూజిస్తే,

నీ సమయం అరుదంటూ, నీ మొహమే చాటేస్తే, చెలములనీ చెలికానితో ఆ చెలగాటం తీరేనా!

ఎవరికుంది తడవాలని ఈ వర్షంలో, ఉరుములతో పిడుగులమడిలో ఈ ఆరాటం తీరేనా!

రావణుడే మంచోడై, రాముణ్ణే పూజిస్తూ, రామాయణం తానే వల్లిస్తూ రచియిస్తే,

ఖర్మ! రామచంద్రుడే, తన తనువే చాలిస్తే, శ్రీరాముడి అవతారపు ఆ పోరాటం తీరేనా!

ఎవరికుంది తడవాలని ఈ వర్షంలో, ఉరుములతో పిడుగులమడిలో ఈ ఆరాటం తీరేనా!

విల్లులతో చల్లిన ముల్లుల జల్లులతో, ఈ కల్లల చల్లటి ఒడిలో నా ఆరాటం తీరేనా!

ఎవరికుంది తడవాలని ఈ వర్షంలో!

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech