aaaచమత్కారాన్యాసం

                                                                                     - రావు తల్లాప్రగడ

 

(సీసమాలిక)||

నిండుగా కొండలా వెండిగుండేయుండ - వెండికొండల యండ వేరు యేల?

తలమీద అరగుండు తళతళా మెరవంగ- సిగపైన ఇంకోడు చెంద్రుడేల?

కన్నీటికుండలే కంటిపై యుండంగ - నింగిపై ఇంకోతి గంగ యేల?

కష్టాన్ని దిగమింగి కడుపులో దాచంగ - గరళకంఠునిమించు కడుపు నాది!

 

ఇద్దరు పెండ్లాల ముద్దుల మొగుడనే - ధర్మమొకతి యైతె, కర్మయొకతి;

ముప్పిరి గొన్నట్టి ముక్కోపమేయుండ - ముక్కంటి కంటేను మూడురెట్లు;

ఇంద్రియాంకుశధారి ఐంద్రజాలిని నేను- నిద్ర కాదుర యోగ ముద్ర నాది;

శైవమే నాదవ్వ దైవమే నేనయ్యి - రుద్రునే పూజించి రుద్రునైతి !

 

 

 

 

 

 

 

 

 

 


 

 

 

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech