|
ఏ మగాడైనా అర్జెంటుగా ఆత్మహత్య చేసుకోవాలంటే
ఉరితాడు కొనుక్కోవాలట. మెల్లమెల్లగా చావాలంటే ఆడదాని మెడలో
పసుపుతాడు కట్టాలట. ఈ విషయం నేను పెళ్ళి కాక ముందు చదివి చెత్త
కొటేషన్ అనుకున్నాను. అందులో చాలా అర్ధం ఉందని నా పెళ్ళైన తరువాతే
తెలిసింది.నా భార్య మాలతి అందమైంది. చదువుకున్నది. నా విషయంలో
బాగానే ఉంటుంది గానీ, మా అమ్మతో సరిగా ఉండదు. పెళ్ళైన కొత్త సంసారం
కొత్త మోజులో అంతగా పట్టించుకోలేదు గాని ఆ తరువాత, తరువాత నాకు
బాగా అర్ధం అయ్యింది ఏమిటంటే నా భార్యకు నేను కావాలి గానీ మా అమ్మ
అక్కర్లేదు. ఆమెకు ఆవిడ అక్కరకు రాని చుట్టము.నాకేమో మా అమ్మ
అక్కున చేర్చుకునే నాకు కాపల కాసే బంగారు గొట్టము.
అన్ని విషయాలలోనూ ఎంతో అనుకూలంగా ఉండే మాలతి అమ్మ విషయంలో
మాత్రం సరిపెట్టుకోదు. అమ్మలో అస్తమానూ లోపాలు ఎంచుతుంది. అవి ఎలా
ఉండేవంటే అమ్మ నిజంగా తప్పు చేసిందా అనే భ్రమ నాలో కలిగేది. ఆ
అపవాదులను నమ్మలేను, నమ్మకుండా ఉండలేను. నాన్న పోయిన తర్వాత అమ్మ
నన్ను కళ్ళళ్ళో వత్తులు వేసుకుని పెంచింది. అమ్మకు నేనే శ్వాస, తన
ఆశ. ఇద్దరమూ ఒకే ప్రాణంలా బ్రతికాము. కానీ మనిషికి పంచ ప్రాణాలు
ఉంటాయని, అవి ఒక్కోసారి ఇలా విడిపోతాయని నా అనుభవంలో తెలిసింది.
అలా విడిపోయేసరికి శరీరము, సంసారము కూడా బలహీనపడతాయి. అటువంటి
సంసారములోనే నేను బతుకుతున్నాను. దాని పేరు త్రిశంఖు స్వర్గము.
ఇక్కడో జోక్ చెప్పుకోవాలి. ఒకతను దేవుడిని "దేవుడా నిన్ను
మరిచిపోకుండా ఉండాలంటే నాకు దుఖం కష్టం ఇవ్వు" అని ప్రార్ధిస్తే
దేవుడు ఒక భార్యని ఇచ్చాడట.
నా పెళ్ళయిన తరువాత ఓ ఆరు నెలలు మాత్రమే నా దగ్గర ఉంది. ఆ ఆరు
నెలలలోనూ ఎన్నో గొడవలు. అవి జీవిత పంట పండకుండా మధ్యలో కోసి పడేసే
కొడవళ్ళు. మాలతి వాళ్ళ అమ్మ "మీ అత్తగారికి మీ ఆయన తప్ప వేరే
పిల్లలు లేరు. జీవితాంతం నీ దగ్గరే ఉండిపోయే అవకాశం ఉంది. ఆవిడని
కాస్త దూరంగా ఉంచు" అనే చిన్న విత్తనం మా ఆవిడ మెదడులో నాటేసింది.
అది ఇప్పుడు మర్రి వృక్షంగా ఎదిగిపోయింది. మా అమ్మ చిన్న చిన్న
సలహాలు ఇవ్వడం మాలతికి నచ్చేది కాదు. ఒకసారి మా అమ్మ పెళ్ళయి ఆరు
నెలలయినా పిల్లలు పుట్టలేదు ఒకసాతి డాక్టర్ దగ్గర చూపించుకోండి
అన్న మాటకు తనను గొడ్రాలంటుందా అని మాలతి నానా రగడ చేసింది. తాను
కాలుతున్న కాగడా అయిపోయింది.
"నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా! నీకు పుట్టే పిల్లల్ని నేను
పెంచుతానులే నాకు ఇంకా వయసు ఉంది . ఓపికా ఉంది అన్న మాటలకు "మా
అమ్మకు వయసు లేదా, మా అమ్మ నా పిల్లల్ని పెంచలేదా" అంటూ చిందులు
తొక్కేసింది మాలతి. అందరికీ మంచైన మా అమ్మ మాలతికి ఎందుకు
చెడ్డదైంది?. అది అత్త అనే వరుస ప్రభావమా, మాలతి మనసులో
పేరుకుపోయిన భావమా.
ప్రతీదానికీ పెడార్ధాలు తీయడం మాలతికి అలవాటు. ప్రతి చిన్న
విషయానికీ సలహాలు ఇవ్వడం మా అమ్మకి అలవాటు. దానితో వారిద్దరికీ
పడలేదు. చివరికి "మీ అమ్మగారు ఇంట్లో ఉంటే నేను రాను" అని మాలతి
పుట్టింటికి వెళ్ళిపోయి భీష్మించుకొని కూర్చునేసర్కి మా అమ్మ" నా
క్షేమం దృష్ట్యా నాకు దూరంగా మరలా తన ఇంటిలోనికి, అద్దె వాళ్ళను
ఖాళీ చేయించి వెళ్ళిపోక తప్పలేదు. నేను నిస్సహాయుడిలా చూస్తూ
ఉండిపోయాను.
నాకు తరువాత కవలలు పుట్టారు. శౌర్య, మౌర్య వాళ్ల పేర్లు. మా అమ్మ
సీమంతానికి, పురుటికి, బారసాలకు గెస్ట్ లాగ, అదీ అందరికంటే ఆఖర్న
వచ్చి, అందరికంటే ముందే వెళ్ళిపోయింది. మినిస్టరు గారు
ప్రారంభోత్సవానికి వచ్చి వెళ్ళిపోయినట్లు ఉండేది. అయితే ఆ రావడం,
పోవడం మినిస్టర్ గారికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఇక్కడ మా అమ్మ
పట్ల అంతా విముఖతే.
మాకు చాలా ఆస్థి ఉంది. మా నాన్నగారు నా చిన్నతనంలోనే పోవడంతో మా
చ్ట్టాలకు మా ఆస్తిపై కన్ను పడింది. నన్ను, నా ఆస్తిని, ఒంటరిగా
ఉన్న మాకు అపకారం తలపెట్టాలన్న వారినుండి ఎంతో జాగ్రత్తగా
కాపాడింది. నన్ను కంటికి రెప్పలా చూసుకునేది. చుట్టాలు, పక్కాలు,
నాన్న అన్నీ తనే నాకు. ఆమె నాకు మంచులో కంబళి, మండుటెండలో
చిరుగాలి. అమ్మ పట్ల వియ్యాల వారు కాస్తా కయ్యాల వారుగా మారి మేము
చాలా బాధపడే విధంగా ప్రవర్తించారు.
అమ్మ నాకు దూరంగా ఉన్నందుకు నేనెంతో బాధపడ్తున్నాను. నా పిల్లల్ని
తాను పెంచాలని కోరుకున్నాను. కానీ వారిప్పుడు డే కేర్ సెంటర్ లో
పెరుగుతున్నారు. అక్కడ వాళ్ళు డబ్బు తీసుకుని ఎంత బాగా చూసినా
నాన్నమ్మ స్పర్శ, నానమ్మ గీఓరు ముద్దలు,కథలు, కబుర్లు,
ముద్దులాటలు, ముద్దు మురిపాలు ఉండవు కదా. నేను బాధపడుతుంటే అమ్మే
నన్ను ఓదారుస్తూ ఉంటుంది. పోనీలేరా నువ్వు బాధపడకు. నేను ఈ ఊరిలోనే
ఉన్నానుగా. దూరంగా లేను కదా! నాది రాలిపోయే వయస్సు నీకు భవిష్యత్తు
అంతా ముందరే ఉంది. నీ సంతోషమే నాకు సంతోషము. పిల్లలు సంతోషంగా
ఉండటం కంటే ఎక్కువేమీ తల్లి ఓరుకోదు. నేను అలాంటి తల్లిని కాదు.
అమ్మ నాకు ముళ్ళదారిలో జోడు, మునిగిపోతున్నప్పుడు తాడులా కనబడేది.
మా ఆవిడగురుంచి అందరూ "మంచి పిల్ల" అని చెప్పారు. అది నమ్మాను.
కానీ ఆమంచితనం కాస్తా పెళ్ళి తరువాత మంకుతనంగా మారంది. కాదులెండి,
ఆమెకు చిన్నప్పటినుండే తన పంతమే నెగాలి, తన మాటే అందరూ వినాలి అనే
మనస్తత్వం ఉండట. దురదృష్టం కొద్దీ దానికి మొదట అమ్మ, తరువాత నేనూ
బలయిపోయాము. ఓ కోడలి రాక ఇంత విస్ఫోటనం సృష్టిస్తుందా అని
నమ్మలేకపోతున్నాను, నమ్మకుండా ఉండలేకపోతున్నాను.
మాలతి దగ్గర అమ్మ పేరు ఎత్తకూడదు. ఎత్తితే శివతాండవం, తాడెత్తున
లేవడం.. నాకు మాట పడిపోయి మరలా తిరిగి వచ్చ్చి కొన్ని మాటలు
పలకలేకపోతే ఎలా ఉంటుందో అలాంటి మాటల్లో అమ్మ అనే పదం కూడా ఉన్నట్లు
అయ్యింది నా జీవితం. ఈ మంకు పిల్లను నాకు అంటగట్టి మాలతి తల్లి
తండ్రులు హాయిగా జీవిస్తున్నారు. వాళ్ళను తలుచుకుంటే నాకు చాలా
అసూయగా ఉంది. నాకు, మాలతికి కూడా ఉద్యోగాలలో తీరిక ఉండదు. నేను
వారానికి రెండు సార్లు అదీ రాత్రి పూట మాఆ అమ్మ దగ్గరికి వెళతాను.
అదీ భయం భయంగా. నా పిల్లల ముచ్చట్లు అడిగి తెలుసుకుంటుంది మా అమ్మ.
వారి గురుంచి చెప్తున్నప్పుడు అపరాధ భావం నా గొంతులో అడ్డం పడి మాట
పెగలనీయదు. పెళ్ళి మగవాడికి వరమా, శాపమా అంటే నా విషయంలో నా
విషయంలో మాత్రం శాపమే అని చెప్పాలి. దూరాన ఉన్న అమ్మ నాకు రక్ష. మా
ఆవిడే శిక్ష.
కశ్టాలు, మనస్తాపాలు అన్నీ ఆడవాళ్ళకే అన్నట్లు సమాజంలో ఒక అపోహ
ఉంది. కాని అది చాలా తప్పు. మగవాడికి బోలెడు కష్టాలు ఉంటాయి.
పెళ్ళి తర్వా స్వేచ్చ పోతుంది. ఓ విధంగా కుడితిలో పడ్డ ఎలక,
పంజరంలో చిలుక లా అయిపోతుంది బ్రతుకు. పెల్లికి ముందు పెళ్ళి
కావాలని ఆరాటం, పెళ్ళి తరువాత ఆ బందీ బతుకునుండి బయటపడాలన్న ఆరాటం.
ఇదేనా జీవితం?. ఈ జీవితాలు ఎవరి చేతుల్లో వారివి ఉండక ఓకరి
చేతుల్లో ఒకరివి ఎందుకు ముడిపడిపోతాయి. అదో చిక్కు ముడి. గజిబిజి.
ఒకసారి పిల్లలకి జ్వరమొస్తే, మాలతికి శలవు దొర్క్క వాళ్ళ అమ్మని
పిలిపించుకుంది. "మా అమ్మను కూడా" అన్న మాట మెళ్ళగా నా నోటినుండి
రాగానే "నేని కిరోసిన్ పోసుకుని చచ్చిపోతాను"అంటూ బెదిరించింది.
అమ్మ ఇటువంటి సన్నివేశాలను కోరుకోలేదు. ఏదో కొంచెం కొంచెం కోడలితో
గొడవలు పడింది కానీ మాలతిని ద్వేషించలేదు. ఆ సంగతి నాకు బాగా
తెల్సు. మా అత్తగారు అర్జంటు పని ఉందని వాళ్ళ ఊరు వెళ్ళ్పోయారు.
పిల్లలు మరలా "డే కేరు" కి వెళ్ళిపోయారు.
ఆ రోజు నాకు పని త్వరగా అయిపోయింది. పిల్లలు జ్వరంబారిన పడ్డారు
కదా! ఇంటికి తీసుకువచ్చి నేనే చూడొచ్చులే అని డే కేర్
సెంటరుకెళ్ళాను. ఇద్దరినీ చ్డటం చాలా కష్టమని తెలుసు. అయినప్పటికీ
వెళ్ళాను. అక్కడ ఒక ఆయా నా పిల్లలను ఆడిస్తోంది. ఆమెను చూసి
నివ్వెరపోయాను. లక్ష్మీ దేవి ఆభరణాలు వదలి మారు వేషంలో
వచ్చినట్లున్న ఆ ఆయా ఎవరో కాదు. మామ్మే. మనుమల కోసం ఆయాగా ఉద్యోగం
చేస్తోంది. నాలో చెప్పలేని ఆనందం.
|
|