జరిగిన కాలేజిలో వత్తిడి, ఇంట్లో వాళ్ళ పోరు భరించలేక అనూష రూమ్మేట్, కల్పన ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ పిల్ల మరణానికి తాము బాధ్యులు కాదంటు యాజమాన్యం తప్పించుకోజూస్తుంది. అనూష ఆ ఘోరాన్ని దిగమింగుకోలేక ఉంటుంది. కల్పన ఆత్మహత్య కాలేజిని, పిల్లలను, యాజమాన్యాన్నీ కుదిపేస్తుంది. వాడిగా చర్చలూ ప్రారంభమవుతాయి. అనూష దిగమింగుకోలెకౌంటే హఠాత్తుగా కల్పన కనిపిస్తుంది. అనూష దయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తూంటుంది. మరో వైపు ఆనూష తమ్ముడు అనిరుధ్ కూడా ఇంట్లొ పోరు భరించలేక ఇంటినుంచీ పారిపోతాడు.
14 వ భాగం
అనిరుధ్ రైలెక్కి కూచున్నాడు. ఏ వూరు వెళ్ళలో ఆలోచించుకోలేదు కాబట్టీ టికెట్టు కొనుక్కోలేదు. అతనికి చాలా ఉద్విగ్నంగా ఉంది. అమ్మానాన్న పక్కన లేకుండా రైల్లో ప్రయాణం చేయటం గొప్ప సాహసంలా అంపించింది. చదువు, పుస్తకాలు, పరీక్షలు, మార్కులు, మాస్టార్లు, తిట్లు... ఇవేవీలేని ఆ వాతావరణం బావుందనిపించింది. రైలు కదిలే వరకూ భయం భయంగా ఉండింది. వాళ్ళ నాన్న వెతుక్కుంటూ వస్తాడన్న భయం.. తెల్సిన వాళ్ళెవరైనా చూసి ఇంట్లో చెప్తారన్న భయం ...
రైలు కదిలాక అతను స్థిమితంగా కూచున్నడు. కిటికీలోంచి చల్లటి గాలి వీస్తోంది. రైలు ముందుకు పరుగెత్తుతున్నంత వేగంగా వెనక్కి పరుగెత్తి కనుమరుగవుతున్న చెట్లు... పచ్చని పంట పొలాలు... రంగుల రంగుల అకాశం.. వాడి మొహం అనందంతో పుచ్చ పువ్వులా విచ్చుకుంది.
"ఏ వూరెళ్ళాలి?" అనే ప్రశ్నకు ఉలిక్కిపడి చూశాడు. ఎదురుగా కూచుని ఉన్న
ముసలాయన అడుకుతున్నాడు. అడుగుతుంది తన పక్కన కూచుని ఉన్న వ్యక్తిని.
హమ్మయ్య నన్ను కాదు అనుకుని మరలా పక్కకు తిరిగి కిటికిలోంచి
చూడటం అనే అద్భుతమైన కార్యక్రమాన్ని కొనసాగించాడు.
"కర్నూలు" అన్నాడు పక్కతను.
"కర్నూలా.. నేనూ అక్కడికే. నా మనవరాలికి కొడుకు పుట్టాడు.
చూసొద్దమని" ముసలాయన చెప్పాడు.
"మీ అబ్బాయ? ఏం చదువుతున్నాడు?" మరలా అడిగాడు.
"కాదు" పొడి సమాధానం వినిపించింది అనిరుధ్ కి. ఆ వెంటనే మరో
ప్రశ్న కూడా వింపించింది. "ఎక్కడిదాక వెళ్తున్నావు బాబూ" అని. అడుగుతుంది
తననే. అందరి చూపూ తనపైనే ఉందన్న విషయం గ్రహించాడతను. ఏం
చెప్పాలో తెలీక మొదట శూన్యంగా చుశాడు. చప్పున పక్కతను చెప్పిన
సమాధానం గుర్తొచ్చి "కర్నూలు" అన్నాడు.
"తమాషాగా ఉందే. మనందరం కర్నూలువాళ్ళమన్నమాట, జనరల్ బోగిలో
ఇలా తారస పడటం ఆశ్చర్యమే. నువ్వొక్కడివే వెళ్తున్నవా?" అన్నడా
ముసలాయిన.
"మా అమ్మమ్మకు ఆరోగ్యం బాగాలేదు. అమ్మ వారం క్రితమే వెళ్ళింది. నన్నూ
రమ్మంటే వెళ్తున్నా" నోటికొచ్చిన అబద్ధం ఆడేశాడు.
"మరి మీ నాన్న?"
"ఆయనకు ఆఫిస్ లో బాగా పని ఉందట. రాలేనన్నడు"
"ఒక్కడివే వెళ్లడానికి భయమేయదా?"
"ఎందుకు భయం? నాకు తెల్సిన ఊరేగా" అనేసి మరో మాటకు తావివ్వకుండా
తల తిప్పేసుకున్నాడు అనిరుధ్.
"ఈ కాలం కుర్రోళ్ళకి భయాలు కూడానా? అమ్మో.. మా రోజుల్లో ఐతేనా..
ఇల్లు కదలాలన్నా అమ్మ నాన్నని అడిగితీరాల్సిందే." అంటూ అతనేదో
మాట్లాడుతూనే ఉన్నాడు. అనిరుధ్ అలోచనలన్నీ అమ్మా నాన వైపు మళ్ళాయి. ఈ
పాటికి వెతుక్కుంటూ ఉంటారు. అమ్మ ఏడుస్తో ఉంటుంది. నాన్న అందరికి ఫొనులు
చేస్తూ ఉంటాడు. వాడికెందుకో భయమనిపించింది. నిజం తెలిస్తే ఏమైనా
ఉందా? తాట వలిచేస్తారు. ఇంటికే వెళ్ళకుండా ఉంటే? మరి తిండో.. ఏదైనా
పనిలో చేరితే.. ఏపని? ఎవర్నడగాలి? పని సరే.. ఎక్కడ ఉండాలి? వాడి
ఆలోచనలు పరిపరివిధాలు పోతున్నాయి.
పల్లీలమ్మే కుర్రవాడు కంపించాడు. మాసిపోయిన బట్టల్తో, బక్కచిక్కిన శరీరంతో... ఇంటికికెళ్ళకుండా ఉండిపోతే తనూ వాడిలానే ఐపోతాడా? వాడికి దిగులనిపించింది. దాంతో పాటు ఆకలనిపించింది. ఇంట్లో ఉంటే ఈ పాటికి అమ్మ పెట్టిన వేడివేడి ఇడ్లీలో, దోసెలో తిని స్కూలుకెళ్ళి ఉండేవాడు. ఐదు రూపాయలకు పల్లీలు కొనుక్కున్నడు. వాటిని తింటూ కొద్దిసేపు ఇంటిని మర్చిపోయాడు.
కర్నూలు స్టేషన్ లో వాళ్ళు దిగుతుంటే వాళ్ళతోపాటు దిగిపోయాడు. అప్పటికి సమయం రెండయింది. ఆకలి కరకరలాడుతోంది. స్టేషన్ బైటకొచ్చి పరిసరాల్ని ఆసక్తిగా గమనిస్తూ నడిచాడు. హోటల్ కనిపించగానే వాడికి ప్రాణం లేచొచ్చింది. భోజనంలో మొదట స్వీటిచ్చారు. వెజిటబుల్ బిర్యాని పెట్టారు. తర్వాత పూరీలు, నాలుగు రకాల కూరలు, పెరుగు చివర్లో కిళ్ళి చాలా బావుందనుకున్నాడు. బిల్లు చూసేవరకు వాడికి తేలియదు భోజనానికి ఖర్చు నలభై ఐదు రూపాయలౌతుందని.
జేబులో మిగిలిన రూపాయలు మరొక్క పూట భోజనానికి సరిపోతే రేపటి పరిస్థితి ఏమిటనే దిగులు పట్టుకుంది. ఆలోచిస్తూనే నడుచుకుంటూ కొండారెడ్డి బురుజు చేరుకున్న్నాడు. ఆ కట్టడం చూడగానే ఉత్సాహం వచ్చింది. పైకెక్కి కొద్దిసేపు గడిపాడు. దిగి మరలా నడిచాడు. విసుగ్గా అంపించింది. సినిమా ధియేటర్లు కనిపించాయి. సినిమా చూడాలనిపించింది. మరలా మిగిలిన కాసిని డబ్బులు గుర్తొచ్చి బలవంతంగా మానుకున్నాడు. రాత్రయింది. కాళ్ళు పీకుతున్నాయి. తిరిగే ఓపిక కూడా లేదు. ఆకలేస్తోంది. నీరసంగా ఉంది. వాడికి ఇల్లుగుర్తొచ్చి ఏడుపు తన్నుకు వచ్చింది.
రోడ్డు పక్కన బండి మీద ఇడ్లీలు, దోసెలు, పూరిలు అమ్ముతున్నాడొకడు.
అక్కడికెళ్ళి నిలబడ్డాడు. చాలామంది నిలబడి టిఫిన్లు తింటున్నారు.
"ఇడ్లీ ఎంత?" అని అడిగాడు.
ఇడ్లీ ఐదు రూపాయలు, పూరీ ఆరు రుపాయలని చెప్పడతను. ఓ ప్లేటు పూరి చెప్పడు. రెణ్ణిముషాల్లో పూరి తినటం ఐపోయింది. ఆకలి తీరినట్టేలేదు. రెండు గ్లాసుల నీళ్ళు తాగాడు. వాడికి డబ్బులిచ్చి మరలా నడక సాగించాడు. రాత్రికి ఎక్కడ పడుకోవాలనే ఆలోచన వచ్చింది. వాడికి రైల్వేస్టేషన్ గుర్తొచ్చింది.
కర్నూలు రైల్వేస్టేషనులో పెద్దగా సందడి లేదు. కొంతమంది పాసెంజర్లతో పాటు వాడు ఓ ప్లాస్టిక్ కుర్చీలో కూచున్నాడు. రాత్రి ఎనిమిది దాటింది. విపరీతమైన ఆకలి.. పంపు దగ్గరకెళ్ళి మంచి నీళ్ళు తాగాడు. కొద్దిగా ఉపశమనమంపించింది. తొమ్మిది దాటాక ముంచుకొస్తూ నిద్ర. కొంతమంది గోడవారిగా తువ్వాళ్ళూ పరిచి నిద్రకుపక్రమిస్తున్నారు. వాడికి నడుంవాల్చాలని బలమైన కొర్చిక... కాని అలా కింద నేల మీద పడుకోవడానికి అభిమానం అడ్డొచ్చింది. కుర్చీలోనే కునుకు తీశాడు. మధ్యలో రైళ్ళొచ్చిన హడావిడికి రెండుసార్లు మెలకువొచ్చినా గాఢంగా నిద్ర పట్టింది.
మెలకువ వచ్చేటప్పటికి ఉదయం ఆరు దాటింది. పంపు దగ్గరే మొహం
కడుక్కున్నడు. వాడికంటే ముందే నిద్ర లేచినా ఆకలి... పక్కనే రైల్వే
క్యంటిన్ కంపించింది. ఇడ్లీలు, గారెలు ఉన్నయిక్కడ. రెండిడ్లీలు కావాలని చెప్పి
జేబులో చేయి పెట్టిన అనిరుధ్ హతాసుడైనాడు. జేబు ఖాళిగా ఉంది.
రాత్రి పడుకోబోయేముంది. కూడా తడిమి చూసుకున్నడు. మరేమైనాయి?
కంగారుగా మిగతా జేబులన్నీ వెతికాడు. లేవు. వెనక్కి పరుగెత్తి తను పడుకున్న
కుర్చీలో, దాని చుట్టుపక్కల వెదికాడు. లేవు.
"ఏమైనా పోయాయా?" రైల్వే కూలి ఎవరో అడిగాడు.
అనిరుధ్ ఏడుస్తూ డబ్బులు పోయున విషయం చెప్పడు.
"ఈ ప్లాట్ ఫాం నిండా దొంగనాయాళ్ళే. మేల్కొని ఉన్నా కాజేసే రకాలు.
నిద్ర పోయే వాళ్ళనించి దొంగలించడం ఓ లెక్కా" అన్నాడతను జాలిగా.
డబ్బులు పోయాయని తెలిశాక వాడి ఆకలి మరింత పెరిగింది. అమ్మ గుర్తొస్తోంది. ఇల్లు గుర్తొస్తోంది. ఇంటికి ఫోన్ చేసి కర్నూల్లో ఉన్నట్లు చెప్పాలనుకున్నడు. కాని వెంటనే భయమేసింది. కొన్ని రోజుల క్రితం టివిలో చూసిన వార్త గుర్తొచ్చింది. ఏడొ తరగతి చదివే కుర్రవాణ్ణి కొంత మంది కిడ్నాప్ చేశారు. వాడు తప్పించుకుని బైట పడ్డాడు. ఇదే కధని బాగా అల్లి చెబ్తే ఇంటివాళ్ళనించి దెబ్బలు తప్పుతాయనిపించింది.
ఫోన్ చేయడానికి కూడా డబ్బులు లేవు. సెల్ చేత్తో పట్టుకుని కనిపించిన ఒకరిద్దర్ని ఒక్క ఫోన్ చేసుకుంటానంది" అని అడిగాడు. వాడి వైపు అపనమ్మకంగా చూసి వెళ్ళీపోయారు. కొద్దిగా నీట్గా డ్రెస్ చేసుకుని ఉద్యోగస్థుడిలా కంపిస్తున్న వ్యక్తినడిగాడు. "మా నాన్నకి ఫోన్ చేయాలడీ. నా దగ్గర డబ్బులు లేవు. ప్లీజ్... " వాడి దీనమైన మొహం చూసి జాలి పుట్టీ అతను సెల్ తీసి తనే నెంబర్ పంచ్ చేసి ఇంచ్చడు. "తొందరగా మాట్లాడు. బ్యలన్స్ తక్కువుంది" అంటూ హెచ్చరిక కూడా చేశాడు.
ఫోన్ అమ్మ ఎత్తింది. ఆమె గొంతు వినంగానే వాడు బావురమన్నాడు. ఆమె
మర్రింత కంగారు పడి "ఏమైంది బాబు" ఎక్కడున్నావురా? నిన్నంతా
ఏమైపోయావురా? అంటూ ప్రశ్నల్తో ముంచెత్తింది. వాడు సమాధానం చెప్పేలోపల
వాడి నాన్న ఫోన్ లాక్కున్నాడు.
"ఇపుడు ఎక్కడ నుంచి మాట్లాడ్తున్నావురా? అన్నడు ఆందోళనగా.
"కర్నూలు రైల్వే స్టేషన్లో ఉన్నాను నాన్నా" అన్నడు.
"అక్కడికెందుకెళ్ళవురా?"
"నేనెందుకెళ్తాను నాన్న? నన్నెవరో కిడ్నాప్ చేశారు. మత్తు మందిచ్చారు.
స్పృహలో కొచ్చాక తెలివిగా తప్పించుకుని ఫోన్ చేస్తున్నా"
"వాళ్లని గుర్తుపట్టగలవా? తెల్సిన వాళ్ళేనా?" వాడి నాన్న మాటలకు
అమ్మ అడ్డొచ్చి ఫోన్ లాక్కుంది. "పిల్లోడు క్షేమంగా ఉన్నాడు. తొందరగా
వాణ్ణి తీసుకొచ్చే విషయం ఆలోచించక అవేం పిచ్చి ప్రశ్నలు?" అని
విసుక్కుంది. " నువ్వు భద్రం నానా... మరల వచ్చి పట్టుకెళ్తారేమో జాగ్రత్త.
మేమొచ్చేవరకు అక్కడే వుండు" అంది.
ఈ లోపల అతను సెల్ లాక్కున్నాడు. "బ్యలన్స్ తక్కువుందని చెప్పాగా" అన్నాడు. సెల్ స్విచాఫ్ చేసుకుని జేబులో పెట్టుకున్నాక "నిజంగా నిన్ను కిడ్నాప్ చేశారా? ఎలా తప్పించుకున్నావు? అని అడిగాడు.
అనిరుధ్ కి అమ్మా నానతో మాట్లాడాక ధైర్యం వచ్చింది. అతని ప్రశ్నకి సమాధానం చెప్పకుండా పరుగెత్తుకుంటూ వెళ్ళి క్రితం కూర్చున్న ప్లాస్టిక్ కుర్చీలో కూచున్నాడు. అతని ఆలోచనాంతా కిడ్నాప్ సంఘటనని ఎలా వర్ణించి చెప్పాలా అనేదాని మీద కేంద్రీకృతమైంది.
నాన్న వస్తాడా లేక అమ్మ నాన్న కలిసి వస్తారా అనికూడా ఆలోచించాడు.
ఎన్ని గంటలు పడ్తుందీ అప్పటి వరకు ఏంచేయాలి. ఆకలిని ఎలా
ఆపుకోవాలి లాంటి ఆలోచనల్లో ఉండగానే "నువ్వేనా అనిరుధ్" అని వినిపిస్తే
తలయత్తి చూసాడు. ఎదురుగా పోలీస్... వాడికి పోలీసులంటే చాలా భయం. ఈ
పోలిసుకి తన పేరెలా తెలుసో వాడికి అంతుబట్టలేదు.
"సమాధానం చెప్పవేం?" గద్దించాడతను.
అనిరుధ్ లేచి నిలబడి "నేనే అనిరుధ్ ని " అన్నాడు.
"స్టేషన్ కెళ్దాం పద. యస్సైగారు పిలుస్తున్నారు " అన్నాడు.
"ఎందుకు?"
"చెబ్తేగాని రావ? పదపద"
"మా నాన్న వస్తాడు. తనొచ్చేవరకు ఇక్కడే ఉండమన్నాడు" బింకంగా
సమాధానమిచ్చాడు.
"మీ నాన్నే హైద్రాబాద్ పోలీసులకు ఫోన్ చేసి నువ్విక్కడ ఉన్నట్లు చెప్పాడు.
వాళ్ళు మా యస్సైకి చెప్పారు. అర్థమైందా? నిన్ను పిల్చుకెళ్ళడానికి మీ
నాన్న రాడు. ఆ డ్యూటి నాకు పడింది. " భుజం మీద చేయి వేసి
తనతోపాటు తీసుకెళ్తూ చెపాడతను.
అనిరుధ్ కి మరింత భయమేసింది. అమ్మానాన్నకి ఏదో ఓ కధ చెప్పి తప్పించుకోవాలనుకుంటే ఈ అనుకోని ఉపద్రవం ఏమిటో అర్థం కాలేదు.
వాణ్ణి చూడగానే యస్సై "నువ్వేనా కిడ్నాపర్ల నుంచి తప్పిచంచుకుంది?"
అన్నాడు.
అవునంటూ బలహీనంగా తల ఊపాడు.
"ఎంతమది ఉన్నారు?"
"ఇద్దరు"
"ఎలా ఉన్నారు?"
తను సినిమాల్లో చూసే విలన్ లాంటి వాళ్ళని వర్ణించాడు.
మొదట్నించీ చెప్పు, ఏం జరిగిందో... నువ్వెలా తప్పించుకున్నవో"
వాడు అమ్మానాన్నకు చెప్పాలనుకుని తయారు చేసుకున్న కథని చెప్పాడు.
యస్సై అపనమ్మకంగా చూసాతూ. "మీ నాన నిన్ను కోచింగ్ సెంటర్ దగ్గర దింపాడు. నీకు పరీక్ష ఉంది. అలాంటప్పుడు నువ్వు లోపలికెళ్ళాల్సింది పోయి ఎవరో తెలీని ఇద్దరు వ్యక్తులు పిలిస్తే వాళ్ళతో పాటు ఎందుకెళ్ళావు?"
ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పలో తెలీలేదు. ఇందాక తప్పు చెప్పినట్లు
వాడికి అర్థమైంది. "నేను వెళ్ళలేదు. వాళ్ళే మత్తిచ్చి నన్ను
బలవంతంగా లాక్కెళ్ళారు" అన్నడు.
"మరి ఇందాక నిన్ను ఆటలో ఎక్కించాక మత్తిచ్చారన్నావు?"
"మర్చిపోయాను"
యస్సైకి అర్థమైపోయింది. "నిజం చెప్తావా లేక నాలుగు
తగిలిచమన్నావా" అన్నాడు గుడ్లురుముతూ.
వాడికి వణుకొచ్చింది. సినిమాల్లో చూసిన పోలిసులు పెట్టే చిత్రహింసలన్నీ
గుర్తొచ్చాయి.
"పరీక్షలంటే భయమేసి పారిపోయి వచ్చాను" అన్నాడు.
'ఎందుకు భయం? చదవలేదా?"
"చదివాను. కాని అమ్మానాన్నకి సెవెంటి టు యైటీ పర్శెంట్ మార్కులు
కావాలి. అన్ని రావు. రాకపోతే కొడ్తారు. ఇంతకు ముందు కూడా కొట్టారు."
అన్నాడు వాడు ఏడుస్తూ.
యస్సైకి బోల్డు జాలేసింది. కానిస్టేబుల్ కి డబ్బులిచ్చి "మొదట ఈ అబ్బయికి తినడానికేమైనా పెట్టించు. హైద్రాబాద్ తీసుకెళ్ళి వీళ్ళింట్లో అప్పగించి రా. ర్యాంకుల కోసమో, మార్కుల కోసమో పిల్లల మీద విపరీతమైన వత్తిడి తెస్తే పిల్లల్నే కోల్పోవాల్సి వస్తుందని వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పు." అని హైద్రాబాద్ పోలీస్ స్టేషన్ కి సమాచారాన్ని చేరవేయడంలో నిమగ్నమైపోయాడు.
* * * * * * * * * * * * * *రమణారావుకి చాలా అవమానంగా ఉంది. విపరీతమైన కోపంగా కూడా ఉంది. పిల్లల్ని పెంచటం తమకు చాతకాదన్నట్లు, తామేదో రాక్షసుల్లా పిల్లల్నీ హింసిస్తున్నట్లు కర్నూలు నుండొచ్చిన కానిస్టేబుల్ గారు సోఫాలో తాపీగా కూచుని, పెట్టీన పలహారాన్ని ఆరగించి, సుదీర్ఘంగా హితబోధ చేస్తున్నారు.
ఎదురుగా ఉన్నది పోలీస్ కాకుండా ఉంటె అడగాల్సిన నాలుగూ అడిగేసి, కడిగేసి ఉందును అనుకున్నాడు. అనిరుధ్ భయం భయంగా ఓ మూలకు కూచుని ఉన్నాడు. వాణ్ణి చంపేయాలన్నంత కోపం... అలా చేస్తే మరలా పారిపోతాడన్న భయం... అనిరుధ్ వాళ్ళమ్మ మాత్రం కన్నీళ్ళ సంద్రమైంది. కొడుకుని చూడంగానే కావిలించుకుని బావురుమంది.
"పిల్లలు మల్లెపువ్వులంత సున్నితమైనవారు సార్. మన చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ చదువుకున్నాం. ఇప్పుడు చదువు తప్ప మరో వ్యాపకం లేకుండా చేస్తున్నాం. పాపం ఎంత వత్తిడని తట్టుకుంటారు? జీవితమంటే మార్కులూ ర్యాంకులేనా? మనోవికాసానికి అవకాశం లేకపోతే పిల్లలు ఏమైపోతారు?" అన్నాడు కానిస్టేబుల్.
పిల్లలు బాగా చదివి, ర్యాంకులు తెచ్చుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు
తెచ్చుకుని హాయిగా బతకాలని తల్లిదడ్రులు కోరుకోవడం తప్పా? అదేదో పెద్ద
నేరంలా మాట్లాడ్తున్నాడే? ఆ రోజులు వేరు. అప్పుడింత కాంపిటిషన్
ఎక్కడుంది? ఆడుతూ పాడుతూ చదువుకునే రోజులా? తను చదువుకునే రోజుల్లో డెబ్బయ్
మార్కులొస్తే చాలా గొప్ప. ఇప్పుడు నూటికి తొంభై ఎనిమిది మార్కులొచ్చినా
తక్కువే అంటున్నారు. తొంభై తొమ్మితో నూటీకి నూరో తెచ్చుకున్న
విద్యార్థులు చాలా మంది ఉంటున్నారు. బోడి కానిస్టేబుల్ ఉద్యొగం వెలగబెట్టే వాడు
ఇలా మాట్లాడక మరెలా మాట్లాడ్తాడు?
"మీరేం చదువుకున్నారు?" అని అడిగాడు కానిస్టేబుల్ని.
"నేను ఇంటర్ పాసైనాను సార్" రమణారావు ప్రశ్నలో వ్యంగం అర్థం
గాని కానిస్టేబుల్ మరలా తనకు యస్సైగారు అప్పగించిన పనిని పూర్తి
చేయటానికి ఉద్యుక్తుడైనాడు.
"మన కోరికల్ని మన ఆశల్ని పిల్లలమీద రుద్ది వాటిని సాధించమని
ఎలా హింస పెడ్తున్నామో ఎవ్వరూ ఆలోచించడం లేదు. డాక్టర్లు కావాలని,
ఇంజనీర్లు కావాలని వత్తిడి తెస్తున్నామే తప్ప వాళ్లని మానవత్వమున్న
మంచి మనుషులుగా తయారు చేయాల్సిన బాధ్యతని మాత్రం విస్మరిస్తున్నాం.
పిల్లల్ని మార్కులు తెచ్చుకునే యంత్రాల్లా చేస్తున్నం. పెద్దయ్యాక వాళ్ళు
డబ్బు సంపాదించే యంత్రాల్లా మారిపోతున్నారు. తప్పు వాళ్ళది కాదు.
పసిపిల్లలు. వాళ్ళకేం తెలుస్తుంది? తెల్లకాగితం లాంటి వాళ్ళు. మనం ఏది
రాస్తే అలా తయారౌతారంతే. ఈ పాపానికి మనం ఎప్పటికైనా భారీ
మూల్యం చెల్లించక తప్పదు"
రమణారావు అవునన్నట్లు తల వుపాడు. మనసులో మాత్రం పళ్ళు పటపట కొరుక్కున్న్నాడు. హింస పిల్లలే పడ్తున్నారా? వాళ్ళని చదివించడం కోసం తల్లిదండ్రులు ఎంత హింస పడ్తున్నారో... పిల్లలకు పరిక్షలొస్తే వాళ్ళే పరీక్షరాస్తున్నట్లు హైరానా పడే తల్లిదండ్రులెంత మంది లేరు? అనిరుధ్ ని ఉదయం ఇదింటికి ట్యుషన్ దగ్గర దింపడానికి తను వాడితో పాటు నాలుగింటికి లేవడ లేదా? ఇదంతా ఎవరికోసం? వాడికోసమేగా?
"పిల్లలు ఇష్టా ఇష్టాలు తెల్సుకోకుండా మన ఇస్టాల్ని రుద్దటం మంచిది కాదు. వాళ్ళ మెథస్సుకి పరిమితులుంటాయని గ్రహించాలి. అందరి ఐ క్యూ ఒకేలా ఉండదు కదా. అందరికి తొంభై పైన మార్కులు రావాలంటే ఎలా కుదుర్తుంది చెప్పండి? పిల్లల అందమైన బాల్యాన్ని చదువు పేరుతో ఎలాగూ హరిస్తున్నాం. ఈ చదువుకోసం వాళ్ళ ప్రాణాల్ని హరించకుండా ఉంటే చాలు" అన్నాడు కానిస్టేబుల్.
రమణారావుకి మరి వినే ఓపిక చచ్చిపోయింది. వెంటనే అతని మాటలలు అడ్డం వస్తూ "మీరు చెప్పిన విషయాలన్నీ తప్పకూండా మనసులో పెట్టుకుంటానండి. మీకు, మీ యస్సైగారికి థ్యాంక్స్" అన్నాడు లేచి నిలబడ్తూ.
కానిస్టేబుల్ కి మరికొద్ది సేపు మాట్లాడాలని ఉంది. తన జీవితంలో జరిగిన విషాదం గురించి చెప్పాలని ఉంది. తన చదువు ఇంటర్మీడియెట్ తో ఆగటం వల్ల తన ఒక్కగానొక్క కొడుకుని పీజీ చదివించాలనుకున్నాడు. ఇంజనీర్ని చేయాలనుకున్నాడు. మార్కులు సరిగ్గా రాకపోతే తిట్టాడు. బెల్టు పెట్టి వాతలు తేలేలా కొట్టాడు. యంసెట్లో చేర్పించి ర్యాంకు రాకపోతే చంపేస్తానన్నాడూ. నువ్వు చచ్చినా పర్లేదన్నాడు. యంసెట్ రిజల్ట్స్ వచ్చాయై. వాడికి ఇరవై వేలల్లో ర్యంకొచ్చిందని తెల్సుకొని అమితమైన ఉద్రేకంతో ఇంటికొచ్చాడు. చంపే ర్యంకొచ్చిందని తెల్సుకొని అమితమైన ఉద్రేకంతో ఇంటికొచ్చాడు. చంపేయాలన్నంత కోపంతో ఇంటి కొచ్చాడు. అప్పటికే పురుగుల మందు తాగిన కొడుకు శవమై 'నాన్నా... నువ్వు కోరినట్లే చచ్చిపోయాను చూశావా' అనేలా పాడెమీద కంపించాడు. ఆ సంఘటన గుర్తొచ్చి అతనికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. రమణారావు చూడకుండా కళ్ళు తుడుచుకుని లేచి నిలబడ్డాడు.
అనిరుధ్ వైపు చూసాడు. అతనికి చని పోయిన తన కొడుకు కంపించాడు. "బాబూ. ఇంకెప్పుడూ ఇంట్లోంచి పారిపోయి తల్లిదండ్రుల్ని క్షొభ పెట్టకు. మరే అఘాయిత్యానికో పాల్పడి గుండె కోత మిగిల్చకు. వస్తాను బాబు." అంటూ వీడ్కోలు తీసుకున్నాడు.
కానిస్టేబుల్ వెళ్ళగానే "హమ్మయ్య" అంటూ వూపిరి పీల్చుకున్నాడు రమణారావు.
కొడుకు వైపు కొరకొరా చూసాడు. తిట్టబోయి తమాయించుకుని
గదిలోకెళ్ళాడు. అప్పుడే సెల్ ఫొన్ మోగింది. విజయవాడ కోడ్ అని వెంటనే రిసీవ్
చేసుకున్నాడు.
"రమణా రావుగార? మేము శ్రీచరిత కాలేజీ హాస్టల్ నుంచి
మాట్లాడుతున్నామండి. మీరు బయల్దేరి రావి. మీ అమ్మయి అనూషకు బాగలేదు"
"ఏమైంది? మరలా జ్వరమా?"
"కాదండి, మీరు రండి చెప్తాం."
"విషయం ఏమిటో చెప్పండి" అన్నాడు కంగారుగా.
"ఈ మధ్య చాలా అనారోగ్యంగా ఉంటోంది. మీరు ఎప్పుడు వస్తారు?"
"రేపు బయల్దేరి వస్తాను" అన్నాడు. అతనికి మనసంతా వ్యాకులమైంది.

































