తెలుగు భాషా వికాసవేత్త, రచయిత - డాక్టర్ దేవులపల్లి రామానుజ రావు

  తెలుగు భాషా వికాసం కోశం ఐదు దశాబ్ధాలకు పైగా తెలుగు నాట పనిచేసిన అపూర్వ వ్యక్తి డాక్టర్ దేవులపల్లి రామానుజరావు గారు. వృత్తి రిత్యా న్యాయవాధి పట్టా సాదించినా మక్కువ తెనుగు భాష మీదే. న్యాయ వృత్తి సంపాదనకి మంచి మార్గమే ఐనా తెలుగు భాష మీద మమకారం కొత్త దిశ ఇచ్చింది. సహజ తెనుగు భాషలో పాండిత్యం సంపాయించి, చిత్త శుద్ధితో తెలుగు భాష సేవలో నిమగ్నమై ఫలితాలు సాసించిన తెలుగు భాషా సాధకుడు. 1950 నుండి 1979 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం సెనేట్, సిండికేట్ సభ్యుడిగా ఉన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి, శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భషా నిలయం, కేంద్ర సాహిత్య అకాడమీలలో మూడు దశాబ్ధాలకు పైగా ప్రగాడ అనుభందాలేర్పరచుకుని తెనుగు భాషా, రచనల పరివ్యాప్తికి మిక్కిలి కృషి చేశారు. గోల్కొండ పత్రిక సంపాదకుడిగా పనిచేశారు.

ఇంగ్లిషు, తెలుగు, ఉర్దూ భాషా ప్రవీణుడు, మంచి పాండిత్యం కలవాడు; తెలుగులో మంచి రచయిత. అనేక విషయాలు తెలిసిన దిట్ట మంచి వక్త; పరిశోధకుడు శ్రీ రామానుజరావు గారు; తెలుగు సంస్కృతి మీద మెండుగా అభిమానం ఉన్నవాడు.

సంపాదన మీద యావ లేక, తెలుగు రచనల మీద తృష్ణ కలిగి ఉండి, సహజ తెనుగు భాషలో పాండిత్యం సంపాయించి, చిత్త శుద్ధితో తెలుగు భాష సేవలో నిమగ్నమై ఫలితాలు సాసించిన తెలుగు భాషా సాధకుడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు వీరి నిర్మాణ శక్తికి మచ్చుతునక. తెలంగాణ సమగ్ర చరిత్రతో పాటు, రాజకీయ సాంఘిక సంస్కృతిక సాహిత్య ఉధ్యమాలతో అనుబంధం ఉన్నవారు.భావ కవితా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.

ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి రూపకల్పనకు ఆధ్యుడు. దాదాపు పదేళ్ళ పాటు కేంద్ర సాహిత్య అకాడమి సభ్యుడిగా వ్యవహరించారు. హైద్రాబాద్ నగర గ్రంధాలయ సంస్థ అధ్యక్షుడిగా ఉన్నారు.

ఈయన తెలుగు సాహితీ మూర్తులకు, సాహితీ సంస్థలకు ఆరాధ్యుడు. తెలుగు సాహిత్య వికాసానికి అహర్నిసలు కృషి చేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్తుకి 1943 నుండి సభ్యుడిగా ఉన్నారు; ఆంధ్ర సాహిత్య అకాడమి నిర్వహణ - వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి గా వ్యవహరించారు.

వ్యాకరణ, అలంకార శాస్త్రలు చదవక పోయినా, తెలుగు భాషలో మంచి జ్ఞానం ఆర్జించారు. రెండు దశాబ్ధాలపాటు " గోల్కొండ పత్రిక " సంపాదకులుగా ఉన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం సిండికేట్, సెనేట్ సభ్యులు గా ఉన్నారు. మధ్యలో కొంత కాలం ఉప కులపతిగా కూడా వ్యవహరించారు. రాజ్య సభ సభ్యుడిగా ఉన్నారు.

" అవకాశాలకు తన వ్యక్తిత్వాన్నే పణం పెట్టేవారు తమకు తామే శత్రువులు " అని రామానుజ రావు గారి అభిప్రాయం. " ఆసత శుద్ధితో నిర్భయంగా స్వతంత్రంగా పత్రికలు నిర్వహించాలి " అని దేవులపల్లి గారు తన మనోభిప్రాయం వ్యక్తం చేశారు.

" జీవితంలో నాకు అదృష్టం తో పాటు మిత్రుల సహకారం కూడా ఉంది " అని తెలిపారు. డాక్టర్ దాశరధి, మునిమాణిక్యం నరసిం హా రావు, జి కృష్ణ, గుంటూరు శేషేంద్రశర్మ, దివాకర్ల వెంకటావధాని, డాక్టర్ సి నారాయణ రెడ్డి, పల్లా దుర్గైయ్య, డాక్టర్ బోయి భీమన్న, టి దోణప్ప, బి ఎన్ శాస్త్రి, ఎం రామప్ప, బొమ్మకంటి సత్యనారాయణ, రాయపురోలు సుబ్బారావు గారు, ఈరంకి వెంకట సుబ్బారావు తదితరులు వీరి మిత్రులు. గడియారం రామకృష్ణ - వీరికి మిక్కికి సన్-హితుడు. దేవులపల్లి గారు మాడపాటి హనుమంత రావు, బూర్గుల రామకృష్ణరావు అభిమానాలు అందుకున్నారు.బాల్యం, చదువు, ఉద్యోగాలు:

శ్రీ రామనుజ రావు గారు - ఆగస్టు 25, 1917 లో వరంగల్లు పట్టణ సమీపాన ఉన్న దేశాయి పేట గ్రామంలో వేంకట చలపతిరావు, ఆండాళ్ళమ్మ దంపతులకు ప్రధమ సంతానంగా జన్మించినారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైనారు. తరువాత నాగ్పూర్ విశ్వవిద్యాలయం నుండి ఎల్ ఎల్ బి పట్టా సాదించేరు. అక్కడే డాక్టర్ నటరాజ రామకృష్ణ గారితో పరిచయం ఏర్పడింది.

శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం నిలబడటానికి మిక్కిలీ కృషి చేశారు. వీరి అవిరళ కృషి స్లాఘనీయం. ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొన్నారు.

1945-46 లో వరంగల్ జిల్లా యువ జన కాంగ్రెస్ అధ్యక్షకుడిగా ఉన్నారు. సూరవరం ప్రతాపరెడ్డి గారి ఆహ్వానం మేరకు " గోల్కొండ " పత్రిక ఉప సంపాదకులుగా పనిచేశారు. ఇరవై రెండేళ్ళు - గోల్కొండ పత్రికలో సంపాదికీయం వ్రాసినారు.

1960-62 లో సాహిత్య ప్రతినిధిగా రాజ్య సభ సభ్యుడిగా పనిచేశారు;

1950 నుండి 1979 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడిగా ఉన్నారు. మూడు పర్యయాలు కార్య నిర్వహణా (ఆక్టింగ్) కులపతిగా వ్యవహరించారు. హైద్రాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడిగా పనిచేశారు. ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం కార్యనివాహక సంఘ సభ్యుడిగా ఉన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడిగా కొంత కాలం పనిచేశారు. రెండు, మూడేళ్ళ పాటు హైద్రాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం నిర్వాణా సంఘ సభ్యుడిగా పనిచేశారు.

1990 లో ఆంధ్ర ప్రదేశ్ సారస్వత విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా అందుకున్నారు.

ఒక పక్క తెలుగు పెద్దలైన మాడపాటి హనుమంత రావు, బూర్గుల రామకృష్ణా రావు, సూరవరం ప్రతాపరెడ్డి వారితో సత్-సాంపత్యం ఉంచుతూ, కొత్త నీరు (తెలుగు సాహిత్యకారులను) ప్రోత్సహిస్తూ వచ్చారు. గడియారం రామకృష్ణ గారి నోటిలోని నాలుక ఈయన.సాహిత్య లోకం లో:

తెలుగు సాహిత్యంలో దేవులపల్లి రామానుజరావు గారికి ప్రత్యేక స్థానం ఉంది అని చెప్పక తప్పదు. వరంగల్లులో " శోభ " పత్రిక స్థాపించి కొన్నాళ్ళు నడిపించారు.

గ్రంధాలయోధ్యమంలో చురుకుగా పాల్గొన్నారు. " ఆంధ్రుల సాంఘిక చరిత్ర " (1949) గ్రంధాన్ని ప్రకటిస్తూ, సూరవరం ప్రతాప రెడ్డి గారు దేవుల్పల్లి రామానుజరావు గారి సహాయానికి (ముద్రణకి, ప్రూఫ్ రీడింగ్ కి సహాయపడ్డారు) తమ పీఠికలో కృతజ్ఞతలు ప్రకటించినారు.

వీరి మొదటి గ్రంధం - " పచ్చ తోరణం "; రామానుజరావు గారి ఇతర రచనలు:

సారస్వత నవనీతం
తెలుగు సీమలో సాంస్కృతిక పునర్జీవనము
తెలంగాణాలో జాతీయోధ్యమాలు
నా రాడియో ప్రశంగాలు
ఉపన్యాస తోరణము
వేగుచుక్కలు
తెనుగు సాహితీ
యాబై సంవత్సరాల జ్ఞాపకాలు (1929 నుండి 1979 వరకు)
తలపుల దుమారము
పంచవర్ష ప్రణాళికలు
బంకించంద్ర చఠర్జీ జీవితము
హైద్రాబాదులో స్వాతంత్యోధ్యమం
మన దేశం - తెలుగు సీమ
జవాహర్లాల్ నెహ్రూ
గౌతమ బుద్ధుడు
కావ్యమాల

ఉర్దూ లో " తెలుగు సాహిత్య చరిత్ర " పుస్తకాన్ని ప్రచురించారు.

డాక్టర్ దేవులపల్లి రామానుజరావు గారు సంపాదకీయం వహించిన రచనలు:

శోభ సాహిత్య మాస పత్రిక
గోల్కొండ దిన పత్రిక (1948-1964)
గురజాడ శతవార్షికోత్సవ సంచిక (1962-64)
రవీంద్రనాధ్ ఠాగూర్ శత వార్షికోత్సవ సంచిక
తెలుగు మహా సభల ప్రత్యేక సంచిక (1981)


" దేవులపల్లి రామానుజరావు - ఒక రేఖాచిత్రం " అన్న పుస్తకాన్ని టి శ్రీరంగస్వామి విలువడించారు.సంపాదన మీద యావ లేక, తెలుగు రచనల మీద తృష్ణ కలిగి ఉండి, తెలుగు భాషా వికాసం కోశం ఐదు దశాబ్ధాలకు పైగా తెలుగు నాట పనిచేశిన అపూర్వ వ్యక్తి. వ్యాకరణ, అలంకార శాస్త్రలు చదవక పోయినా, సహజ తెనుగు భాషలో పాండిత్యం సంపాయించి, చిత్త శుద్ధితో తెలుగు భాష సేవలో నిమగ్నమై ఫలితాలు సాసించిన తెలుగు భాషా సాధకుడు. మూల్యాలతో కూడిన దేవులపల్లి గారి రచనలు కూడా ఆదర్శంగా నిలుస్తాయి.


 


 

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech