తల్లాప్రగడ

ప్రధాన సంపాదకులు:
తల్లాప్రగడ రావు
సంపాదక బృందం:
తాటిపాముల మృత్యుంజయుడు
తమిరిశ జానకి
కస్తూరి ఫణిమాధవ్
పుల్లెల శ్యామ్ సుందర్
అక్కుల కృష్ణ
శీర్షిక నిర్వాహకులు:
మువ్వల సుబ్బరామయ్య
ప్రఖ్యా మధు
విద్వాన్ టి.పి.ఎన్.ఆచార్యులు
ఈరంకి కామేశ్వర్
రాగధేను స్వరూప కృష్ణమూర్తి
జి.బి.శంకర్ రావు
గరికిపాటి నరసింహారావు
డా||బి.వి.పట్టాభిరాం
చొక్కాపు వెంకటరమణ
ఎం.వి.ఆర్.శాస్త్రి
చీకోలు సుందరయ్య
భండారు శ్రీనివాసరావు
తల్లాప్రగడ రామచంద్రరావు
తాటిపాముల మృత్యుంజయుడు
కూచిభొట్ల శాంతి
కస్తూరి ఫణిమాధవ్
అక్కుల కృష్ణ
వనం జ్వాలానరసింహా రావు
సరోజా జనార్ధన్
యండమూరి వీరేంద్రనాథ్
సాంకేతిక సహకారం:
మద్దాలి కార్తీక్
తూములూరు శంకర్
వెబ్ రూపకల్పన :
సి.కృష్ణ
 

 

 

 

జయదేవుని అష్టపదులు

తే.గీ.|| విష్ణువెట్లాగ అయ్యెనో కృష్ణమూర్తి!

మురళి తోనెట్లు నిల్చెనో మూడుభంగి!

అంగు గీతగోవిందపు  అష్ట పదులు

రాసి, జయదేవుడే చెప్పె రామచంద్ర!

 

జయదేవుని అష్టపదులు వినని తెలుగువారు లేరంటే అతిశయోక్తికాదు. ఎక్కడో కళింగదేశంలో 12వ శతాబ్దంలో జన్మించిన ఈ సంస్కృత కవి రచించిన గీతగోవిందం సమస్త భారతావనికి చెందినది. ఈతడి అష్టపదులు కర్ణాటక సంగీతంలో ప్రతివిద్యార్థి నేర్చుకునేవే. కుర్మపాటక విద్యాలయంలో అధ్యాపకుడుగా చేసిన జయదేవుని గీతగోవిందం ఆ నాడే పూరీ జగన్నాదుని ఆలయం నుంచి పృధ్విరాజ్  చౌహాన్ కొలువులోకూడా వినపడేదని నానుడి.

 

దశావతార సిద్ధాంతాన్ని ఈతడే తన దశక్రితిక్రృతితో ప్రతిపాదించాడని కూడా అనేకుల నమ్మకం. అంతేకాదు, శ్రీకృష్ణుడు అనగానే మనందరం సాధారణంగా ఊహించుకునే ఆతడిత్రిభంగి  ముద్ర(ఒక కాలు కొంచెం మడిచి, చేతులతో మురళి పట్టుకొని గానం చేస్తూ నిలబడే ముద్ర) కూడా జయదేవుని రూపకల్పనే అని ఎందరో విశ్వసిస్తారు. సిక్కు మతస్తులు పూజించే గురుగ్రంథ్ సాహిబ్ లో కూడా జయదేవుడు రచించిన రెండు కృతులకు స్థానం ఎలా కల్పింపబడిందో తెలియదుకానీ, అది నిజంగా పరిశోధించ తగిన విషయమే.

 

జయదేవుని గీతగోవిందంలో మొత్తం 12 భాగాలు. ఒక్కొక్క భాగాన్ని 24 ప్రభంధాలుగా విభజించారు. ప్రభంధాలలో అష్టపదులు కనిపిస్తాయి. ఎనిమిది శ్లోకాలు కలిగినది కాన ఈ శ్లోక నిర్మాణానికి ఆష్టపదులని పేరని అంటారు. 1972 లో Sir Willima Jones ఈ గీత గోవిందాన్ని ఆంగ్లంలోకి అనువదించాడు. ఆ తరువాత అనేక భాషలలోకి తర్జుమా చేయడం జరిగింది. కానీ తెలుగులో గీతగోవిందానికి సరైన వ్యాఖ్యానం జరిగినట్లు కనపడటంలేదు. ఆ లోటు భర్తిచేయడానికి డా . తాడేపల్లి  పతంజలి గారు ముందుకు వచ్చారు. ఈ నెల నుంచీ జయదేవ బృందావనం అనే సరిక్రొత్త శీర్షికలో,  ప్రతి నెలా ఒక్కొక్క  అష్టపదిపై వారు చేసే వ్యాఖ్యలు మీ ముందుకు తెస్తున్నాము.

 

డా . తాడేపల్లి  పతంజలి గారు కథకులు, కవి. ఆయన వ్రాసిన 'మామాకలాపం ' అనే రేడియో నాటకం జాతీయ అవార్డును గెలుచుకుంది. అన్నమయ్య కృతులకు భావాలు చెబుతూ, అనేక సంస్కృత గ్రంధాలకు సరళమైన తెలుగులో భాష్యానువాదాలు చెబుతూ, అందరికి సుపరిచితమైన ఈ రచయితను మీకు మళ్ళీ పరిచయం చేయడానికి సుజనరంజని సంతోషిస్తోంది.ఈ తాడేపల్లి పార్వతీశ శాస్త్రి ,సుశీల గార్ల కుమారుని వృత్తి మెహబూబ్ నగర్ లో తెలుగు లెక్చెరర్ ఐతే, ప్రవృత్తి మాత్రం ఉత్తమ సాహిత్యారాధనే.

 

మితా శీర్షికలకు మీరందిస్తున్న  ప్రోత్సాహం అనిర్వచనీయం. సుజనరంజని పత్రికాముఖంగా మీకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటోంది. ఈ శీర్షికను కూడా మీరలాగే ఆదరిస్తారని ఆశిస్తూ, మీ ప్రతిస్పందనలను ఎప్పటిలాగే తెలియచేయమని కోరుకుంటూ ఈ సంచికను మీ ముందుకు తెస్తున్నాము.

 

అలాగే ఈ సంధర్భంగా రేపల్లె లోని శ్రీకృష్ణునిపై , గర్భ బాణీలో, ఒక తెలుగు పాటను ' ఈ మాసపు గీతం ' శీర్షికలో మీ ముందుకు తెస్తున్నాము. ఆ పాటను వినండి, చదవండి, మీ అభిప్రాయాలను తెలపండి.

 

-------------------------------------------------------------------------------------------------

మనబడి వార్షికోత్సవం

సిలికానాంధ్ర  దిగ్విజయంగా  నిర్వహించే  అనేక కార్యక్రమాలలో మనబడి తలమానికమై  నిలుస్తుంది. మనబడి ఈ  సంవత్సరం తన మూడవ వార్షికోత్సవాన్ని ఫిబ్రవరి 6 వ తారీఖున సన్నీవేలు హిందూ దేవాలయంలో  జరుపుకుంటోంది. అస్సలు తెలుగు రాని పిల్లలు ఇప్పుడు చక్కగా తెలుగు చదువ గలుగుతున్నారు; తెలుగులో వ్రాయ గలుగుతున్నారు.  ….   అంతే కాదు! " ఎవర్ గ్రీన్ " తరగతి  వారైతే తమ నాటకాన్ని తామే వ్రాసుకుని, దానికి దర్శకత్వం కూడా తామే చేసుకుని అందరిముందూ ప్రదర్శించనున్నారు.

 

తెలుగు వచ్చిన వారికి, ఈ చదవటం వ్రాయటం ఒక సామాన్య విషయంగా అనిపించవచ్చు. కానీ ఈ పిల్లలు పెరిగిన వాతావరణాన్ని పరిగణలోకి తీసుకుని చూస్తే ఇది ఒక సామాన్యమైన విషయం కాదని, ఊరికే చెప్పవచ్చు. ఇండియాలో పెరిగిన పిల్లలకు ఒక తెలుగు వాతావరణం వుంటుంది. పుట్టినప్పటినుండి స్కూలుకెళ్ళేలోపలే తెలుగులో పిల్లలు మాట్లాడగలుగుతారు. భాషాజ్ఞానం ఎక్కువ  కాకపోయినా మాట్లాడటనికి సరిపోయే భాష వారికి తెలిసి వుంటుంది. వాక్యనిర్మాణం వారికి తెలియకుండానే వచ్చి వుంటుంది.  అందుచేత విద్యాలయాల్లో భాషాబోధన తెలుగులోనే చేయగలుగుతారు.

 

కానీ అదే ఆ విద్యార్థిని ఏ జర్మనో నేర్చుకోమన్నామనుకోండి…. ఆ భాషని తెలుగులోకి తర్జుమా చేసుకొని నేర్చుకోడానికి ప్రయత్నించడం జరుగుతుంది. వాక్యనిర్మాణసరళి భాషకీ భాషకీ మారుతూ వుంటుంది. ఆ సరళిని అర్థం చేసుకోడానికే  ఎంతో సమయం పడుతుంది. ఈ భొదనా విధానాన్ని second language teaching technique అని వ్యవహరిస్తాము. అమెరికాలోని తెలుగు పిల్లలు వాస్తవానికి తెలుగు వారే ఐనా, వీరు తమ తమ ఇళ్ళలో కూడా తెలుగు మాట్లాడక పోవడం వల్ల, వారు ఆ తెలుగు వాతావరణాన్ని పూర్తిగా కోల్పోయి వుంటారు. అందుచేత ఇక్కడ తెలుగు భొదనా పద్దతి  కూడా ఒక Second Language Teaching  మాదిరిగానే జరపవలసి వస్తుంది.

 

భోధనా పద్దతిని సిలికానాంధ్ర, తెలుగు విశ్వవిద్యాలయం, CIIL, Mysoreల వారి  సమ్యుక్త సహకారంతో రూపొందించి, దానికి నాలుగు సంవత్సరాల ప్రణాళికను తయారుచేసి, దేశవ్యాప్తంగా అమెరికాలోని ఆంధ్రులందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ ప్రతి సంవత్సరం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ధృవీకరణ పత్రాలు అందజేస్తుంది. మొదటి సంవత్సరం స్నాతకోత్సవోపన్యాసంలో తెలుగు విశ్వవిద్యాలయం  ఉపకులపతి శ్రీమతి ఆవుల మంజులత మాట్లాడుతూ, ఈ ప్రయోగానికి కావలసిన మద్దతును అందించడానికి తమ విశ్వవిద్యాలయం  ముందుకు వస్తుందని హామీ ఇచ్చారు.

 

ఈ మద్దతుతో, సిలికానాంధ్ర సాంస్కృతిక సైనికుల నిరతరనిస్వార్ద కృషితో, నేడు 15 రాష్ట్రాలలోకి 50 విద్యాలయాలుగా పరిణతి పొంది, దాదాపు 1500 మంది విద్యార్థులతో, మనబడి అతిప్రాచుర్యం అతితక్కువ కాలంలో పొందింది. ఈ సందర్భంగా తన మూడవ వార్షికోత్సవాన్ని అతి వైభవోపేతంగా జరుపుకోనుంది. ఇందులో అన్ని విద్యాలయాల పిల్లలు, తమతమ ప్రతిభాపాఠవాలను ప్రదర్శించనున్నారు. ఇందులో వివిధ నాటకాలనూ, పాటలనూ, నాట్యాలనూ తెలుగు కళలనూ, సాంప్రదాయాలనూ ప్రతిబింబిస్తూ చేయడం ఒక ఎత్తైతే, ...... .... తమ నాటకాన్ని ఒక తరగతి వారు తామె వ్రాసుకుని, దర్శకత్వం కూడా చేసుకుని ప్రదర్శించడం నిజంగా ఒక హైలైట్.

 

ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. రండి! వచ్చి ఈ చిన్నారులను ఆశీర్వదించండి. ఈ కార్యక్రమంలో మీరుకూడా ఒక క్రియాశీలక భాగస్వాములుకండి.

మీ

 

మీ
రావు తల్లాప్రగడ
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech