ధారావాహికలు
విశ్వామిత్ర 2015 - నవల ( 8వ భాగము )
- యస్. యస్. వి రమణారావు

వైజాగ్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో జగదీష్,రాజు,అభిషేక్ కూర్చుని ఉన్నారు.జగదీష్ కేసు గురించి,సస్పెక్ట్స్ గురించి బ్రీఫింగ్ ఇచ్చాడు. రాజు కేస్ ఫైల్ తీసుకొచ్చి అభిషేక్ కి ఇచ్చాడు.అభిషేక్,ఆరడుగుల ఎత్తు,అభిషేక్ బచ్చన్ లా లావూ సన్నానికి మధ్యగా కనబడే రూపం.చురుకైన కళ్ళు.షార్ప్ షూటర్ అని పోలీస్ డిపార్ట్మెంట్ లో,మంచి పేరు. ఫైల్ పేజీలు తిప్పడం ప్రారంభించాడు అభిషేక్.మొదట్లో హోటల్ పేజీలు ఉన్నాయి.తరవాత సస్పెక్ట్స్ ఫోటోలు.అందులో మొదటి ఫొటో చూడగానే "ఇతన్ని నేను చూశాను"అన్నాడు అభిషేక్.వెంటనే రాజు,జగదీష్ ఇద్దరూ ఆ ఫొటో వంక చూశారు."ఎక్కడ చూశారు?"ఇద్దరూ ఒకేసారి అడిగారు.

"శ్రీశైలంలో. జస్ట్ టూడేస్ బాక్, శివరాత్రినాడు.నా గర్ల్ ఫ్రెండ్ ఈఊళ్ళోనే ఉంటుంది.షి ఈజ్ ఎ డాక్టర్.అందువల్ల ఇక్కడ పోస్టింగ్స్ రాగానే ఆమెకు ఫోన్ చేసి చెప్పాను,ఇవాళ డ్యూటీకి రిపోర్ట్ చేస్తున్నానని.ఆమెను సర్ప్రైజ్ చేద్దామని రెండురోజులముందే వచ్చాను.అప్పుడు తెలిసింది,తను శ్రీశైలం వెళ్ళిందని. నేనూ వెళ్ళాను.అక్కడే చూశాను ఇతన్ని.శివరాత్రి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లో ఇతను పాట పాడి డాన్స్ చేస్తుంటే నాగర్ల్ ఫ్రెండ్ వీడియో కెమెరాతో మొత్తం షూట్ చేసింది కూడా.ఆ ప్రోగ్రామ్స్ చాలా బావున్నాయని మర్నాడు లోకల్ ఎడిషన్ లో న్యూస్ కూడా వచ్చింది.మీకు వాట్సాప్ లో పంపిస్తాను"

పాట మొత్తం చూశారు ముగ్గురూ.

"ఇతనే సార్ విశ్వామిత్ర అంటే.హైడింగ్ లో ఉన్నాడని అనుకుంటున్నాం.ఇతనూ,ఇతనితో పాటు తిరిగే నలుగురు అనుచరులు కూడా బ్లాస్ట్ అయిన రోజునించి కనబడటం లేదు."రాజు చెప్పాడు
"దీన్నెలా అర్థం చేసుకోవాలి?"అడిగాడు జగదీష్ "హి ఈజ్ నాట్ ఇన్ హైడింగ్,కాని మీకు కనపడట్లేదు,మిమ్మల్ని కలవట్లేదు."అభిషేక్ ఒక్క క్షణం ఆగాడు."ఏదైనా పాతకేసు గాని,లేదా ఇదే కేసుమీద గాని అతన్ని అరెస్ట్ చేయమని స్టేట్ వైడ్ అన్ని పోలీస్ స్టేషన్ లకి సర్క్యులర్ పంపించండి.అతన్ని పట్టుకుంటే మనకేదైనా ఆధారాలు దొరకొచ్చు."

అబిషేక్ కుర్చీలోంచి లేచాడు.మెదడులో ఏవో ఆలోచనలు తీవ్రంగా ముసురుకున్నాయి.అడిగాడు రాజు "ఏంటి సార్ ఆలోచిస్తున్నారు?"

"నాకెందుకో అతన్ని మనం పట్టుకోలేం అనిపిస్తోంది.ఐ అండర్ వెంట్ స్పెషల్ ట్రైనింగ్.మొహంలో ఆ వెలుగు,కళ్ళలోకనబడే ఆ ఆత్మ విశ్వాసం.మీరనుకుంటున్నట్టు అతను వీధి రౌడీ కాడు."తల విదిలించాడు అభిషేక్" My sixth sense or seventh sense whatever U call it, gives me a feeling that this case is going to be the most fascinating case in the history of police department.ఆ మనిషి,ఆ మనిషిలో ఏదో ఉంది.ఏదో విషాదం,ఏదో తపన,ఏదో పట్టుదల,ఏదో.."మళ్ళీ తల విదిలించాడు అభిషేక్.

జగదీష్,రాజు, ఇద్దరి కళ్ళు పెద్దవయ్యాయి ఆ మాటలు వినగానే.కొంచెంసేపు నిశ్శబ్దం తాండవించింది స్టేషన్ లో.

సిబిఐ గెస్ట్ హౌస్ దగ్గర అభిషేక్ ని డ్రాప్ చేశాడు రాజు.

"రేపు నేను ఆఫీస్ కి రావడం లేదు.I just want to meet my girl friend here and see the city."

"కారు కావాలా సార్" అడిగాడు రాజు.

"అక్కర్లేదు.కాని తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే చాలు"

"ష్యూర్ సార్.ఎన్నింటికి రమ్మంటారు?"

"తొమ్మిదికల్లా వస్తే చాలు"

"ok సార్"

(సశేషం)


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)