కవితా స్రవంతి
సాధిస్తానని ఆశిస్తూ
- జి. సందిత

వివిధ కారణాల్ని
వెతుక్కుంటూ
నెంబరేదొచ్చినా
లెఖ్కసరైనదేనంటూ
లెక్కల్తో రాజీపడే
మట్కాపిచ్చోళ్ళలా
నేను నా మనస్సునోదార్చుకుంటా!

ఆశకూ
అవకాశానికి
మధ్యలో
కాలప్రమాణ దూరంలో
సాఫల్యపుటూహ
హుళక్కియైన ప్రతిసారీ
కళుక్కుమంటున్న మనస్సుపై
తళుక్కుమంటున్న
సజీవోహల నగిషీల్లో
చిగురుటాశల్ని చుట్టి
ఉత్సాహపుటూపిరుల్ని
పూరిస్తూ కొనసాగిస్తూ
భావాల్ని బ్రతికిస్తున్నా....

వివిఐపీల హఠాన్మరణాలూ
కీర్త్యుత్థాన సంస్మరణ
కార్యాచరణ
చరణ ఘట్టనలూ...
నా అవకాశ స్వప్నసాకారాల్ని..
తుడిచేస్తున్నా..
రేపన్నదెప్పుడైనా
సాఫల్యాన్ని
సాక్షాత్కరింపజేస్తుందన్న
దింపుడుకల్లపు పొడిగింపుల
కొసరుటాశతో
గడుస్తున్న కాలంతోపాటు
పొడుస్తున్న ప్రొద్దుతోపాటు
సాపల్యం కోసం..
ఎదురుచూస్తూన్న
నవకవిత్వాన్ని నేను!
వైప్లవ్యాన్ని మోహించిన
నవమానవత్వాన్ని నేను!!

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)