పసందైన వంటలు

నిప్పట్లు

- నిర్వహణ : సి. వి. ఆర్. సత్యశ్రీ    


 

అందరూ తినదగిన చిరుతిండి నిప్పట్లు.

వీటిని తయారు చేసుకోవడానికి కావల్సిన పదార్ధాలు:

వేరు శెనగపప్పు : 100గ్రా.
పుట్నాల పప్పు (గుల్ల సెనగపప్పు) : 50 గ్రా.
నువ్వులు : 1 స్పూను
జీలకర్ర : 1 స్పూను
ఎండుమిర్చి : 1 స్పూను (ఎండుమిరపకాయలను కచ్చాపచ్చాగ నూరుకోవాలి) లేదా పచ్చికారం వాడవచ్చు.
ఎండు కొబ్బరి : 50 గ్రా.

ఇంగువు : చిటికెడు
బియ్యంపిండి : ఒక కప్పు
మైదాపిండి : అర కప్పు
సెనగపిండి : పావు కప్పు
ఉప్పు : తగినంత
నూనె : వేయించడానికి సరిపడా.

తయారు చేసే విధానం:

ముందుగా పల్లీలు (వేరు శెనగ గుళ్ళు) వేయించి వేడి చల్లారనివ్వాలి.
పుట్నాల పప్పు (గుల్ల సెనగపప్పు) మరియు వేయించి చల్లార్చుకున్న పల్లీలను కొంచెం పలుకుగా మిక్సీ పెట్టుకోవాలి.
ఒక పాత్రలో బియ్యంపిండి, మైదాపిండి, సెనగపిండి, ఎండిమిర్చి, నువ్వులు, జీలకర్ర, ఇంగువ, ఉప్పు వేసుకుని కలపాలి.
ఎండుకొబ్బరి ని సన్నగా తురుముకొని మిశ్రమంలో కలపాలి.
మిక్సీ పట్టుకున్న పుట్నాలు, పల్లీల పొడిని కూడా వేసి అన్నింటిని పొడిగా బాగా కలపాలి.
రెండు స్పూన్ల నూనె విడిగా వేడి చేసి పెట్టుకొని దానిని పైన కలిపిన మిశ్రమంలో పోసి కలపాలి.
తరువాత తగినన్ని నీళ్ళు పోసుకుంటూ చపాతి పిండి ముద్దలా కలుపుకోవాలి.
బాగా చేతితో మర్దించాలి.
తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని ప్లాస్టిక్ పేపర్ మీద నెయ్యిగాని, నూనె గాని రాసి అరచేతికి సరిపడా సైజులో వత్తుకోవాలి.
మరీ పల్చగానూ లేదా మరీ లావుగాను కాకుండా వత్తుకోవాలి.
వేయించడానికి సరిపడా నూనెను బాండీలో వేడిచేసుకుని ఒత్తుకున్న అట్లను ఒక్కొక్కటిగా వేసి రెండువైపులా ఎర్రగా వేయించుకోవాలి.

అంతే.. ఎంతో రుచికరంగా ఉండే నిప్పట్లు తయారైనట్లే.
వీటిని వేడి ఆరనిచ్చాక గాలి జొరపడని డబ్బాల్లో నిల్వ ఉంచుకొని ఉపయోగించుకోవచ్చు.

 


 
     
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)