శీర్షికలు

తెలుగు తేజోమూర్తులు

- నిర్వహణ : ఈరంకి వెంకట కామేశ్వర్    


 

తమ తమ రంగాలలో నిష్ణాతులై, విశిష్టతనాపదించుకుని, పేరు ప్రఖ్యాతులనార్జించి "గొప్పతనం" సాధించిన తెలుగు వారెందరోఉన్నారు.

వాళ్ళు ఎదుర్కున్న ప్రతిబంధకాలు, సంక్లిష్ట పరిస్థితులు, అనుభవించిన నిర్భందాలు, పడిన ఆవేదన, చేపట్టిన దీక్ష, చేసిన కృషి,  సాధన, కనపరచిన పరకాష్ట, సాధించిన విజయాలు, ఆ విజయ రహస్యాలు, ఇలాంటి విషయాలను పరిశీలించి, సమీకరించి, పొందుపరచి ఈ కధనాలలో మీ ముందు ప్రస్తుతీకరిస్తున్నాం.క్షిపణి గురువు పద్మ భూషణ్ డాక్టర్ విజయ్ కుమార్ సారస్వత్
 

భారతదేశ అతి విశిష్ట రక్షణ క్షిపణి శాస్త్రవేత్త, రూపకర్త. వందల, వేల కోట్లు విలువ చేస్తుంది వీరి మేదా శక్తి. భారత దేశ ప్రప్రధమ లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజన్ నిర్మించారు. భారత దేశ ప్రప్రధమ ఉపరితం నుండి ఉపరితలం క్షిపుణుళను అందించారు. ఈ క్షిపణుల కోసం ఆర్ సి ఎస్ పరిజ్ఞానాన్ని రూపొందించారు. 150 కిలోమీటర్ల క్షేత్ర పరిధి ఉన్న 'పృధ్వి - 1', 250 కిలోమీటర్ల క్షేత్ర పరిధి ఉన్న 'పృధ్వి - 2' క్షిపణులను తయారు చేశారు. శత్రు క్షిపణి విద్వంసక సామర్ధ్యాన్ని భారత దేశానికి ఆపాదించారు. భూమి ఉపరితలానికి 50 - 80 కిలోమీటర్ల పరిధిలో శత్రు క్షిపణి విధ్వంసకర క్షిపణులను రూపొందించి, ప్రయోగించి, భారత దేశ శాశ్వత ప్రయోజనాలను కాపాడేరు. అలానే 30 కిలోమీటర్ల పరిధి (ఎండో అట్మాస్ స్పియర్) లో కూడా శత్రు క్షిపణి విధ్వంసకర క్షిపణులను రూపొందించారు. ఈ నైపుణ్యం ప్రపంచంలో కేవలం నాలుగు దేశాల వద్ద ఉంది. ఇట్టి వ్యూహాత్మక, అసాధారణ విజయాలను అందించినవ్యక్తి పద్మ భూషణ్ డాక్టర్ విజయ్ కుమార్ సారస్వత్. భూ ఉపరితల క్షిపణులతో పాటు, జలాంతర్గామి క్షిపణి (ధనుష్ ని) కూడా భారత దేశ అమ్ముల పొదిలోకి చేర్చారు. తన అఖండ కృషితో అనేక వ్యూహాత్మక ప్రయోజనాలను, స్వదేశీ పరిజ్ఞానాన్ని భారత దేశానికి అందించారు. స్వదేశీకరణ మిషతో క్షిపణి క్షేత్ర మూల్య ఉపకరణాల, వ్యవస్తాపక కేంద్రాలను నెలకొల్పాడు ఈ క్షిపణి మేధావి. డాక్టర్ విజయ్ కుమార్ సారస్వత్ గారు రూపొందించిన క్షిపణులు త్రిదళాలలోనూ (ఆర్మీ, నేవీ, వాయు సేనలలో) ఉపయోగిస్తున్నారు అంటే వీరి క్షేత్ర స్థాయి శాస్త్ర పరిజ్ఞానం ఎంత శ్రేష్టమైనదో, వీరి పాండిత్య ప్రకర్షలు ఎంత అత్యుత్తమ శ్రేణివో ఇక వేరే చెప్పనక్కర లేదు. వీటిని భారత దేశ వ్యూహాత్మక సేన (శ్త్రతెగిచ్ Fఒర్చె) పరిధిలోకి కూడా తెచ్చారు.

1972 లో హైద్రాబాదులో మొదలైన వీరి రాకెట్, క్షిపణి యాత్ర నేటి వరకూ కొనసాగుతోంది. శాస్త్రవేత్త గా కార్యరధుడై, ఆ సంస్థ అత్యుత్తమ స్థానానికి ఎదిగారు. డి ఆర్ డి సంస్థ డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. భారత రక్షణ మంత్రికి ముఖ్య శాస్త్రీయ సలహాదారుగా వ్యవహరించారు. డాక్టర్ ఆవుల్ పకీర్ జైనులుబ్దిన్ అబ్దుల్ కలాం (డాక్టర్ ఏ పి జే అబ్దుల్ కలాం) గారి " పంచ పురుషులు "లో వీరొకరు. " వి మేడ్ హిస్టరీ బై లాంచింగ్ అగ్ని " అని వ్యాఖ్యానించారు సారస్వత్ గారు - భారతీయ క్షిపణుల ఆది గురువు డాక్టర్ కలాం "బర్నింగ్ ప్రైడ్ ఆఫ్ ది నేషన్ (అగ్ని) " అని " వింగ్స్ ఆఫ్ ఫయర్ " లో అభివర్ణించారు. డాక్టర్ కలాం ..క్షిపణి రారాజైతే, వీ కే సారస్వత్ క్షిపణి క్షేత్ర యువరాజు.

జననం, చదువు:

1949 లో మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ లో జన్మించారు డాక్టర్ సారస్వత్. వీరి తండ్రి ఈయనికి గురువు. చక్కని ఒరవడి నేర్పించారు. గొపాల స్వామి, డాక్టర్ అబ్దుల్ కలాం (మన రాష్ట్రపతి) వీరికి గురువులు. మంచి విచార ధారణ, తదైక భావం, ఏకాగ్ర చిత్తం వీరి వ్యక్తిత్వ గుణాలు. బి ఈ మెకానికల్ విభాగంలో గ్వాలియర్ నుండి ఉత్తీర్ణులయ్యారు. ఎం ఈ - ఐ ఐ ఎస్ సి బెంగళూర్ నుండి అందుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ప్రపల్షన్ ఇంజినీరింగ్ లో డాక్టరేట్ అందుకున్నరు.

నిర్వహించిన ఉద్యోగాలు:
- డైరెక్టర్ జనరల్ - డి ఆర్ డి ఓ
- ముఖ్య శాస్త్రీయ సలహాదారు - భారత రక్షణ మంత్రి
- అధ్యక్షుడు, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా
- ప్రోగ్రాం డైరెక్టర్ - బాలిస్టిక్ క్షిపణి సంస్థ
- శాస్త్రవేత్త, సంచాలకుడు - ఆర్ సి ఐ (రాష్ట్రీయ సెంటర్ ఇమారత్)
- ప్రాజెక్ట్ డైరెక్టర్, పృధ్వి క్షిపణి

క్షిపణి క్షేత్రం, శాస్త్రీయ పరిజ్ఞానం, రాకెట్ ప్రపల్షన్ అంశాలలో పాత్రికేయుడిగా వ్యవహరిస్తున్నారు.

సాదించిన ఘనతలు:

- భారత దేశ ప్రప్రధమ లిక్విడ్ ప్రపల్షన్ ఇంజన్ నిర్మాణం
- రాకెట్ ఇంజన్ నిర్మాణానికి కావలసిన రూపకల్పన, నిర్మాణ, టెస్టింగ్ వసతుల నిర్మాణం
- క్షిపణుల కోసం ఆర్ సి ఎస్ టెక్నాలజీస్ రూపొందించారు
- భారత దేశ ప్రప్రధమ ఉపరితం-నుండి-ఉపరితలం క్షిప్ణుళను అందించారు
- 150 కిలోమీటర్ల క్షేత్ర పరిధి ఉన్న పృధ్వి - 1 క్షిపణి
- 250 కిలోమీటర్ల క్షేత్ర పరిధి ఉన్న పృధ్వి - 2 క్షిపణి
- ఆర్ ఎల్ జి (రింగ్ లేజర్ గైరో), ఫోగ్ (ఫైబర్ ఒప్టిక్ గైరో) నిర్మాణ కేంద్రాలు నెలకొల్పారు
- వ్యూహాత్మక ఏవియానిక్స్ సంబందించిన మైక్రో, నానో సెన్సార్లు
- స్వదేశీకరణ మిషతో క్షిపణి క్షేత్ర మూల్య ఉపకరణాల, వ్యవస్తాపక కేంద్రాలను నెలకొల్పారు
- క్షిపణి విద్వంసక సామర్ధ్యాన్ని భారత దేశానికి ఆపాదించారు. భూ ఉపరితలానికి 50 - 80 కిలోమీటర్ల పరిధిలో శత్రు క్షిపణి విద్వంసకర క్షిపణులను రూపొందించి, ప్రయోగించి, భారత దేశ సాస్వత ప్రయోజనాలను కాపాడేరు. అలానే 30 కిలోమీటర్ల పరిధి (ఎండో అట్మోస్ స్పియర్) లో కూడా శత్రు క్షిపణి విద్వంశకర క్షిపణులను రూపొందించారు.

పురస్కారాలు:

ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. వాటిలో కొన్ని ముఖ్య మైనవి:

- భారత ప్రభుత్వం నుండి పద్మ భూషణ్ (2013)
- భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ (1998)
- ఇండియన్ నేషనల్ అకాడమి ఆఫ్ ఇంజినీరింగ్ - ఆచార్య జై కృష్ణ స్మారక అవార్డు
- డాక్టర్ నాయుడమ్మ స్మారక అవార్డు (2010)
- అత్యుత్తమ భారతీయుడు పురస్కారం (2006)
- డి ఆర్ డి ఓ టెక్నాలజీ లేడర్షిప్ పురస్కారం (2007)
- డి ఆర్ డి ఓ పాత్ బ్రేకింగ్ రిసర్చ్, అత్యుత్తమ పరిజ్ఞాన నిర్మాణ పురస్కారం
- పెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డు (1998)
- టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవార్డు (1996)
- ఉత్తమ శాస్త్రవేత్త (1987)

- ఫెల్లో, నేష్నల్ అకాడమి ఆఫ్ ఇంజినీరింగ్
- ఫెల్లో, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా
- ఫెల్లో, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్
- సమీర్ పరిపాలక మండలి సభ్యుడు
- సి ఎస్ ఐ ఆర్ పరిశోధనా సంస్థ సభ్యుడు
- ఉస్మానియా విశ్వవిద్యాలయ బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యుడు
- అధ్యక్షుడు, కంబశ్చన్ ఇనిస్టిట్యూట్

వీరు సాదించిన విజయాలే వీరి క్షేత్ర స్తాయి శాస్త్ర పరిజ్ఞానం ఎంత శ్రేష్టమైనదో నిర్దర్శనాలు. ప్రతీ భారతీయుడు గర్వించ దగ్గ వాడు ఈ అద్వితీయ విజయ కుమార్ సారస్వతుడు
.


 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)