సుజననీయం

- తాటిపాముల మృత్యుంజయుడు


 
 సంపాదకవర్గం:
ప్రధాన సంపాదకులు:
తాటిపాముల మృత్యుంజయుడు

సంపాదక బృందం:
తమిరిశ జానకి
కస్తూరి ఫణిమాధవ్
చెన్నాప్రగడ కృష్ణ

తెలుగు వెలుగు

నేను ఈ సంపాదకీయానికి 'తెలుగు వెలుగు ' అని పేరెట్టాను. అయితే చిన్న మనవి. 'వెలుగు' పదాన్ని గుణ నామవాచకంగా గాకుండా క్రియా నామవాచకంగా పరిగణించాలని మనవి. అంటే, 'తెలుగు వెలుగు' అంటే 'తెలుగు వెలుగుతుంది' నా ఉద్దేశం.

తెలుగు నేలపైన తిరుగాడునప్పుడు
తెలుగుమాట నోటబలికినపుడు
తెలుగువారి కథలు తలబోసినప్పుడు
పొంగిపోదును గర్వమున నేను!

    (రచయిత - వేదుల సత్యనారాయణశాస్త్రి)


నేను గత మూడు వారాలుగా కుటుంబ పనుల మీద హైద్రాబాదులో ఉంటున్నాను. స్వతహాగా, 'తెలుగు' మీద ఉన్న ప్రేమతో ఆ కోణంలో పరికించడం మొదలెట్టాను. రోడ్డు మీదకి వెళ్లితే దుకాణాల్లో ఆరో ఏడో తెలుగు దినపత్రికలు, డజనుకు పైగా తెలుగు వారపత్రికలు దర్శనమిస్తున్నాయి. అలాగే ప్రముఖ పుస్తాకాల కొట్లల్లోకి వెళ్లితే తెలుగు పుస్తాకాల కొనుగోళ్లు బాగానే జరుగుతున్నాయి. ఇంగ్లీషు, హిందీ అసలు మాట్లడలేక లేదా అరకొరగా మాట్లాడుతూ తెలుగునే పుష్కలంగా మాట్లాడే వాళ్లు కోకొల్లలు. ఇక టీవీ ప్రోగ్రాములు, తెలుగు సినిమాల సంగతి చెప్పనవసరం లేదు. అవి ఎన్నో, ఎన్నెన్నో. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, తెలుగు నేల మీద మన భాష ఏదో ఒక రూపంలో విరివిగా చెలామణి అవుతూనే ఉన్నది. 'తెలుగు మనగలడం కష్టమే' అన్న నిరాశావాదాన్ని వదలి 'సగం గ్లాసు నిండుగా ఉంది ' అన్న ఆశాభావాన్ని ఏర్పరుచుకోవాలని నా అభిప్రాయం.

అయితే ఒకటి మాత్రం నిజం. నేటి యువత దృష్టంతా 'కేరీర్' మీదనే. వ్యక్తిత్వ వికాసం మీద, కేరీర్ ఎదుగుదల, విజయాల మీడ పెక్కు తెలుగు పుస్తకాలు దర్శనమిస్తున్నాయి. కావున, ప్రస్తుత కర్తవ్యం ఏమిటీ అంటే ఆ యువత దృష్టిని కొంతైనా 'కేరీరిజం' నుండి తెలుగు సాహిత్యం వైపు మళ్లించాలి. పఠనాసక్తిని పెంపొదించాలి. తెలుగుభాష మీద పట్టు సాధించేట్లు చూడాలి. కొంతమంది పండితులు చెప్పినట్లు, ప్రతి తెలుగువాడు డిగ్రీ అయ్యేలోపు కనీసం వంద తెలుగు పద్యాలైనా కంఠత పట్టేటట్టు చూడాలి.

మనందరికి తెలుసు. ఈ దిశలో సిలికానాంధ్ర 'మనబడి', 'తెలుగాట', 'సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం' లాంటి నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టింది. భవిష్యత్తులో తెలుగు వెలుగు చల్లగా విస్తరిస్తుందని ఆశిస్తూ...

- తాటిపాముల మృత్యుంజయుడు

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)