సారస్వతం

జీవితాన్ని ఆస్వాదించండి

- రచన :  జగ్గీ వాసుదేవ్, ISHA Foundation


 

 
 

వైరాగ్యం అనేది జీవితాన్ని పూర్తిగా తప్పు అర్ధం చేసుకున్నవారి నుంచే వచ్చింది. మరి
వీరి మూలంగానే ప్రపంచంలో చాలామందికి ఆధ్యాత్మికత పట్ల ఒక విధమైన ఏవగింపు వచ్చేసింది. జీవితం పట్ల ఆసక్తి లేనివారెకే ఆధ్యాత్మికత అని ప్రస్తుతం చాలా మంది అనుకుంటున్నారు
నిజానికి ఆధ్యాత్మికత అంటే జీవితంపట్ల మీ మక్కువ విపరీతంగా పెరిగిపోయి ఈ సృష్టి లో ఉన్న ప్రతీ దాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటున్నరని. అందుకే ఆధ్యాత్మికత. మీ నిమగ్నత కేవలం భౌతిక జీవితం గురించే కాదు, జీవితం గురించి పూర్తిగా అన్నికోణాలలో తెలుసుకోవాలని, ఆధ్యాత్మికత అంటే అదే. జీవితాన్నే తప్పించుకోగోరేవారు, ఆధ్యాత్మికులెలా అవుతారు? అటువంటి వారు ఆధ్యాత్మికులయ్యే ప్రశ్నే లేదు, ఎందుకంటే ఆధ్యాత్మికతకు పూర్తి నిమగ్నత కావాలి, అన్నింటీలో పూర్తి ఆసక్తుడై ఉండాలి, లేకపోతే అవకాశంలేదు.
ఈ వైరాగ్య సిద్ధాంతాలు జీవితాన్ని అణచి వేయటమే కాక, భూగోళం మీద ఆధ్యాత్మిక అవకాశలనే మృగ్యం చేసింది, ఎందుకంటే చాలా మందికి ఆధ్యాత్మికత అంటే ఏవగింపు వచ్చింది. సగటు మనిషి అర్ధం చేసుకునేదేమిటంటే, మనిషి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాడాంటే, సరిగా తినకూడదు, సరిగా కట్టుకో గూడదు, సరిగా జీవించకూడదు, ఉక్కిరి బిక్కిరై (ఉక్కి పోయి)ఉండాలి, కనీసం అలా కనపడాలి. మీరు నవ్వితే (ఆనందంగా), సంతోషంగా ఉంటే, జీవితాన్ని ఆస్వాదిస్తుంటే, మీరు ఆధ్యాత్మికులు కాదని. ఎప్పుడూ చిరునవ్వు ఎరుగని మేక పోతులా, గంభీరంగా ఉంటేనే, మీరు ఆధ్యాత్మికులనబడాతారు. ఇదంతా వైరాగ్య సిద్ధాంతాల మూలకంగానే.
సిద్ధాంతాలు మీకు కావలసినట్లు అల్లవచ్చు, కాని అది జీవితం కాదు. జీవితాన్ని ఏమార్చే దాంట్లో మీకెందుకు ఆసక్తి? మీరు ఇక్కడకు వచ్చింది జీవించటానికి, తప్పించుకోవడానికి కాదు. ఆధ్యాత్మికత అంటే మీరు పై పై మెరుగులతో సరిపెట్టు కునే వారు కాదని, జీవత మూలాల్లోకి వెళ్ళి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నవారని అర్ధం. వైరాగ్యం తో మీరు దానిని తెలుసుకోలేరు. పూర్తి నిమగ్నతతోనే అది వస్తుంది. మీ నిమగ్నత ప్రస్తుతం ఉన్నదానికంటే చాల ఎక్కువైతేనే మీకు ఆధ్యాత్మికత తెలుస్తుంది, తప్పించుకుంటే కాదు. జీవితాన్ని తప్పించుకో జూస్తే, ఆధ్యాత్మికత సంభవించదు.
"చావటం సుఖం, బ్రతకటం కష్టం" అన్న సిద్ధాతాలనుంచి వైరాగ్య సిద్ధాంతాలు వచ్చాయి. అందుకే నాకేమీ జరగ కూడదు అనుకుంటారు. ప్రజలు నావద్దకు వచ్చి. " సద్గురూ నాకేమీ జరగ కుండేటట్లు, దీవించండి" అని వేడుకుంటారు. అదేమి బ్రతుకు? నా దీవెన మీకన్నీ జరగాలని. మీకు జీవితం అనుభవం లోకి రావాలా వద్దా? మీకు రావాలి, అందుకే మీకు అన్నీ జరగాలి. మీరు వైరాగ్యులైతే ఏమీ జరగదు. ఒక వేళ జరిగినా, వీరు వైరాగ్యులైతే దానిని మీరు ఆస్వాదించలేరు. మీరు పూర్తిగా నిమగ్న మవ్వాలి, అపుడే మీరు జీవతాన్ని ఆస్వాదిస్తారు, లేకపోతే (ఆస్వాదించలేరు)తెలియదు.


రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ప్రకృతి అన్నా, బ్రతుకు అన్నా ఆపేక్ష. ఆయన ముసలితనంతో మంచం పట్టినప్పుడు, ఆయన స్నేహితులు ఆయన చుట్టూ చేరి, అవసాన కాలము సమీపించింది కాబట్టి భగవనన్నామ స్మరణ చేసి భగవంతుణ్ణి ముక్తి కావాలని ఆయనను కోరుకోమన్నారు. అప్పుడు ఆయన ముక్తి నేనేమి చేసుకోను, నాకు మళ్ళీ మళ్ళీ ఇక్కడకు రావాలని ఉంది- మీరే చూడండి ప్రపంచమెంత అద్భుతమైనదో చూడండి, ప్రకృతి ఎంత దయకలదో చూడండి, నిజంగా భగవంతుడుంటే ఈ ప్రకృతితో ఉండటానికి నన్ను మళ్ళీ మళ్ళీ ఇక్కడకు పంపమని అడుగుతాను అన్నాడు. అలా జీవితంతో నిమగ్నమైన వారికే జీవితమంటే ఏమిటో తెలుస్తుంది, మిగతా వారికి కాదు....
ప్రఖ్యాత శాస్త్రవేత్త న్యూటన్ కూఅ లానే జరిగింది, ఆయనకు మృత్యువు సమీపించినప్పుడు ఆయన, నాకు ఈ సైన్సు అంటే ఏమీ తెలియదు. నేను సముద్రపు ఒడ్డున గవ్వలు ఏరుకోవటంలో జీవితన్ని వ్యర్ధం చేశాను, అసలు సముద్రాన్ని అన్వేషించలేదు. నాకు సముద్రాన్ని అన్వేషించే మళ్ళీ అవకాశం వస్తే బాగుంటుంది అన్నాడు.
 

 
 
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)