సారస్వతం / పుస్తక పరిచయం

ఇంటి మీద దుప్పటి

పరిచయ కర్త - తాటిపాముల మృత్యుంజయుడు


 

 

 
 

సలసల కాగే సుడిగుండం కథలు

రచయితలు కథావస్తువుల కోసం మానవ జీవితాల్ని సునిశితంగా గమనిస్తారు. సమస్యల లోతులకెళ్లి పరిశీలిస్తారు. సహృదయంతో అర్థం చేసుకుంటారు. మనస్సు పెట్టి ఆలోచిస్తారు. అయితే ఏ గొంతుతో చెబుతారు అన్నది ఆయా రచయితల వ్యక్తిత్వం పై, ఆలోచనా ధోరణిపై ఆధారపడి ఉంటుంది.

ఎస్.గణపతిరావు గారి 'ఇంటి మీద దుప్పటి ' పుస్తకాన్ని చేతిలో తీసుకొని చదవడం ఆరంభించినప్పుడు మొదటి అట్టనుండే ఆ కథల ధోరణి ఏమిటో ఇట్టే అవగాహనకు వస్తుంది. 'రేపటి కోసం ఆలోచించే వారి కోసం' అంటాడు గణపతిరావు. నిజంగానే కథలన్నీ ప్రస్తుత సమస్యలను నిక్కచ్చిగా విమర్శిస్తాయి. బాహాటంగా బట్టల్ని ఉతికి మురికిని తీసినట్టనిపిస్తాయి.

'చదువుకోకుండా ఏ ఆడపిల్ల, మగపిల్లావాడు ఉండకూడదు ' అంటూ వీరోచిత ఆఫ్ఘాన్ బాలిక మలాల స్ఫూర్తితో రాసిన కథ 'మలాల అల్లా'. నార్వేలో భారతదేశపు పిల్లాడిపై తల్లిదండ్రులు జరిపిన ఆఘాయిత్యాన్ని కథాంశంగా రెండు దేశాల మధ్య జరిగే సమస్యగా విస్తృత పరిధిలో సృజించాడు 'కొత్త వంగడాలు ' కథలో. జడ్జీలే లంచగొండులై సమాజంలోని 'బడా బాబులు ' అయినా నేరస్తులతో చేయి కలిపిన వైనాన్ని చిత్రీకరించిన కథ 'బోనులో జడ్జీగారు '. ఇలా ఈ సంపుటంలోని పన్నెండు కథలన్నీ వైవిధ్యమైన రచనలే.

ఈ కథల్లో ఉపయోగించిన పదజాలం, వాక్య నిర్మాణం వ్యతిరేక ధోరణిని, ఉద్యమ భావాల్ని వ్యక్తపరుస్తాయి. ఉదాహరణకు - 'పెద్ద మనిషి కుక్కల చెయిన్ లాగా ధగధగ లాడే బంగారు గొలుసు ధరించాడు ', 'బొడ్డూడని ఆ బిడ్డ రక్తం బడబాగ్నులను కక్కుతోంది ', 'దద్దమ్మల్లాగా స్వార్థమ్మలు తయారయ్యి చెరుకు రసంలా జాతిని గడగడా తాగేసి '. అలాగే, ప్రముఖ రచయిత్రి శ్రీమతి అబ్బూరి చాయాదేవి ఈ పుస్తకానికి ముందుమాట రాయటం ఒక విశేషం.

పుస్తకం పేరు: ఇంటి మీద దుప్పటి
రచయిత: ఎస్. గణపతిరావు
దొరకుచోటు: విశాలాంధ్ర బుక్ హౌస్
ఖరీదు: ఋస్. 100, విదేశాల్లో $5

 

 
 
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)