తెలుగు తేజోమూర్తులు - రచన : ఈరంకి వెంకట కామేశ్వర్.

కలప శాస్త్రవేత్త - డాక్టర్ శొంటి కామేశం

కలప (టింబర్) బహుకాలం మన్నేందుకు ఉపాయం చేశారు. కలపతో పటిష్టమైన బ్రిడ్జిలు (వంతెనలు) కట్టవచ్చు అని నిరూపించేరు. టెలిఫోన్ స్తంభాలు పది కాలాలు నిలవాలంటే ఈ ద్రవ్యాన్ని ఉపయోగిస్తారు. కలప మన్నన పెరుగుతుంది కాబట్టి - ఖర్చులు తగ్గుతాయి. ఈ ప్రయోజనాలు పొందడానికి అమెరికా బెల్ టెలిఫోన్ కంపెని దీన్ని విరివిగా వాడేరు. అదే " సి సి ఏ " మిక్చర్. ఇలాటి అఖండ విజయాలు, ప్రయోజనాలు సాధించిన అపూర్వ ఇంజినీర్, శాస్త్రవేత్త డాక్టర్ శొంటి కామేశం గారు.

చాలా మంది ఊహకు కూడా అందదు - ఓ భారతీయుడు, అందులో ఓ తెలుగు వాడు అంతర్జాతీయ నైపుణ్య, ప్రమాణలతో రూపొందించడం, దాన్ని ఆ రోజుల్లోనే (1938 లో) పేటెంట్ చేయండం, తరువాత బహుళజాతి సంస్థకు అమ్మివేయడం, బోళ్ళంత సంపాయించడం - ఇవన్నీ ఎప్పుడో సాధించారు - డాక్టర్ శొంటి కామేశం గారు. ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేటట్టుగా - జర్మన్ శాస్త్రవేత్త ఫాల్క్ తో కలసి " ఫాల్కామేశం ఆర్సినిక్ కాపర్ మిక్చర్." ద్రవ్యాన్ని రూపొందించారు. అపట్లో ఉన్న " వోల్మన్ సాల్ట్స్ " కన్నా ఇది శ్రేష్ట మైనది. ఆ రోజులలో ఓ భారతీయుడు ఈ తరహా విజయం సాదించడం ఎంతో స్లాఘనీయమైన విషయం.

బాల్యం, చదువు, ఉద్యోగం:

శొంటి కామేశం గారు 1890 లో ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ గోదావరి నర్సాపూర్ లో జన్మించారు. విశాఖపట్నంలో ప్రాధమిక చదువు పూర్తి చేసి, చెన్నై ప్రెసిడెన్సి కాలేజి నుండి ఉత్తీర్నులై, గిండీ ఇంజినీరింగ్ కాలేజి నుండి బి ఈ పట్టా సాధించారు. తరువాత డెహ్రా డూన్ లోని " వన్య పరిశోధనా సంస్థ " (ఫారెస్ట్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్) లో ఉద్యోగం లో చేరారు.

వెదురుని నిర్మాణ క్షేత్రంలో పులు రకాలుగా వినియోగించే పరిశోధనలు చేశారు. 1936లో, అరవై అడుగుల వైశాల్యంతో ఉన్న హైవే బ్రిడ్జ్ నిర్మించారు. ఇది నిలుస్తుందా అని సందేహించినప్పుడు రెండు ఏనుగులని పురమాయించి దాని మీద నిలబెట్టారు. తరువాత అనేక వంతెనల రూపకల్పన చేశారు.

రిటైర్ అయిన తరువాత కూడా తిరువంకూర్ ఎస్టేట్ లో పనిచేశారు.

కామేశం గారు చేసిన విశిష్ట కృషికి ఆంధ్ర విశ్వవిద్యాలయం " డాక్టరేట్ ఆఫ్ సైన్స్ " పట్టాతో గౌరవించింది.

1943 లో భారీ నిర్మాణ వ్యయం లేకుండా చవకగా, నాణ్యమైన హైవే వంతెనల నిర్మాణానికి మిక్కిలి కృషి చేశారు శొంటి కామేశం గారు.

డాక్టర్ శొంటి కామేశం గారు రచించిన పుస్తకాలు:

- బెటర్ అండ్ చీపర్ హై వే బ్రిడ్జెస్ - తైర్ డిసైన్ అండ్ బిల్స్ ఆఫ్ మటీరియల్ ఫర్ స్పాన్స్ - 9 టు 70 ఫీట్

- సమ్మరి ఆఫ్ రెజల్ట్స్ ఆఫ్ లాబొరేటరీ ఎక్స్పరిమెంట్స్ విత్ డిఫరెంట్ వుడ్ ప్రిసర్వింగ్ ఆంటిసెప్టిక్స్ (రెసుల్ట్స్ ఆఫ్ 14 ఇయర్స్ ఎక్స్పరిమెంట్స్) (1925)

కామేశం గారి మీద విలువడిన పుస్తకాలు:

- " శొంటి కామేశం " - లాంబర్ట్ ఎం సర్హోన్, మారియంట్ టెన్నోన్, సుసాన్ హెన్ సొనో

 - లూమినరీస్ ఆఫ్ 20th సెంచరీ, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ప్రచురణ (2005)

1954 లో పరమపదించారు శొంటి కామేశం గారు.

ఓ ద్రవ్యాన్ని రూపొందించి కలప (టింబర్) కు ధీర్గాయువు పోసి బహుళ ప్రయోజనాలు సాధించిన శాస్త్రవేత్త శ్రీ కామేశం గారు. అఖండ విజయాలు, ప్రయోజనాలు సాధించిన అపూర్వ ఇంజినీర్, శాస్త్రవేత్త శ్రీ శొంటి కామేశం గారు.

నేటి తరం ఇలాంటి భారీ ప్రయత్నాలు చేస్తోంది. కానీ దాదాపు వందేళ్ళ క్రితం ఈ తరహా సాధన చేసి, అఖండ విజ గౌరవాలు సాధించన ఘనులు - డాక్టర్ శొంటి కామేశం గారు. భావి తారాలకు ఆదర్శం అని నిస్సంకోచముగా చెప్పవచ్చు. వీరు కలప క్షేత్రంలో చేసిన సేవలు చిరస్మరణీయం.

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
   
సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech