పాఠకుల సమర్పణ  
     పాఠకుల స్పందన    
1

Response to: jan12 vanam
 Name: Raju, Assistant Editor Chandamama

Message: జ్వాలా నరసింహారావు గారూ,
మళ్లీ ఇక్కడ కలుస్తున్నాం. మీరు నెల్లును పొల్లును వేరు చేస్తూ చాలా సంయమనంగా హింస ప్రతి హింసలపై తీర్పు చెబుతూ చక్కటి వ్యాసం రాశారు సంతోషం

కాని స్టాలిన్ భారతీయ కమ్యూనిస్టులను పిలిపించి చెప్పినవి మీరు ఉటంకిస్తున్నప్పుడు వాళ్లకు స్టాలిన్ చెప్పనివి కూడా మీరు పేర్కొని ఉంటే బాగుండేది. నాకు తెలిసినవి కొన్ని మీ ముందుకు తీసుకు వస్తానండి

స్టాలిన్ పరిమితమైన తెలంగాణా ప్రాతంలో భారత సైన్యానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చెయ్యవద్దని, గొరిల్లా యుద్ధం వద్దని చెప్పి ఉంటారనడంలో సందేహం లేదు. కాని ఆయన సాయుధ పోరాటాన్ని తుంగలో తొక్కి పార్లమెంటు, అసెంబ్లీల్లోకి దూరిపోమ్మంటూ సలహా ఇచ్చినట్లు నేనెక్కడా చదవలేదండి. కార్యకర్తలు ఎత్తిన కాడిని కిందికి దింపించి చింతపండు వ్యాపారమూ, కాస్త నాజూకుగా పొగాకు వ్యాపారమూ చేసుకోమని స్టాలిన్ చెప్పినట్లు లేదండి. ప్రజాకళారూపాలకు ప్రాణం పోసిన మేటి కళాకారులను సినిమాల్లోకి చేరిపోయి బతుక్కోమని కూడా ఆయన ఎక్కడా అన్నట్లు లేదండి

బూర్జువా పార్టీలతో సమానంగా లేక పోటీగా, రాజసౌదాల వంటి కార్యాలయ భవనాలను, గ్రంధాలయ భవంతులను నిర్మించుకుని ఊరేగమని కూడా స్టాలిన్ ఎక్కడా చెప్పలేదండి. రాష్ట్రంలో, దేశంలో కూడా ఎవరికీ సాధ్యం కానంత నేర్పరితనంతో షాపులు పెట్టుకుని పుస్తకాల వ్యాపారం చేసుకుని బతకమని కూడా స్టాలిన్ ఎప్పుడూ చెప్పినట్లు నేను చదవలేదండి.. 

పార్లమెంటులో నాలుగు సీట్లు, అసెంబ్లీలో రెండు సీట్ల కోసం 'బాబు' పార్టీలతో, అమ్మ, అయ్య పార్టీలతో దశాబ్దాలుగా అంటకాగమని స్టాలిన్ ఎక్కడా చెప్పలేదండి.. 

ముఖ్యంగా హింసలకు ప్రతిహింసలకు వారో వీరో పాల్పడితే నష్టపోయేది సామాన్య ప్రజలే అంటూ అసలు సిసలు జర్నలిస్టిక్ నైపుణ్యంతో నడుస్తున్న చరిత్రపై తీర్పులు చెప్పే రోజులు వస్తాయని కూడా స్టాలిన్ ఎక్కడా చెప్పినట్లు నేను చదవలేదండి

ఇవన్నీ స్టాలిన్ ఎక్కడైనా, సందర్భంలో అయినా చెప్పి ఉన్నట్లు చూపిస్తే నా వ్యాఖ్యలోని ప్రతి అక్షరాన్ని ఉపసంహరించుకుంటానని మీకు మాట ఇస్తున్నానండి

మీరు నాకు మిత్రులు. సందేహం లేదుకాని మీరు రాసిన వ్యాస సారాంశం మాత్రం నాకు మిత్రురాలు కాదండి

క్షమాపణలండీ.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

 

2

Response to: jan12 sujananeeyam

Name: srinivas, san jose

Message: According to P N Oak, who btw is not a historian, both Christianity and Islam originated from Hinduism!!! I have been hearing P N Oak's crackpot history for more than three decades. It may worth searching web for all the "theories" of P N Oak.

If he really want to prove his "theories" he should better submit for more rigorous peer review to academic journals in Archeology and Indian History.

Otherwise, the above kind of controversial hypothesis only comes across nothing more than as sensational trash.

రావు తల్లాప్రగడ: పి.ఎన్.ఓక్ గారు చేసిన పరిశోధన శాస్త్రీయ పద్దతి కాకపోవచ్చును. కానీ, ఆయనకు కానీ, మరే శాత్రవేత్తకైనా కాని శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషణ జరపడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. మతపరమైన వచ్చే ఏ విభేదాలను ఎదుర్కోలేక ప్రభుత్వం ఇటువంటి విషయాలపై చర్చలే సాగనివ్వడం లేదని అందరికీ తెలిసిన విషయమే. ఉదాహరణకి బాబ్రీ మసీదు వివాదం కోర్టులో ఎన్నో సంవత్సరాలుగా జరిగినా సరైన విశ్లేషణ కూల్చివేత తరువాతే జరిగింది. అప్పటిదాకా ఏ శాస్త్రవేత్తాక్కడ ఒక హిందూ మందిరం వుండేదని చెప్పలేకపోయారు. కూల్చివేతను సమర్ధించలేము కానీ, అది జరగకుంటే పరిశోధన నిజంగా జరిగుండేదా, అక్కడ మొదొట్లో హిందూ మందిరం వుండేదని మన ఆర్కియాలజిస్టులెప్పటికైనా ఒప్పుకునేవారా? వారి పుస్తకాలలో ఏమీ లేదని వాదించేవారే కానీ, ఒప్పుకునేవారా? కొంచెం ఆలోచించండి! పరిశొధన పూర్తిగా జరుపలేని ఆర్కియాలజిష్టు అభిప్రాయం సామాన్య మానవుని అభిప్రాయం కన్నా గొప్పదేమీ కాదు. అలాగే ఓక్ గారి అభిప్రాయాన్ని కూడా మనం కొట్టేసే ముందు, ఒక సమగ్ర పరిశోధన జరిపితే కానీ తప్పని నిర్థారించడం కూడా సబబు కాకపోవచ్చు. ఆయన వాదన తప్పైతే వచ్చిన నష్టమేమీ లేదు, ఇది మొగలాయిల కట్టడమే నని ఋజువవుతుంది. వివాదాం పైన తెరపడుతుంది. కానీ ప్రభుత్వం అటువంటి పరిశోధనకి అనుమతివ్వడం ేదు అంటే దాని అర్థం మన ఉహించలేమా? కొంచెం ఆలోచించండి!

3

Response to: jan12 Sujananeeyam

Name: కరవది రాఘవ రావు

మిత్రులు తల్లాప్రగడ రావు గారికి, మీరు వ్రాసినట్లు మనవారు చరిత్ర రచన విషయంలో బీదవారే. ముస్లిం చరిత్ర కారులు యూరోపెయన్ చరిత్ర కారులు వ్రాసినదే చరిత్రగా చెలామణి అవుతున్నది.ఇక కవులు వ్రాసిన వారి కావ్యాల్లో గ్రంధాలలో తమను పోషించిన వారిని వారు చిన్న రాజులయినా చతుస్సముద్ర ముద్రిత ధరాధి నాదులని అరివీర భయంకరులని ,నారీ మన్మధులని వర్ణించటం పరిపాటి. అలాగే ముస్లిం చరిత్రకారులు వార్ ప్రభువుల ఇతర గుణాలను గొప్పగా మంచిగా వర్ణించటం జురిగి ఉంటుంది. అక్బర్ చక్రవర్తికి 800 మంది భార్యలు.అయన కొడుకు జహంగీర్ కు 500 మంది భార్యలు.అతఃడు పరిపాలన అంతా తన భార్య అందాలస్ రాసి నూర్జహాన్ కు అప్పగించి తాను కామకేళీ విలాసాలలో తెలుతుండేవాడు.. కాని అనార్కలి కధలో అతడొక ఆదర్శ ప్రేమికుడు.నూర్జహాన్ భర్త అక్బర్ ఆస్థానంలో ఒక మున్సబ్దారు.. నూర్జహాన్ అఖండ ప్రజ్ఞా పాటవాలు, మేధస్సు ఉన్న వ్యక్తి. మహారాణిగా హిందూస్తాన్ ను పరిపాలించాలని అనులుంది. తన అందాలను మురిపాలను ఒలక బోసి జహంగీర్ ను వలలో వేసుకొని. యుద్ధం సాకుతో తన మొదటి భర్తను అక్కడి పంపి దారిలో అతడిని హత్య చేయించింది. తరువాత జహంగీర్ ను పెళ్ళాడి మహారాణి అయి హిందూస్తానాన్ని పరిపాలించింది  She  was  the
Defacto  Emperor during the period of 
జహంగీర్. అతడి పుత్ర రత్నం షాజహాన్..తండ్రి జహంగీర్ మంచం పట్టగానే శాహన్ అధికారాన్ని హస్తగతం చేసుకొన్నాడు. నూర్జ్జహాన్ని ఖైదు చేసాడు. తండ్రి మరణం తరువాత దాదాపు ఒక 100 మందికి పైగా దగ్గర భంధువులందరినీ చంపిచాడు.ఆడవళ్ళ విషయంలో అతడు మీరు వ్రాసినట్లు విపరీతగా కాముకుడే తండ్రి తాత లాగ.. అటువంటి వ్యక్తి ఒక భార్యను దేవతగా పూజించాడనడం హాస్యస్ఫధం..మిగతా చెడు అటుఉంచితే అక్బర్, జహంగీరులు హిందూ దేవాలయాలను గౌరవించి పోషించారు. నిజానికి షాజహాన్ పుట్టింది ఒక హిందూ రాజపుట్ వనితకు. ఐయిన పెద్ద హిందూ మత ద్వేషి. దేవాలయాలను అనేకం పడగొట్టించి ధనాన్ని దోచుకున్నాడు. మీరు చెప్పినట్లు హిందూ మతాన్ని అవమానించటానికి శివాలయాన్ని సమాధిగా మర్చి ఉండవచ్చు. నల్ల తాజమహల్ ను ప్రస్తుత తాజమహల్ పక్కనే నిర్మిచాలనుకున్నాడు. సాకుతో ఔరంగజేబు తండ్రి పై తిరుగుబాటు చేసి, ప్రజా ధనం నాశనం చేస్తున్నాడని ప్రజలను నమ్మించి హిందూస్తాన్ కు సార్వభౌముడయినాడు. జహంగీర్ కుమార్తెలలో జహానార తండ్రిని చివరదాకా సేవించింది. రోషనార అన్న ఔరంగజేబ్ పక్షం వహించింది..

చాల శ్రమించి మీరు విషయాలు సేకరిస్తున్నారు మీరు. అభిననదనలు. నూతన్ సంవత్సర శుభాకాంక్షలు.


రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

4

Response to: jan12 index

Name: కంకిపాటి ప్రభాకర రావు..., india
Message:
తాజ్ మహల్ విశేషాలకు స్పందన...
భారతీయుడా... చరిత్ర నిండా రాజపుట్ అమ్మాయిలను చేసుకున్న / ఎత్తుకెళ్ళిన జహాపనాల పరమత సహన / విశాల దృక్పధాలే... కానీ నవాబు గారి పిల్లను రాజపుట్ చేసుకొని బతికి బట్టకట్టిన సందర్భాలెన్ని..? ఒకసారి మనమ్మాయిని ఎత్తుకెళ్ళిన వారు ఎన్నవ భార్యగా చేసుకున్నా చివరకు వుంచుకున్నా వాళ్ళను మన బావలుగా చూసి మనమ్మాయి పసుపు కుంకుమ, సౌభాగ్యాల కోసం వాళ్ళ జోలికి వెళ్ళిన మన వాళ్ళను మన శతృవులుగా చూసి తరించాము కదా...  కడుపుచించుకుంటే కాళ్ళమీద పడటం అంటే ఇదే... అంతెందుకు .... ది గ్రేట్ టిప్పు సుల్తాన్ సామ్రాజ్యంలో అడుగుపెట్టి పరిశీలిస్తే అడుగడుగునా దేశ సాంస్కృతిక మూలాలకు తగిలిన గాయాలు అర్ధం అవుతాయి.. తన ఆస్తి కబళించాలనుకున్న విదేశీయులను మరొక గ్రూపు విదేశీయుల సాయంతో ఎదిరించపూనుకున్న టిప్పు... స్వతంత్ర పోరాట యోధునిగా చరిత్ర చెప్పమంటుంన్నది..

అదిమాని.. టిప్పూ...టిప్పూ ...అవునూగానీ అసలు నీకీ ఆస్థి ఎక్కడిది అని అడిగారో... హమ్మో.. కొంపలు మునగటం ఖాయం...

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

5

Response to: jan12 index
Name:
ప్రతాప వెంకట సుబ్బారాయుడు, సికింద్రాబాదు


Message:
రావు గారికి నమస్కృతులు:

సుజనరంజనిని ఎంత బాగా తీర్చి దిద్దుతున్నారంటే..అది అక్షర బద్ధం చేయడం అసాధ్యం! ఒక్కో శీర్షికా ఒక్కో ఆణిముత్యం! అద్భుతమైన విశేషాలని అత్యద్భుతంగా మాకందిస్తున్నతీరు ప్రశంసనీయం! కథలు..కవితలని ఎంచుకోవడంలో మీదైన ప్రత్యేక బాణి కనిపిస్తోంది. అందుకే అవి ఎంతగానో పాఠకాదరణ పొందుతున్నాయి.


మన సుజనరంజని మన సంస్కృతికీ తెలుగు భాషకీ మరింత సేవ చెయ్యాలని..అభివృద్ధి పథంలో అగ్రగామి కావాలని హృదయ పూర్వకంగా కోరుకుంటూ..అభిమాని
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

6

Response to: jan12 mukhapatram

Name: dhanumjaya, india

Message: ధన్యవాదములు.ఇటువంటి సమాచారానికి హృదయపుర్వకవందనాలు, ఒక భరతీయుడికి, ఒక తెలుగువాడికి చాలా అవసరం. ఎందుకంటే మా పిల్లలు అడిగితే తాజమహల్ గురించి మేము ఏమిచెప్పగలం.అటువంటి సమాచారం బట్టి మాకు చాలా అనందం

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

7

Response to: jan12 sujananeeyam

Name: Satya Ramisetty, Sunnyvale

Message: Again, I am looking for the day the story is retold/rewritten. I feel like writing a big mail, but end with simple wishful pray. God rewrite this history.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

8

Response to: jan12 sujananeeyam

Name: Krishna Murthy N, Vijayawada, India

Message: Very valuble information we have seen Murthy

భండారు శ్రీనివాసరావు: కృష్ణ మూర్తి గారికి - మీ స్పందనకు ధన్యవాదాలు. మీరు పేర్కొన్న విషయాలు జోడించడం వల్ల నా ఆర్టికిల్ కు పరిపూర్ణత్వం వస్తుంది. మీరు ప్రస్తావించిన తమిళ న్యాయవాది చక్రవర్తి గారు మా బావగారు సీనియర్ న్యాయవాది అయిన శ్రీ తుర్లపాటి హనుమన్త రావు గారి ఇంటి ఎదురుగా వైట్ హౌస్ లాటి పెద్ద మేడలో వుండేవారు. మా బావగారు తొంబై నాలుగో ఏట రెన్నెళ్ల క్రితమే బెజవాడలో కన్నుమూశారు. ఆయన దగ్గర కూడా ఒక చిన్న కారు వుండేది. కారున్న కుర్ర లాయరు అని చెప్పుకునే వాళ్లు. హిందూ హై స్కూలు, వెల్ కం హోటల్ ప్రస్తావన లేకపోవడం నా పొరబాటే. అలాగే రైవస్ కాలువ సంగతి. యేది ఏమయినా మీ పరిశీలనా శక్తి  అమోఘం. ధన్యవాదాలు!

9

Response to: jan12 padyamhrudyam

Name: tanmayee, CA

Message: samasya pooranam, sethakam adbhutham! keep up the nice site!

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

10

Response to: jan12 index

Name: shobhabaru, hyderabadAndhrapradesh

Message: allthe features are very interesting thank u for sharing

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

11

Response to: jan12 index

Name: basavaraju viijayalakshmi, india

Message: thank you for sending this details i am very glad to see this program

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

12

Response to: jan12 sujananeeyam
Name: hariprasad dasu, visakhapatnam
Message:
చాలా చాలా బావుంది. చాలా సహేతుకం గా రాసారు. కానీ ఒక్క తప్పు అనను, ఒక చిన్న పొరపాటు దొర్లింది రచన లో. అదేమిటంటే బెర్హంపూర్ మధ్యప్రదేష్ అని రాసేరు.బెర్హంపుర్ ఒరిస్సా లో ఉంది. దీని అసలు పేరు బ్రహ్మపురం.వచ్చే సంచిక కొసం నిరీక్షిస్తూ
రావు తల్లాప్రగడ: బర్హంపుర్ మద్యప్రదేశ్ లోదే నండి. కానీ చిత్రపటం క్రింద ఒరిస్యా అని తప్పుగా ప్రచురించినందుకు క్షమించండి. వ్యాసంలో మిగితాచోట్ల మద్యప్రదేశ్ అని సరిగ్గానే వ్రాసాము. మీ అభిమానానికి కృతజ్ఞులము!

13

Response to: jan12 sujananeeyam
Name: jyothsna, san jose
Message:
చాల బావుంది.చాల  తెలియని విషయాలు శీర్షిక వలన తెలుసుకోగలుతునాము.
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

14

Response to: jan12 index
Name:
ప్రతాప వెంకట సుబ్బారాయుడు, సికింద్రాబాదు
Message:
ఎడిటర్ గారికి నమస్కృతులు:
మాసుజనరంజని" కి సంక్రాంతి శుభాకాంక్షలు!

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

15

Response to: jan12 weekpoint
Name:
కంకిపాటి ప్రభాకర రావు..., vetapalem
Message:
భగవద్గీత ఉగ్రవాదమా???
కామ్రెడ్ కలవరం...
రష్యా...
నా.. బంగారు రష్యా....! !...
నీ దేహం ముక్కలై...
ఆచరణ సాధ్యం కాని
నీ సిద్ధాంత శవానికి
పాడెగట్టి పుష్కరాలు దాటినా ..
శవానికి మా మదిలో
గుడికట్టి .. అలంకరించి
మురిసిపోతున్నాం...
ఆనాటి అక్టోబర్ నుండి
ఈనాటివరకూ
నీ బూటులో కాలుపెట్టి ..
నీ గొంతుతో గొంతుకలిపి
ప్రపంచం గేలిచేస్తున్నా
వినకుండా
ముడ్డితో తిన్నాం..
నోటితో ఏరిగాం...
ఎఱ్ఱ చొక్కతో తుడుచుకున్నాం
ఎఱ్ఱని ఎండల్లో
నల్లని గొంగళి కప్పుకొని
వూరేగాం...
కానీ...ఇప్పుడు...
మార్క్స్ తో పుట్టి
మావోతో పోయిన
మన సిద్ధాంతపు పసికిర్ల
కళ్ళతో ...
5
వేల వర్షాల ముందే
మానవ జాతి నిజ వికాసానికి
కర్తవ్య బోధ చేసిన
భగవద్గీత లో
నీ ఆఙ్ఞ మేరకు..
ఉగ్రవాదం చూపాలన్నా / చూడాలన్నా
మానవ జాతి ఉమ్ముతారని కలవర పడుతున్నాం....
కంకిపాటి ప్రభాకర రావు...
************
(
ఇది రష్యా కోర్టు తీర్పు వెలువడక ముందు వ్రాసుకున్నది.. ఐనా తీర్పు విషయం పక్కన పెడితే " తూ.గో జిల్లా లో చర్చిలో మేరీ మాత కళ్ళు తెరిచిందట " అంటే నోరెత్తని హేతువాద సంఘాలూ.. చర్చలకు కూర్చోపెట్టని చానళ్ళూ... నిన్నటికి నిన్న ఎవరో సిలువ వేసుకోమంటే రడీ ఐపోయిన మూర్ఖుల గురించీ ..  వారిని ప్రేరేపించిన పెద్దల గురించి నోరెత్తని మానవ హక్కుల సంఘాలూ.. ఏం ( బూతు...) చేస్తున్నాయో ప్రతి భారతీయుడూ ఆలోచించగలిగితే.. దేశానికి నిజమైన శత్రువు ఎవరో ఇట్టే అర్ధమై పోతుంది...

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

16

 Response to: jan12 vanam
 Name: naagini, india
 Message:
తెలంగాణా ఉద్యమంలో నక్సల్స్... నాదెండ్ల:

ద్యమం వెనుక నక్సలైట్లు వున్నారని కొంచెం రాజకీయ అవగాహన వున్న వ్యక్తైనా చెప్పగలడు.. ఇది ముమ్మాటికీ నిజం ... ..తెలంగాణాను వారి
షెల్టర్ జోన్ గా వుపయోగించుకొనేందుకే వారి ప్రయత్నం అని ఇట్టే అర్ధమై పోతుంది.. దేశం ముందుకు వెళ్ళాలనే వూపు మీద వున్నప్పుడు కాళ్ళు పట్టుకొని కిందకు గుంజే వారే నక్సలైట్లు.. (వాళ్ళు తమని మావోఇస్టులు అని పిలవమన్నారని మనం మావోయిస్టులు అని పిలిచి గౌరవించాల్సిన పని లేదు..మనుషులు ప్రశాంతంగా జీవించటం వీళ్ళకు ఇష్టముండదు.. నిత్యం సమస్యలు వుండటమే వీళ్ళకు కావల్సింది.. వీళ్ళు కోరుకొనే లోకం ప్రపంచంలో ఎప్పుడూ ఎక్కడా సాధ్యం కాదు..ప్రజలారా ఒక్క సోంపేట విషయంలోనే వీళ్ళ పిల్లిమొగ్గలు గమనించండి..( సోంపేట ఉద్యమం వెనుక మేమున్నామని వీళ్ళు బాహాటంగానే అంగీకరిస్తారు..) ఒక ప్రాంతం లోని ప్రజలు స్థిర ఆదాయాలతో అభివృద్ధి చెందాలంటే పారిశ్రామీకీకరణ తప్పనిసరి అని వీళ్ళు
గుర్తించమంటారు..సరే .. గుర్తించాము..అందుకే సోంపేటలో పరిశ్రమ పెట్టాలనుకున్నాము..అంతే.. ఇక వీళ్ళకు కావలసిన సమస్యల ముడి సరుకు దొరికినట్లే..స్థల సేకరణ దగ్గరనుండి.. స్థానిక ఉద్యోగ అవకాశాల వరకు పెట్టని పేచీ అంటూ వుండదు..వాటన్నిటికీ తగు సమాధానమిచ్చినా పర్యావరణ సమస్యలు లేవనెత్తుతారు..నిజమే పర్యావరణం కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి మానవుడిపై వున్నది ..ఇది ముమ్మాటికీ సత్యం.. అంటే పరిశ్రమలు పెట్టే చోట జనసాంద్రత తక్కువగా వుండాలి.. పరిశ్రమల కారణంగా వ్యవసాయ భూములు దెబ్బ తినరాదు..అలాంటి చోటే పరిశ్రమలు పెట్టాలి.. ఇప్పుడు వీళ్ళు చెప్పే లక్షణాలన్నీ సమన్వయ పరిచి చూడండి.. ఇప్పటి దాకా రాష్ట్రంలో జరిగింది వీళ్ళు చెప్పే వాస్తవ సిద్ధాంతమే..సహజంగానే తీరాంధ్ర ప్రాంతంలో జనసాంద్రత ఎక్కువగా అదేసమయంలో వ్యవసాయ యోగ్య భూములు ఎక్కువగా వుంటాయి..అందువల్లనే తీర ఆంధ్ర ప్రాంతం వ్యవసాయానికి ఆలవాలమై తెలంగాణా ప్రాంతం పరిశ్రమలకు నిలయ మైనది..అలా పరిశ్రమలు కేంద్రీకరింపబడ్డ తరువాత ఇప్పుడు అక్కడినుండి వెళ్ళగొట్టాలనే వాదనకూ వీళ్ళే నాయకత్వం / కతృత్వం వహిస్తారు..సరే మంచో చేడో..మా ప్రాంతం లో మేం పరిశ్రమలు పెట్టుకుంటాం అంటే అడ్డం కొట్టటానికి వీళ్ళే ముందుంటారు.. గమ్మత్తేమంటే రాజకీయనాయకులు ప్రాంతాల వారీగా చీలినా వీళ్ళల్లో చీలిక రాలేదు..తెలంగాణా వాదులు చెప్పినట్లు సీమాంధ్రులు నీటి దొంగలే అనుకుందాం..ఆదొంగతనం చేసి తెచ్చిన నీళ్ళు లగడపాటో, రాయపాటో, మేకపాటో ముడ్డి కడుక్కోలేదుగా.. పొలాల మీదకు పారించారు.. అంటే ఇక్కడున్న పేద వ్యవసాయ కూలీలకు పని దొరికింది.. రెండుపుటలా తిండి దొరుకుతున్నది.. అదే
వీళ్ళ బాధ.. నిజంగా సీమాంధ్రా నక్సలైట్లకు ఙాఞం వుంటే తెలంగాణా లో ఉద్యమం ఇంత తీవ్రమయ్యేది కాదు.. ఎవడ్రా వీళ్ళను దేశద్రోహులు కాదనేది.
naagini...

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

17

Response to: jan12 maanannakujejelu

Name: Manohar,Fremont, USA

Message: Thalli Thanddrulanu gurthu pettukunna meeku JOHARLU.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

18

Response to: jan12 annamayya

Name: lakshmi punnamma, hyderabad

Message: very apt for dhanurmasam

astakshari mantram!

om namo narayanaya

godbless you

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

19

Response to: jan12 govindam

Name: Dhan V Kalvakolanu, Baltimore

Message: This article is full of mistakes. I wish the author took time edit careful. Otherwise, this will lead to more "mudraa raaksham" (amplification of errors).

సుజనరంజని: We have inforrmed the author about your message. మీ అభిమానానికి కృతజ్ఞులము!

20

Response to: jan12 maamayyakujejelu
Name: Ram Prasad, Norway

Message: భానుమతి గారి 'మామకి జేజేలుచాలా బాగుందికోతికొమ్మచ్చి గురించి చెబుతూ రమణ గారు అన్న మాటలు  "ఇది వస్తుంది అని అనుకున్నానా? వచ్చింది. అలాగే రాముడు ఇంకోటి ఇస్తాడు నాకు పని వస్తుంది."ఇది ఆయన గొప్పతనానికి నిదర్శనం
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

21

Response to: oct10 rachanalaku

Name: suryaprasadarao, khammam

Message: it is interesting encouraging innovative informative covering all corners of literature and fine arts

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

22

Response to: dec10 katha-dIpamkimdaneeda
Name:
సుధాకర్, యర్నగూడెం
Message:
కథ బాగుంది. నిర్మలమైన ప్రేమకు అద్దం పడుతుంది.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

23

Response to: nov2009 mantraniki-shakti unda

Name: KOTESWAR, vijayawada

Message: CHALA BAGUNDI

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

24

Response to: jan12 maamayyakujejelu
Name:
భమిడిపాటి ఫణిబాబు, పూణె
Message:
మీరు ఎంతో అదృష్టవంతులు. శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారు "మామ" గా ఉన్నారంటే ఇంకేమి కావాలి? మాకు శ్రీ ముళ్లపూడి వారిని కలిసే అదృష్టం, 2010 లో కలిగింది. ఆయనతో గడిపిన మధురక్షణాలు జీవితాంతం గుర్తుంచుకుంటాము. మా అబ్బాయి పూణె లో ప్రారంభించిన గ్రంధాలయానికి తమ ఆశీర్వచనంతో పాతిక పుస్తకాలు, మాకు ప్రసాదించారు. తరువాత కోరగానే నాలుగు ముక్కలు వ్రాసి సందేశం గా కూడా పంపారు.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

25

Response to: jan12 index

Name: shobhabaru, hyderabadAndhrapradesh

Message: allthe features are very interesting thank u for sharing

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

26

Response to: may10 katha-pushpalaavika

Name: ananda rao, srikakulam

Message: chaala baagundi

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

27

Response to: jan12 annamayya

Name: suvarnamala, hyderabad

Message: thank you very much sir.one thing..andaram kalasi oke raagamlo paadukonte chaala chala baguntundi. kaani annamayya kirtanalu purandara dasula kirtanalu okkokkaru okkokka raagamto paadadam...ade thyagaraja kirtanalu, deekshitar kirtanas, shyamashastri.. ila veeru chesina kirtanalanu andaru oke reeti ofcourse vaalla vidwat meeda paaditenu totally same raagam same thalam but.annamayya paatalu for me balakrishna prasadgaru paadina raagalane andaru follow iete entha baaguntundi. mee abhiprayam emiti. ippudi annamayya lyrics and audio web site maakandariki chaala chaala helpfulga undi. intilone anni paatalu nerchukovaccu. thank you very much sir.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

28

Response to: jan12 samskrutamlo

Name: vtvacharya, peddapuram

Message: eesaarshika oka silaaksharam

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

29

Response to: august2009 telugutejomurthulu

Name: S B Rao, CRRAO AIMSCS,Hyderabad

Message: Congratulations for excellent articles on famous telugus in Science and thier contributions in TELUGU including those of Professor C R Rao and Professor D C Rao who happened to be a student of professor CRRAO S B RAO Director C R RAO AIMSCS Former Director of INDIAN STATISTICAL INSTITUTE, Kolkata

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

30

Response to: jan12 vanmayacharitralo

Name: padmanabharao revuru, hyderabad

Message: muralidhar rao vyasam chakkaga parisodhantmakamga undi.

R A padmanabahrao

ఏల్చూరి మురళీధరరావు: విద్వత్కవివరేణ్యులు డా. పద్మనాభరావు గారికి నమస్సుమాంజలి.

మీరు నా వ్యాసాన్ని చదివి “పరిశోధనాత్మకంగా ఉన్న”దని ఆమోదాన్నితెలియజేయటమంటే నాకొక పిహెచ్.డి. పట్టాను పొందినంత ఆనందంగా ఉన్నది. ఈ విధమైన ప్రోత్సాహదోహదానికి మీకు, ప్రకటించిన శ్రీ సుజనరంజనీ పత్త్రికా నిర్వాహక-సంపాదకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. భవదీయుడు,

31

Response to: jan12 vanmayacharitralo

Name: Venkata Rangaiah M

పత్రికాధిపతులకు నమస్సుమాంజలులు, అలాగే ఆచార్య ఏల్చూరి మురళీధర రావు గారికి వినమ్ర ప్రణామములు

మీ అంతర్జాల సాహితీ పొదరిల్లు  సుజన రంజనిని మొదటిసారిగా చూశానుతెలుగు భాషకు మీరు చేస్తున్న సేవ అమోఘముఇందు వెంట ఏల్చూరి గారికి ఒక చిన్న విన్నపముమీరు వ్రాసిన శ్రీ శివామృత లహరికి అర్ధ తాత్పర్యములను కూడా వ్రాసి అచ్చు వేస్తే నాబోటి వారికి ఎంతో ఉపయుక్తముగా వుంటుందని కోరుతున్నాను

ఏల్చూరి మురళీధరరావు: సౌజన్యమూర్తి శ్రీ రంగయ్యగారికి, నమస్సులతో,

మీ సహృదయపూర్ణమైన స్పందనకు బహూకృత ధన్యవాదాలు. సంస్కారసంపన్నులైన మైలవరపు, కొట్రా ఉభయ-వంశాల సాహిత్య సంప్రదాయంలో పుట్టి పెరిగిన మీవంటి చదువరులకు నా పద్యాలు సామాన్యములే అయినప్పటికీ – మీరన్నట్లు ఇకపైని పద్యంతోపాటు కొంత భావార్థాన్ని కూడా తప్పక చేరుస్తుంటాను. ఈ విధమైన ప్రోత్సాహదోహదానికి మీకు, ప్రకటించిన శ్రీ సుజనరంజనీ పత్రికా నిర్వాహక-సంపాదకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

భవదీయుడు,

32

Response to: jan12 pustaka parichayam-1
 Name: sailajamithra, Hyderabad
 Message:
సమీక్ష రాయడం లో ఎంత పరిపక్వత ఉంటే అంత గొప్పగా ఉంటుంది. ఎన్ని సమీక్షలు చేసిన ఇంకా నేర్చుకోవాల్సి ఉంటుంది. సత్యం మందపాటి వారి సమీక్ష ఎంతో వైవిధ్యంగా సమీక్షకులకు ఒక బోధనలా ఉంది. వారికి నా నమస్కారములు. అభినందనలు.

Satyam Mandapati: శైలజగారికి, నమస్కారం. మీ అభిప్రాయానికీ, అభిమానానికీ ధన్యవాదాలు

33

Response to: jan12 kavita-4 sankranti sohba

Name: Prajna, Hyderabad,India

Message: Chaala baundi :)

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

34

Response to: jan12 index

Name: srinivas, dharmapuri. living in muscat

Message: great. if i get a chance , i want to meet dr. b.v

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

s
35

Response to: jan12 katha-1 pandaga package

Name: lakshmi, MYSORE

Message: BAAGUNDANDI MEE PANDAGA PACKAGE KALA...INTLO ANDAROO UTSAAHAMGAA PARTICIPATE CHESTE PANDAGANI ENTAGAANO RAKTI KATTINCHA VACHCHU.... APPUDU PRATI PANDAGAA DAANI RELEVANCE TO AVTUNDI NIJAMAINA PANDAGA.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

36

Response to: jan12 kavita-4 sankranti sohba
Name: Prajna, Hyderabad,India
Message: Chaala baundi :)

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

37

Response to: jan12 samskrutamlo
Name: vtvacharya, peddapuram
Message: eesaarshika oka silaaksharam

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

38

Response to: oct2009 masaphalalu

Name: MANGARAJU, yellamanchili,vishakapatnam

Message: MA DATE OF BIRTH 07.03.1976 10.00AM 10.00 ACTUL MY DATE OF BIRTH KI MY NAME KI NO RELATION SO ACTUL MY DATE OF BIRTH KI WHICH TYPE OF NAME IS GOOD AND HOW IS MY LIFE STYLE. AND WHICH TYPE OF STONE WEARING IS GOOD SO PLEASE TELL ME AND JANMAKUNDALI THANKQ SIR

సుజనరంజని: We forwarded your message to the author. మీ అభిమానానికి కృతజ్ఞులము!

39

Response to: jan12 sangeetha

Name: purnima, california

Message: Guruvu garu

Namaskaram, i am purnima, sireesha's sister. it is very nice to see your article in siliconandhra. very informative. thanks andi.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

40

Response to: jan12 index

Name: krishnamoorty, United States.

Message: When I was a school-going kid, Kaleswara Rao Road was known as Vani Press Road, a press that had eight branches in the south, its proprietor Dasu Kesava Rao owned two of the nine cars in the town--a Chevrolet and a Citroen. There was a Tamil lawyer Chakravarti Rajagopalachari and a criminal lawyer Kolanda Reddi, both very famous. Gandhi Municipal High School was just Municipal High School with a branch in Governorpet. What about the 100-year-old Sri Kanyaka Parameswari Vissamsetti Venkata Ratnam Hindu High School. The author failed to mention the great Welcome Hotel in Gandhinagar and is branch opposite Gandhi Park. The black halwa shop was by the side of Ryves Canal and not Eluru Canal. And the pride of India, the Bezwada Railway Station. Gandhi Hill was actually Railway Hill. The great rail bridge over the Krishna is as sacred as the river and four canals taking off from it supplying life-giving waters to two states. Bewada, chooda tarama, nee sogasu chooda tarama.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech