కవితా స్రవంతి  
         అమరౌక యాత్ర
 

 రచన:  డా.అయాచితం నటేశ్వర శర్మ.
 
 
 
 

అమరౌకమో సుర
భ్రమరౌకమో సదా
విమలౌకమో హసత్
కమలౌకమో లసత్
సుమనౌకమో హిమా
న్యమితౌకమో నేత్ర
కమనీయమై మనో
రమణీయమై భావ
సుమనందనభ్రమత్
భ్రమరమ్మునై సాగి
శ్రవణీయనాదాల
రాగలయవేదాల
విహరించు భూమియై
చెలరేగు కామియై
జగద్రథనేమియై
నా నేత్రపర్వమై
మానసికశర్వమై
యామినీభామినీ
కోమలితవదనమై
అతులితప్రభలతో
అనంతప్రేమతో
లాలించినది నన్ను
పాలించినది నన్ను
కేళికల మాలికల
తూలిసోలెడి తీరు
భూషించినది నన్ను
భాషించినది వేల
కాలాల గొళాల
క్ష్వేళితచరిత్రలను
మాలికగ తూలికగ
అడుగడుగునా నిలిపి
అణువణువులో కలిపి
అరుణోదయాలలో
కౌముదులు విహరించు
తామసీసమయాల
జాహ్నవీతోయాల
సామ్యాల విహరిచు
సారసనదీజాల
సారస్వతాలతో
శుభ్రవీథీచయా
దభ్రవిభ్రమహేల
ప్రతిగేహమునితప:
ప్రతిభాసమాఖ్యయై
రాజమార్గవనాల
రథ్యొపవనజాల
గైహికోద్యానాల
హృదయవేద్యఫలాల
పరిమళించిన పృథ్వి
చరితమై దీపించు
పరమశోభాస్ఫూర్తి
నినదింప వినిపింప
నిలిచినది అమరధర
కొలుచువారికి దివ్య
ఫలములను నిలుపు వర
పఞ్చాశదధికసుత
పరివేష్టితగ వెలుగు
బహుళకుసుమప్రసర
వరకల్పవృక్షమై
ఇలలోని స్వర్గమై
కలలకొక దుర్గమై
జీవనపు మార్గమై
వెలుగులను విరజిమ్ము
వెలయు నందనవనము
అమరౌకమే భవ్య
విమలౌకమే సదా
భువి నాకమే అదొక
నవలోకమేయనగ
నమస్తే అమెరికా !
నమస్తే చతురికా 
విశ్వతోభ్రమరికా !
సకలభూభ్రమణికా !
జగదేకనాయికా !
యుగకథాదాయికా !
విశ్వాంతరాళ సం
వేదనసుశోధికా !
భూజనారాధికా !
ప్రగతి చూడ మెరికా !
ప్రాభవస్మారికా !!

   

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech