కవితా స్రవంతి  
      ఇదీ భారతం
 - రచన: 
 
 

 

 

కాలుష్యపు కోరల్లో చిక్కుకుని
కకావికలౌతున్న నగర జీవనం
సంసృతీ సంప్రదాయాలకు భిన్నంగా
సాగిలబడి పోతున్న మానవత్వం

కరువయిపోతున్న విలువలకు
ఖజానాలుగా మారురున్న పల్లె సీమలు
అంగడి బొమ్మలుగా మాత్రమే చిత్రించబడే ఆడతనం
అక్షరానికీ అక్షరానికీ మధ్య

అంతరాల ఆంతర్యాలు
అన్నీ మనసుకెక్కించుకుని
ఆందోళన పడుతున్న మనిషితనం

వెలుగు తెరల వెనుకన
వేదన కల్గించే విషాద గాధలు

బాల్యాన్ని ఎరగావేసి
ఆటంటూ పాటంటూ
వేదికలెక్కుతున్న వెకిలితనం.

నిరంతరవార్తాస్రవంతులతో
చెవులకు చిల్లులు పొడిచే
రాజకీయ నేతల హీనచరిత్రల కధనాలు
అధికారపీఠమెక్కి కులికే
అవినీతి సామ్రాట్టుల,
ఐశ్వర్య ధామాలు
కక్షలను కావేషాలను
రంగరించి పోసే
నికృష్టపు దుష్టదర్శనాల
ధారావాహికలు

ప్రణయం
కాదంటే ప్రళయమే నని
వింతవింత పోకడలతో
విజృంభిస్తున్న
పడుచుదనం పోరగాళ్ళ
పోకిరీ చేష్టలు .

బూతుపదంలేనిదే
భవితవ్యమంటూ లేదని
అసభ్యమూ
అశ్లీలమూ ఐన పదాల
పోహళింపుతో
మల్లెల వేళల్లో
ముళ్ల పొదలను
పేరుస్తూ

ఇదే నిత్యమనీ నిఖిలమనీ
భ్రమపడుతూ
మిడిసిపడుతున్న [వి] చిత్రసీమలో
సౌమనస్యాన్ని
సాహిత్య సీమలను, విషపూరితం చేస్తున్న
విద్యల విలువ
తెలుసుకోలేని వింతపశువులు .
అన్నీ నిన్నటికధలై
అంతరించిపోవాలని
ఆ సర్వేశ్వరుడిని ప్రార్ధిస్తూ
కాలం వెళ్ళ దీస్తున్న వృద్ధాప్యం.
 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech