కబుర్లు  
     ఫన్ కౌంటర్ రచన : ఫణిమాధవ్ కస్తూరి  

మొక్కు


మొక్కు
మొక్క లేదా ..
ఐతే దేవుడు వరమిస్తాడు..?

అడగందే అమ్మైనా పెట్టదు
అడిగినా ప్రభుత్వానికి పట్టదు


పుట్టినపుడేసిన ఉయ్యాల నుంచీ ఆఖర్న కాల్చే కట్టెదాక

చదువిచ్చిన పుస్తకం - నిదురిచ్చిన మంచం
పెళ్లి చేసిన మంటపం
వంట చేసే మంట నిచ్చిన అగ్గిపుల్ల
తినే తిండి - ఉండే ఇల్లు - వాడే వస్తువులన్నీ


మొక్క వర ప్రసాదాలే
మరి నీ ఇంట మొక్క ఉందా
?
మొక్క లేదా .... ఐతే దేవుడు వరమిస్తాడు..?

-----------------------------------

అన్నాహజారే పల్కు నిరాడంబరముగాను
మన్మోహన్ పల్కు మొండిగాను
నీతి గెల్చునపుడు అవినీతి నిల్చునా
విశ్వమెరిగిన నీతిది వినర తమ్ముడా


-------------------------------------------------
ఎప్పుడు పదవులు కల్గిన
అప్పుడు పెట్టుబడులు వచ్చు అది ఎట్లన్నన్
కుప్పలుగ కాంట్రాక్టులిచ్చిన
చప్పున వేలకోట్లు వచ్చు కదరా ఓటరా
!!
--------------------------------------------
బాంబే హీరోయిన్ను తెచ్చి ఎన్నాళ్లు నేర్పినా
హిందీ ఇంగిలీషే కాని తెలుగు రాదు
కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకునా
సినిమాలు మానరా సదూకుని బాగుపడరా

---------------------------------------------------------------
ఆనాడు రావణాసురుడికి పది తలలు ఇరవై కళ్ళు..చూపు మాత్రం ఒక సీత పైనే
ఈనాటి యువకులకి ఒక తల రెండు కళ్ళు కానీ చూపు మాత్రం అందరు ఆడాళ్ళ పైనా


ఓకే అంటే ప్రొసీడ్
నో అంటే యాసిడ్

ఫణి మాధవ్ కస్తూరి :
స్వతాహాగా హాస్య స్ఫోరకత్వం కలిగిన ఫణి మాధవ్ కస్తూరి మిమిక్రీ కళాకారుడు కావటం వల్ల మరింత హాస్యం అలవడింది. నిత్యం చుట్టూ జరిగే సంఘటనలని చూసి స్పందించి అందులోని విషయాలు జనాలు విన్నప్పుడు నవ్వుకున్నా తరువాత ఆలోచించి కొంతైనా మారతారని ఆశతో వీరు వ్రాసే వ్యంగ్య రచనల సమాహారమే ' ఫన్ కౌంటర్ '. కవితలు, వ్యంగ్యరచనలు ప్రవృత్తయితే సినిమాలకు, టీవీలకు స్క్రిప్టులు వ్రాయటం వీరి వృత్తి. వ్యంగ్యమనేది కించపరిచేదిగా ఉండకూడదు. చురుక్కుమని తగిలి జాగర్తపడేలా ఉండాలి అని జాగ్రత్తలు తీసుకునే ఫణిమాధవ్ ఒక్కోసారి శ్రుతిమించితే అదుపు చేయమని కోరుతున్నారు. "ఫన్ కౌంటర్" నచ్చితే నలుగురికీ చెప్పండి. నచ్చకపోతే నాకు చెప్పండంటారు ఫణిమాథవ్.

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 






సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech