తొలిపలుకు  
     రచన : రావు తల్లాప్రగడ  
   సంపాదకవర్గం:
ప్రధాన సంపాదకులు:
రావు తల్లాప్రగడ 

సంపాదక బృందం:
తమిరిశ జానకి
కస్తూరి ఫణిమాధవ్
సి. కృష్ణ
తాటిపాముల మృత్యుంజయుడు

వెబ్ రూపకల్పన :
సి.కృష్ణ, హైదరాబాద్.
 

 

 

సుజనరంజనిలో పద్య సాహిత్యాభిలాష వున్నవారికి చదువుకోవడానికి కావలసినంత దొరుకుతుంది. గత మాసము నుంచీ డా. ఏల్చూరి మురళీధరరావు గారు వ్రాసిన వాఙ్మయ చరిత్రలో వ్యాస ఘట్టాలు అనే పరిశొధనాత్మక వ్యాసాలను ప్రచురించడం మొదలు పె ట్టాము. అలాగే డా. అక్కిరాజు సుందరరామకృష్ణగారి శనీశ్వరశతక పద్యాలను కూడా ధారావాహికంగా అందిస్తున్నాము. ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం గారీ భీమ శతకం పద్యాలు కూడా దఫాల వారీగా అందిస్తున్నాము. ఇవేకాక మరెందరో కవుల పద్యరచనలను ప్రతినెలా వేరు వేరు శీర్షికలలో ప్రచురిస్తున్నాము. వీటన్నిటితో పాటుగా పద్యం-హృద్యం శీర్షికతో సమస్యాపూరణం కూడా నిర్వహిస్తున్నాము. అయినా పాఠకులు ఇంకా ఇంకా కావాలని కోరుకోవడంతో, ఈ నెలనుంచీ శకుంతల అనే పద్యకావ్యాన్ని ధారావాహికంగా ప్రచురించబోతున్నాము.
డా.అయాచితం నటేశ్వరశర్మ గారి కలం నుంచీ జాలువారిన ఈ శకుంతల మిమ్మల్నందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాము. నటేశ్వర శర్మ గారు, డియన్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజస్ గా ఉస్మానియా యూనివర్సిటీలో చేస్తూ, తనవంతుగా సాహిత్యోపన్యాసాలు, అష్టావధానాలు, కావ్యసమీక్షలు చేస్తూ, శ్రీ వేంకటేశ్వర విలాస కావ్యము, సౌందర్యలహరి, దేవీ భాగవతము, అభిజ్ఞానశాకుంతలము వంటి అనేక పద్యరచనలను 50కి పైగా చేసారు. వీరి పద్యకావ్యాన్ని మీరు చదివి ఆనందిస్తారని తలుస్తూ, అందరికీ మరొక సారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ,
 

మీ
రావు తల్లాప్రగడ

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
   

 

 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

 
     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 

 

 

 

 

 

 

 

 

 


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech