aa పుస్తక పరిచయం  వడ్డేపల్లి కృష్ణ సరికొత్త ప్రయోగం "పాట వెలది "
                                                                                    - శైలజా మిత్ర

       

మొదట ఆటవెలది పద్యాలకు అనితర సాధ్యమయిన రూపమిచ్చిన కవి వేమన. సామాజిక దురాచారాలకు, ఆటవెలది రూపాలకు సంబంధాన్ని తెలియజేస్తూ ఒక ప్రత్యేకమయిన భావ పరమయిన ప్రక్రియగా తీర్చిదిద్దాడు. ఎందరో మహాకవులు తమ రచనల్లో  వేమనను అనుసరించాలనుకున్నారు. కానీ వేమన కాలాన్ని ధీటుగా ఎదుర్కోలేకపోయారు. నేటి సాహిత్యం నిరంతర కొత్తదనపు అన్వేషణలో నిరంతరం సాగుతోంది. ప్రముఖ కవులు పాటవెలది అనే సరికొత్త నామాన్ని ఎంచుకున్నారు తప్ప ఆటవెలదిలోని గణ స్వరూపాన్ని మార్చలేదు. నాలుగు పాదాలు ఒకే విధంగా ఉంటే ఎలా ఉంటుందనే ప్రయోగంతో నాలుగు పాదాల్లో అయిదు సూర్యగణాల్ని  ఉపయోగించారు. వేమన ఆటవెలదిలో ముడు పాదాలే ఉంటాయి. ఆంటే నాలుగో పాదం 'విశ్వదాభి రామ వినురవేమ' అనే మకుటం అన్నింటికీ వర్తిస్తుంది. కానీ కృష్ణగారు రెండు పాదాలు ఒక బాగం, మూడో పాదం ఒక బాగంలో రాసి నాలుగు పాదాల్ని ఒకే గణం వచ్చేలా వ్రాసే ఈ కవికి ఆలోచన ఎలా ఉంది అనుకుంటే ఒక ప్రత్యేకత మకుటం లేకపోవడం. ఆంటే నాలుగు పాదాలు వీరి నిర్మాణానికి అవసరం అన్నమాట ! వీరి విభజన 2 +2 లా సాగుతుంది అన్నమాట. మొదటి రెండు పాదాల్లో విషయం చెబుతారు. మూడు నాలుగు పాదాల్లో పై భాగాలకు వైరుధ్యం చూపినా నాలుగో పాదంలో కొసమెరుపు సృస్టిస్తారు. యొక్క మాటలో చెప్పాలంటే ఒక సందేశాన్ని చూపుతారు. 

 
 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

"అందలమ్ము నెక్కి అల్పుడైన 
 చీడపురుగు వోలె చిందులేయ 
పెదవి విప్పడాయే పెద్ద గూడ
పనికిరాని భజన పరులకొరకు"

ఇందులో గమనించండి పై రెండు పాదాలు అల్పుడి చిందులు గూర్చి చెప్తున్నాయి. తర్వాతి రెండు పాదాల్లో అల్పుడికి విరుద్దంగా 'పెద్ద' మౌనంగా ఉన్నట్లు చెప్పబడింది. నీచుడికి, ఉదాత్తుడికి ఉన్న భేదం సూచితమవుతోంది.. 
సమాజంలో అవసరంలేనివి ఎంతగా పెరిగిపోతున్నాయో అనేది ఈ కవి కచ్చితంగా వ్యతిరేకించారు.. . కవిత్వం కవిగా పరిపుష్టం చేయడానికే కాదు కవిగా సమాజం పట్ల తన కలంతో హెచ్చరిస్తూ వ్యతిరేకించే తీరు గమనించండి.
"విచ్చల విడిగాను వీదులందే 
ముద్దులాడు లవ్వు ముదిరిపోయే.
పబ్బు జబ్బుతోడ ఫాస్తుగాను 
వెస్టు కల్చరోచ్చే వేస్తుగాను"

అంటూ పై రెండు పాదాలు అసభ్యత ఎలా పెరిగిపోయిందో చెప్పాడు కవి. కింద రెండు పాదాల్లో దీని పరాకాష్ట భావాన్ని చెప్పి సామాజిక వ్యంగ్యాన్ని సాధిస్తున్నాడు. వడ్డేపల్లి గారు తమ భావాలతో నిర్మించిన "పాటవెలది" రూపం ఎలాఉంది అనేది మేధావులు ఆలోచించక పోరు. కాకుంటే ఒక కొత్త దానాన్ని అయితే ఆహ్వానించడం ఎవరికైనా ఆనందమే కనుక ఇందులోని ఒక కోత రూపాన్ని అందరూ హర్షించక మానరు. వీరు ఇదివరలోనే పద్యం, గేయం, వచన, కవిత, కధ, నాటిక, గేయనాటిక , లలితగీతం, ఇలా ఎన్నో ఎన్నెన్నో ప్రక్రియల్లో తన రచనా వైశిస్త్యాన్ని ఇదివరలోనే ఆవిష్కరించారు. అన్నింటిలోను ప్రముఖుల మన్ననలు పొందారు. ఇతివృత్త ఆవిష్కరణలో, చమత్కార స్పోరక భావాల కూర్పులో, అబివ్యక్తికరణలో ఒక కొత్తదనం కోసం ప్రయత్నిస్తున్న వీరు సాహితీ ప్రపంచానికి సుపరిచితులే.అన్నింటిని అధిగమిస్తే వీరు మంచి సినీ గీత రచయిత. 
చివరిగా గ్రాంధికం, వ్యావహారికం, దేశ్యం, గ్రామ్యం అన్నీ కలగలిపిన పద్యం ఒకటి గమనిద్దాం!
"పల్లెలందు వీచు పైరగాలి
పట్నామందు వీచు పాడుగాలి 
ప్రియముగాను మనిషి పీల్చు గాలి 
కలుషితమ్ము ఆయే కర్మగాలి "

ఇలాంటి పద్యాలతో మనసుకు హాయిని గొలిపే భావ చాతుర్యంతో  అలరించిన ఈ కవి సరికొత్త ప్రయోగాన్ని సంతోషంగా ఆహ్వానిద్దాం.. అంతకంటే ముందుగా అభినందిద్దాం..!
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech