సంక్రాంతి

                                                                                     - ఆర్.దమయంతి.

  చలిలో చెలి సంబరం
సంక్రాంతి ఆగమనం
సంక్రాంతి-
ఒక సుమధుర కవనం
కదం తొక్కిన జానపదం-
ఉరకలెత్తిన జన హృదయం
పుష్యం పాడె ప్రభాత భూపాలం
సాయంకాలానికి - శ్రీ రాగం.

చిటితాళాలు, గిరిగిటలు..
ఢంకా మోతలు, తంబురా వాయిద్యాలు
నాదస్వరం, మృదంగం..
డప్పులు, డమరుకాలు
వాయిద్య సమ్మేళనాలు
- పలికే పండగ స్వాగతాలు.

శివతాండవాలు, చిరుతపులి గంతులు
బులబుక్కలోడు
బసవన్నల జోడు
హరిదాసుని హరిలో హరిరంగలు
వస్తె బాగుణ్ను రింగ్ టోన్లు.

చలి కాస్తూ భోగి మంటలు
దుప్పట్లో కొత్త జంటలు..
ముంగిట్లో ముగ్గులు
కులుకుతూ గొబ్బెమ్మలు
ఎంకి జళ్ళో బంతిపూలు.

రంగు బొమ్మలు
కలల మెట్లు
కథలైన కొలువులు
రతనాల గురుతులు

కోడి పందేలు
ఎడ్ల పరుగులు
రంగుల రాట్నాలు
గణ జన మోతలు
ఊరి జాతర్లు

మురిపాల పండగ సందళ్ళు

పురి నిండిన ధాన్యం
నాన్న జేబునిండా ధనం
అమ్మ కెంతో ఆనందం
ఇల్లంతా నవ్వైన
అరిసె తీయదనం!

చలిలో చెలి సంబరం
సంక్రాంతి భుజబంధనం
గడుపుదాం-
యేడాదంతా సంతోష జీవనం
ఇలా కావాలని కోరుకుందాం
అందరికి శుభప్రదం!

-ఆర్.దమయంతి.

.
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech