చిరు కవితలు

                                                                                     -  ప్రతాప వెం. సుబ్బారాయుడు

 

పరిమళం

 

నువ్వో

చందన పరిమళానివి

ప్రతివారికీ

గుర్తుండిపోయావు!

 

* * *

పందిరి

 

పేరు లేని

అడవి తీగకి కాదు

మల్లె తీగకి

పందిరి కావాలనుంది!

 

* * *

 

చిరునవ్వు

 

నమస్కారం

కరచాలనం కాదు

చిరునవ్వే..మొదట

స్నేహితుల్ని సంపాదిస్తుంది!

 

* * *

పుణ్యం

 

పాపం అని

పెదాలతో ఉఛ్ఛరిస్తే సరిపోదు

ఆపన్న హస్తం కాగలిగినప్పుడు

అదే ఎనలేని పుణ్యం

 

 * * *

ఉపద్రవం

 

వసి వాడని పసితనం మీద

రాక్షసత్వమా?

ఉపాధ్యాయులెందుకు

ఉపద్రవాలవుతున్నారు?

 

* * *

పంచభూతాలు

 

పంచభూతాల్ని నమ్ముకో

స్వార్ధానికి అమ్ముకోకు

కూర్చున్న కొమ్మని నరికే

అవివేకివి కాకు!

 

* * *

నరకం

 

నమ్మిన వాళ్ళకి

నరకం చూపిస్తే

నువ్వున్నది స్వర్గమైనా

నీ మనసుకి నరకమే!

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech