ఉగ్రవాదం

-- కృష్ణ అక్కులు


ఏవార్తపత్రిక
ఏదూరదర్శన్
ఏది చదివిన
ఏది చూసిన
ఏముంది విశేషం

కీచపు కృత్యాలు
రాక్షస నృత్యాలు
నీచపు చిత్తులు
పిశాచపు వృత్తులు

అందలాన
అందమైన
భవనాలు
అంబరాన
విమానాలు

కలిసి చరిత్రకు
మిగిలె శిథిలాలు
ఏ పవిత్రతకి
ఇవి చిహ్నాలు

అల్ ఖైదాలు
వన అన్నలు
తాలిబనులు
సింహాలపులులు

చేసేవికావా
కంస హింసలు
హిరణ్య అరణ్య
ప్రక్రియలు
మరి వీరంతా
వలచినదేమి
గెలచినదేమి

రక్తపాతం
మను జాతి
ప్రగతికి
విఘాతం

ప్రేమను మించిన
విల్లంబు
శాంతిని మించిన
అణు బాంబు

లేదని గ్రహించి
ప్రతివ్యక్తి
నూతన శక్తే
వదిలించాలి

ఏ ఉన్మాదపు
ఉగ్రవాదపు చీడ
జగతికి పట్టిన
ఈ పీడ

||లోకాః సమస్తాః సుఖినో భవంతు||
||ఓం శాంతి శ్శాంతి శ్శాంతి: ||