స్వరసంగమం

-- శాయి మానాప్రగడ, శ్రీనివాస్ మానాప్రగడ

జానపద బ్రహ్మ శ్రీ మానాప్రగడ నరసింహ మూర్తి గారి పరిశొధనలో లభించిన జానపద గీతం ఈ నెల ప్రత్యేకం! సిలికానాంధ్ర అక్టోబరు నెలలో నిర్వహించిన ఆంధ్ర సాంస్కృతిక ఉత్సవంలో భాగంగా "ధినాక్.. ధిం.. ధిం..", జానపద నృత్య రూపకంలో శాయి మానాప్రగడ గారిచే స్వరపఱచబడి, శ్రీనివాస్ మానాప్రగడ గారిచే ఆలాపించబడిన పాట మీ కోసం!

ధినాక్ ధిం... ధిం... : హరిదాసు పాట

దశరధ వర కుమారుడందురు, ధరణిజ వర శ్రీనాధుడ వినరా |2|

వసుమతి లోపల పాలన చేసెడి, వసుధీశుండను రామచంద్రుడను
ఏలిక ఈ ఏడు జగంబుల, పాలించెడి పరమాత్ముడరా |దశరధ|

మొండివారలు నాకెదిరించుట, గాంఢీవముతో చెండాడెదరా
రామా రామా అనేటివారను, తప్పక నే రక్షించెదరా |దశరధ|

ధరణి కల్పగిరి పురవరంబునా, శ్రీహరునీ తలచెద మనంబునా
ధరణి కల్పగిరి పురవరంబునా, శ్రీహరునీ తలచెద మనంబునా |దశరధ|

ఆహా రామా, అయొధ్య రామా
పావన రామా, పట్టాభి రామా |2|

రామా రామా, రవికుల సోమా
తారక నామా, దశరధ రామా |2|

జై జై రామ, జానకి రామా
పావన రామా, పట్టభి రామా |4|

ఈ పాటను వినడానికి
ఈ క్రింద మీట నొక్కండి

శాయి మనాప్రగడ గారు, తన తండ్రి స్వర్గీయ నరసింహ మూర్తి గారి నుంచీ వారసత్వంగా సంగీత స్వర సంపదను పొందారు. రేడియో లోనూ దూరదర్శన్ లోనూ అనేక సార్లు పాడారు. రాష్ట్రపతీ భవన్ లో జాతీయ సమైక్యతా అవార్డును పొందారు. కె.వి. మహదేవన్, ఇళయరాజాలకు రంగస్థలం పై కీ బోర్డ్ సహకారం అందించారు. కొన్ని సినిమాలకి కూడా సంగీత సహకారం అందించారు. అనేక వాణిజ్య ప్రకటనలకు కూడా సంగీత సహకారం అందించారు.