పదవిన్యాసం

నిర్వహణ: కూచిభొట్ల శాంతి

ఆధారాలు :

నిలువు:

1. సంగీతంలో 14 అక్షరాల సమయంగల తాళం....4

2. గర్భగుడి పైన గోపురం ....3

3. రోజు....2

4. "ఏమీ తెలియెని" అమాయక పక్షి తెలివి....10

5. పైకి "పద"....2

6. కోపం పరాకాష్టకి వెళ్తే "ఇలా" అంటారు....10

7. లలనాకూర కాస్త వడ్డించు దూ....2

8. నీటి మబ్బు....5

11. తీగకి ఆసరాగాపందిరి ఉంటే బాగుంటుంది....3

13. "త్రికములు" పైకెళ్తున్నాయి....3

16. మండు....3

17. 'ఇలా' నిప్పులా లేక గుంభనంగా ఉంటారు కొందరు....6

20. దాత లేక యజమాని....3

21. వెన్నపూస కుండని "ఉట్టిలో ఉంచే" వాళ్ళు....3

22. చెక్క మీద చెక్కిన తీగ.....2

23. ఎరుక పడకుండ....5

25. పెద్ద పట్టణం....3

26. కొంచెం అలుసిస్తేఇక్కడాకి చేరతారు....4

27. లోభి....4

30. తగ్గిన 'సంతోషం'....2

అడ్డం:

1. బ్రహ్మచారి....6

2. ఒక రకం "పండు" లేక మొగలి పనస....3

9. ఒక రకం గారడి విద్య....3

10. "రోజువారి వేతనా"నికి చాలామంది పనిచేస్తారు....6

12. ప్రదేశం లేక 'తన్నకారా'లతో పాడే పాట....2

13. ఎందుచేతనో....2

14. పున్నమి....2

15. చలిగాలి....5

18. గుడ్లగూబ....3

19. ఒకరకం పువ్వు....3

21. కాబట్టి, లేక అందువల్ల....3

23. చెప్పటాన్ని....5

24. వేగంగా పరుగెత్తే మచ్చల గండుపిల్లి....5

26. బాధ....3

28. చాదస్తం లేక వెర్రితనం....2

29. వెల్లువ లేక ప్రవాహం....3

31. విష్ణువు లేక మాధవ....3

32. అడవి...3

33. పొగరుబోతుకి తగ్గతాడు....4

ముఖ్య గమనిక: మీరు యే కారణం చేతనైనా అన్ని గడులూ పూరించలేకపోతే, మీరు పూర్తిచేయగలిగినన్ని పూరించి పంపించండి. అన్నీ కాకపోయినా, వీలైనన్ని ఎక్కువ సమాధానాలు వ్రాసిన వారు కూడా బహుమానానికి అర్హులే. మీరు ప్రయత్నించడం, తద్వారా ఆయా పదాల గూర్చి మీ ఇళ్ళల్లో అర్ధవంతమైన చర్చలు జరుగుతూ సాహితీ వికాసానికి తోడ్పడటమే ఈ శీర్షిక ముఖ్య ఉద్దేశ్యం.

ఇక మీరు చేయవలసినదల్లా...

అధారాలను అనుసరించి పదాలతో విన్యాసాలు చేసి గడులను పూరించి, ఈ-మెయిలు (ఆర్.టీ.ఎస్. పధ్ధతిలో) ద్వారా కానీ లేదా కాగితంపై ముద్రించి, పూరించి కింద ఇచ్చిన చిరునామాకు పంపించండి. సరైన సమాధానాలు వ్రాసిన మొదటి ముగ్గురికి మంచి పుస్తకాల బహుమతి. సరైన సమాధానాలు పంపిన వారు ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే ముగ్గురి పేర్లను 'డ్రా'తీసి, వారికి బహుమతి పంపిస్తాము.

మీ సమాధానాలు మాకు చేరటానికి గడువు:
డిసెంబరు 25, 2007

ఈ-మెయిలు: santhi@siliconandhra.org

చిరునామా:
Santhi Kuchibhotla
20990, Valley green drive, apt: 615
Cupertino, CA - 95014

గత పదవిన్యాసం సమాధానాలు:నవంబరు నెల పదవిన్యాసాన్ని పూర్తిగా సరిగా పూరించిన వారు, శ్రీ పావులూరి రాజు. కొద్ది తేడాతో పూరించినవారు, పోలంరెడ్డి శ్రీలక్ష్మి గారు. ఇరువురికీ అభినందనలతో పాటుగా మంచి పుస్తకాన్ని బహుమతిగా పంపిస్తాము.