మా పెళ్ళి పల్లకి

-- కాజ రామకృష్ణ మాధురి

ఆవిడ

ముందుగా మా కుటుంబం గురించి చెప్పాలంటే మాది చిన్న కుటుంబం, ఇంట్లో అమ్మ, నాన్న, అక్క, నేను తరువాత తమ్ముడు. ఆమ్మ, నాన్న తాము చిన్నప్ఫుడు కష్టపడి చదివి, తమ పిల్లలు తమ కంటే బాగా చదువుకోవాలి అనుకునేవారు. మా పురోగతి గురించి అహర్నిశం కోరుకునే తల్లి తండ్రులు. నాన్న గారివి విశాల భావాలు, పిల్లలు అంటే ఎంతొ ప్రేమ, ఎప్పుడు మా గురించే ఆలొచన. ఇంట్లొ ప్రేమమయ, సంతొష వాతావరణం. ప్రతి రోజూ ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవడం ద్వారా - ప్రతి రోజుని జీవితంలో ఎదగడానికి మరో మెట్టుగా మలుచుకోమని చెప్పే నాన్న, జీవితం లొ ఎదైనా సాదించాలంటె పట్టుదల తొపాటు ఓర్పు ముఖ్యమని, జీవితములొ పట్టు విడుపులు అవసరమని చెప్పే అమ్మ, నాకు అత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని నూరి పోసారు. ఇక అక్క, తమ్ముడి తొ ఆట పాటలతో కాలం ఎలా గడించిందో నాకే తెలియదు.

నేను అప్పటికి ఇంజనీరింగ్ అయిన తరువాత హైదరాబాదు లొనే సాఫ్టువేరు రంగంలో పనిచేస్తున్నాను. మా ఫ్రెండ్ అమీర్ పేట లొని ఒక మంచి కంపని లొ సాఫ్టువేరు ప్రొగ్రామర్స్ జాబ్స్ ఉన్నాయి అని చెబితే ఇద్దరం అప్లయి చేసాము. సరె టెక్నికల్ ఇంటర్వ్యూ అయ్యి, ఇద్దరం సెలెక్తు అయ్యామని తెలిసింది. మా మానేజరు

మొదటి రోజు కంపనీ అంతా తిప్పి చూపించారు, అందరినీ పరిచయం చేసారు. కొత్త ఉద్యొగం, కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. అమ్మాయిలు బొత్తిగా కనపడలేదు. ఎక్కువుగా అబ్బాయిలే వున్నారు. నాకు అక్కడ రామకృష్ణ పరిచయం అయ్యాడు. తను, నేను ఒకే ప్రాజెక్ట్ లొ పని.

మేము ఇద్దరం కలిసి ఎన్నొ సాఫ్టువేరు ప్రొబ్లెంస్ గురించి డిస్కస్స్ చెసుకొని, ఎలా సాల్వు చెయ్యాలొ అని అనుకొని, సాఫ్టువేరు డెవెలపు చెయ్యడం, మానెజరు ముందర ప్రెజంటేషన్స్ ఇవ్వడానికి ఇద్దరం కలిసి కృషి చెయ్యడం జరిగింది. ఆఫీసులొ మిత్రులతొ చాయ్ బ్రేక్స్, ఇంటి నుంది తెచ్చిన బాక్సులు కలసి తినడం, ఒకరితొ ఒకరం పంచుకొవడం, నేను మరచిపొలేని రోజులు.

మా కంపని లొ ఒక సారి టీము బిల్డింగ్ యాక్టివిటి గా అందరికి 'మీరు క్రియేటివ్‌గా చేసిన ఒక ప్రాజెక్టు గురించి చెప్పండి ' అంటే రామకృష్ణ తాను ఏంబిఎ లొ బిజినెస్ ని, చెస్ ని కంపేరు చేస్తు రాసిన ఆర్టికల్, తను చెప్పిన ప్రెసెంటేషను నన్ను అకట్టు కుంది.

ఆగష్తు 1998 లొ మా అక్క పెళ్ళి కుదిరింది, మా ఆఫీసులొ మిత్రులు అందరిని పెళ్ళికి పిలిచాను, పెళ్ళి కుర్నూల్ లొ. పెళ్ళిలొ రామక్రిష్ణ ని, తన స్నెహితుడిని చుసి ఒక నిమిషం ఆశ్చర్యపొయాను. మా అమ్మ, నాన్నలని పరిచయం చేసాను. ఆరొజు సాయంత్రం పెళ్ళి అయ్యక తను హైదరాబాదు వెళ్ళి పొయాడు.

కొద్ది రొజులు గడిచాయి, ఒక రోజు రామకృష్ణ నా దగ్గరికొచ్చి మీతొ మాట్లాడాలి అన్నాడు, గొంతు తగ్గించి. ఎందుకు గొంతు తగ్గించి మాట్లాడుతున్నాడొ అర్ధం కాలేదు, అది మా ఇద్దరి జీవితాలని మలచివేసిన రొజు. అసలు విషయం ఏంటంటె, నన్ను చాల రొజులు గా గమనిస్తున్నాడని, నాకు కూడా ఇష్టం ఉంటె నన్ను వివాహం చేసుకోవాలని వున్నట్టు చెప్పాడు. నాకు భలే కొపం వచ్చింది, తను సీరియస్ గానే అడుగుతున్నాడనిపించింది. నేను ఆలొచించుకొవడానికి కొద్దిగా సమయం కావాలి అన్నాను.

నేను ఎన్నొ సార్లు పెళ్ళి/వివాహం అన్న పదాలు విన్నాను, కానీ వాటి గురించి నిజ్జంగా ఆలోచించలేదు, నా పెళ్ళి సంగతి కాబట్టి మొదటి సారిగా, పెళ్ళి అంటే ఏమిటి, వివాహ వ్యవస్థ గురించి, ఎందుకు చేసుకుంటారు, ఎవరిని చేసుకొవాలి అని డీప్ థింకింగ్ కొద్ది రొజులు చేశాక, అదో మహా ప్రపంచం అని అర్ధమయ్యింది. నా వయసు చాలలెదు తెలుసుకొవడానికి.

నాకు అర్ధమైనది క్లుప్తంగా ఏమిటంటే - పెళ్ళికి పునాది మనసులు కలవటం, ఇద్దరి మద్య అవగాహన వుండడం, ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవడమని అనిపించింది. రామక్రిష్ణ నాకు మంచి స్నెహితుడు. మాటలొ సౌమ్యత, మంచి మనుసు, భోళా తనం తెలుపకనె తన గురించి చెప్పయి. ప్రొబ్లెంస్ సాల్వు చెయ్యడం లొ తెలివి కనిపించాయి, విశ్లేషణ తన ప్రత్యేకత, మేము ఒకే ప్రొజెక్ట్టు లొ పని చెసెటప్పుడు మా ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉందని అర్ధం అయ్యింది. తనని వివాహం చేసుకోవాలని నిశ్చయైంచుకున్నను. నా ఈ నిర్ణయాన్ని మా కుటుంబ సబ్యులు అంగీకరిస్తారని, వారిని ఒప్పించి ఈ పెళ్ళి చేసుకోగలను అని నా నమ్మకం. ఇక విషయం ఇటు మా ఇంట్లొ, వాళ్ళ ఇంట్లొ చెప్పాలి. తల్లి తండ్రుల అంగీకారంతొటే మా వివాహం జరగాలని వారి అనుమతి తో మా వివాహం పెద్దల సమక్షంలొ జరగాలని నా కొరిక. ఇరు వెపు వారు అంగీకరించడానికి కొద్దిగా సమయం పట్టింది. 2000 ఆగుస్టు 24, తిరుపతి లొ మా వివాహం ముఖ్య కుటుంబ సబ్యుల మద్య సంప్రదాయ పద్దతిలొ జరిగింది.

అలా కాజ వారి ఇంటి కోడలిని అయ్యాను.


ఆయన

మాది పెద్దలు అంగీకరించిన ప్రేమ వివాహం.

అవి నేను హైదరాబాదు లో అప్పుడప్పుడే సాఫ్టువేరు రంగం లో అడుగు పెడుతున్న రోజులు.ఏంబిఎ చేసి మార్కెటింగ్ జాబ్ నిమిత్తం రోజంతా తిరిగి తిరిగి అలసి పొయె నాకు, హాయిగ,ఏసి రూం లొ కూర్చొని పని చెయ్యటం బాగా నచ్చింది.

నాకు కాబోయె శ్రీమతి కూడ అదే కంపని లొ ఎదురు పదుతుందని అప్పుడు నేను వూహించలేదు. ఒకే టీం లొ, పక్క పక్క సీట్లలొ పని చేయడం వల్ల మా స్నేహం ఎంతొ దగ్గరయ్యింది.ఇంతలొ మాధురి వాళ్ళ అక్క పెళ్ళి అవడం, మమ్మ లని, అంటే ఆఫీసులొ అందరిని పిలవడం,ఆ రోజు వర్కింగ్ డే కావడం వల్ల, నేను ఒక్కడినే కర్నూలు వెళ్ళడం అన్ని త్వర త్వరగ జరిగి పొయాయి. పెళ్ళిలో తను వాళ్ళ అక్క,బావ,అమ్మ, నాన్న, తమ్ముడు అందరిని పరిచయం చేసింది. అందరు చాల కలగొలుపుగా కలిసిపొయి మట్లాడడం నాకెంతగానో నచ్చింది. ఫ్రాంక్ గా మాట్లాడే స్వభావం, మంచి సాంప్రదాయ కుటుంబం, సింపుల్ మనస్తత్వం నన్ను కట్టి పడేసాయి.

ఆ విధంగా మొదలిడిన మా పరిచయం, మూడు నెలల్లోనె, తనే నా జీవిత భాగస్వామి అయితె బాగుంటుంది అని అనిపించింది. చెబితే తను ఏవిధంగా అనుకుంటుందో అని ఒక వైపు, మా ఇంట్లొ ఈ విషయం తెలిస్తె ఎమంటారొ అని ఒక వైపు, చాల రొజులు అలొ చించాను. ఎట్టకేలకు ఒక రోజు ధైర్యం చేసి నా మనసులొని మాట తనతొ చెప్పేసాను. తన సమాధానం కోసం ఎదురు చూస్తు ఉంటానని చెప్పి గిరుక్కున వెనక్కి తిరిగి వచ్చేసాను.గొప్ప రెలీఫ్ గా ఫీల్ అయ్యా ఆ క్షణం.

తరువాత మొదలయ్యింది అసలు విషయం !!!!

పక్క పక్కనె కూర్చున్న గాని,ఎవరి పని వారు చేయటమె గాని మాటలు లేవండోయ్!!!

ఈ ప్రహసనం వారం రొజులు నడిచింది. ఏడు రొజులు ఏడు యుగాలు లాగ అయ్యాయంటె నమ్మండి.

ఇంక టెన్షన్ తట్టుకోలెక, నేనే మళ్ళా ఒక రొజు తనను విషయం అడిగాను...భయం..భయంగా..

ఎముంది.. తనకూ ఇష్టమేనని చెప్పింది. ఇంకేముంది,తను కూడ నాలానె అనుకుంటోందని తెలిసిన అ క్షణం,నా అనందానికి అవధులు లేవు !!!

అప్పటికే నాకు పెళ్ళి సంబంధాలు చుస్తున్న మా నాన్నగారి కి ఈ విషయం చెప్పాను. అప్పటికే కొంత వూహించిన మా నాన్నగారు, నేను నా పెళ్ళి గురించి చెప్పి ఆయనను ఒప్పించడం పెద్ద కష్టం కాలేదు.కాని మాధురి ఇంట్లొ వాళ్ళ పూర్తి అంగీకారం కూడ రావడానికి రెండు సంవత్సరాలు పట్టింది.తరువాత మా పెళ్ళి తిరుపతి లో సింపుల్ గా కొద్ది మంది బంధు మిత్రుల మధ్య జరిగింది .

అదండీ,పెద్దలు చేసిని మా ప్రేమ వివాహం. ఇప్పటికీ, ఆ విషయం తలుచుకుంటే, ఎలా జరిగిందోనని అనిపిస్తుంది.

కాజ రామకృష్ణ, మాధురి

కాజ రామకృష్ణ, మాధురి గార్లు సిలికానాంధ్ర క్రియాశీల సభ్యులు. వారిరువురూ బహుముఖ ప్రజ్ఞ కలిగిన అసాధారణ వ్యక్తులు. చక్కగా నవ్వుతూ అందరితో కలిసిపోతూ, ఒదిగి ఉంటూ తమ ప్రతిభను చూపుతుంటారు. మాధురి గారు "మనబడి"లో అధ్యాపకులుగా పనిచేస్తూ, సాఫ్ట్‌వేర్ రంగంలో పని చేస్తూ, రచనా వ్యాసంగంతోనూ ఊపిరిసలపని పనిలో ఉన్నా అలసట ల్లేక అన్నీ నిర్వహించడం ఆవిడ ప్రత్యేకత. రామకృష్ణ గారు నటులు, మృదు స్వభావి. వారి ముద్దులపట్టితో కలిసి సిలికానాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొంటూన్నారు.