కవితా స్రవంతి - నటేశ్వరం
ఎవరు మనకు ఆదర్శం?
- డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ.

ఎవరు మనకు ఆదర్శం?

ఎవరు మనకు ఆదర్శం?

త్యాగంతో విలసిల్లిన

వారే మనకాదర్శం!

కామంతోకాగిపోయి

మోహంతో ఊగిపోయి

వ్యసనంతో కుంగిపోవు

వారా మనకాదర్శం?

జాతిని జాగృతం చేసి

నీతిని ఊపిరిగ చేసి

పరులమేలు కోరినట్టి

వారే మనకాదర్శం!

నిజాయితీ ప్రాణంగా

ఋజుమార్గం గమ్యంగా

జీవితాన్ని గడిపినట్టి

పూజ్యులు మనకాదర్శం!

దోచుకున్న సంపదతో

దాచుకొన్న సౌఖ్యంతో

విలాసాలు అనుభవించు

వారా మనకాదర్శం?

మాతృభూమి దీప్తి కొరకు

మాతృఋణం తీర్చుకొరకు

ప్రాణాలను అర్పించిన

మాన్యులు మనకాదర్శం!

మహనీయులె ఆదర్శం!

మనీషులే ఆదర్శం!!


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)