తెలివి పరీక్ష

 

ఒకసారి నిక్షేపరాయుడికి, తన పరివారంలో అందరికన్నా తెలివైనవాడెవరో తెలుసుకోవాలన్ని బుద్ధిపుట్టింది. ఆయన వారిని పిలిపించి ’మీరు నాతో పాటు అగ్ని గుండంలో దూకమంటే దూకుతారా? సముద్రంలో దూకమంటే దూకుతారా? అని అడిగాడు.

ఇది విని అందరూ తెల్లబోయి చూశారు. ఎవరూ నోరు మెదపలేదు. అంతలో రాజయ్య అనేవాడు నిక్షేపరాయుడితో ప్రభూ మీతో మీరన్నట్ట్లు చేయడానికి నాకు పదిహేను రోజుల వ్యవధి కావాలి అన్నాడు.

ఈ జవాబుకు రాజు ఆశ్చర్యపోయాడు.

నిజం చెప్పు. నీకు ప్రాణాల మీద ఆశలేదా? నాతో పాటు నువు కూడా దూకడానికి పదిహేను రోజుల వ్యవధి ఎందుకు అడుగుతున్నావ్? అని ప్రశ్నించాడు.

క్షమించండి ప్రభూ! భార్యాబిడ్డలు ఉన్నవాడిని. ప్రాణమంటె గంపెడాశ ఉంది. అందుకే అలా అన్నాను. మీరు ఎలాగూ అగ్ని గుండంలో దూకి ప్రాణాలు పోగొట్టుకోరు. అందువలన ఆ భయం నాకు లేదు. మీకు ఈత వచ్చుగనక, సముద్రంలో దూకే అవకాశం ఉంది. మరి నాకు ఈత రాదు. అది నేర్చుకునేందుకు పదిహేను రోజుల వ్యవధి అడిగాను అన్నాడు రాజయ్య.

రాజు నిక్షేపరాయుడు పెద్ద గా నవ్వాడు.. రాజయ్యను గొప్ప తెలివిగలవాడివని మెచ్చుకున్నాడు. అతనికి అనేక బహుమతులు ఇచ్చాడు.

 
  చొక్కాపు వెంకటరమణ :

స్టేజి మీద మేజిక్ చాప్లిన్ గా మేజిక్ కార్యక్రమాలుచేస్తూ, పిల్లల కోసం అనేక కధలు వ్రాసిన బాలల రచయిత, ప్రతిభకల చిన్నారులతో ఎన్నో రికార్డు ప్రోగ్రాములు చేయించిన మేజిక్ ఫన్ స్కూల్ నిర్వాహకుడు, బాలభవన్ లో ఉద్యోగిగా ఎన్నో రచనలు అందించిన సంపాదకులు, పిల్లల మనోవికాసం కోసం ఊయల పత్రిక నిర్వహించిన పత్రికాధిపతి......ఊయల కమ్యునికేషన్స్ అధినేత..ఆల్ రౌండర్ అనే పదానికి అచ్చమైన నిర్వచనం చొక్కాపు వెంకట రమణ ఆంధ్ర్ర ప్రదేశ్ బాలల అకాడెమీవారికి అనేక పిల్లల పుస్తకాలు వ్రాసారు. వాటిని జవహర్ బలభవన్ ఇటీవల పున:ప్రచురుంచింది. చొక్కాపు వెంకట రమణ ఆధునిక పరవస్తు చిన్నయ సూరి గా అందిస్తున్న నీతికధల సమాహారం 'నిక్షేపరాయుడి కధలు ' ధారావాహికంగా బాలరంజని లో నెల నెలా వెన్నెల..

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech