పల్లవి)   ఆనందం ఆందించూ ఆశపడక తిరిగి

పంచినదంతా పంటయి వచ్చు - ఇంకా ఎంతో పెరిగి -- ఇంకా ఎంతో పెరిగి

 చరణం 1)

ప్రతిరోజూ పూవుగ పూచే, జాజులు కాచే అందం - తాజగ తోచే అందం

ఉదయానే జాజుల కోరే మోజుల కూచే అందం జాజుల తూచే అందం

జంట గిద్దరిని జడలోచూస్తే, రెట్టింపందాలు - అందమె ఆనందం!

జంట గిద్దరిని జడలోచూస్తే, రెట్టింపందాలు - అందమె ఆనందం!

దాని కారణం అందాలిద్దరు పంచుకు సాగడమే..... 

చరణం 2)

చిగురింత తిన్నానంటూ, కోయల పాటే అందం - సత్యపు మాటే అందం

ఇటురావే చిగురు   తినూఅని   చూపెడిచెట్టే   అందం - చూపిన గుట్టే అందం

ఎల్లవేళలా, లాభమునష్టం మాటలె అజ్ఞానం - జ్ఞానమె ఆనందం

ఎల్లవేళలా, లాభమునష్టం మాటలె అజ్ఞానం - జ్ఞానమె ఆనందం 

చరణం 3)

కనిపించే తారల కోసం, చంద్రుడు వేసే వేషం  - చల్లని వెన్నెల హాసం

పగలైతే పోవును కానీ, రాతిరి మాత్రం అందం  - ఊహల చిత్రం అందం

సూర్యరశ్మితో ఊహని తేలే, శూన్యపు ఆనందం - శూన్యమె ఆనందం

సూర్యరశ్మితో ఊహని తేలే, శూన్యపు ఆనందం - శూన్యమె ఆనందం