మిత్రులారా, ధనవంతులారా,
బిల్డర్స్ మరియు భూకబ్జాదారులారా
త్వరపడండి, త్వరపడండి.
తరుణం మించిపోతే
అవకాశం జారిపోతుంది
వస్త్రాల కొనుగోలుపై
ప్లాస్టిక్ పోపుడబ్బాలపై
సంవత్సరం పొడుగునా
ఒకటి కొంటే రెండు ఫ్రీ
సమాజంలో ఎన్నెన్నో మార్పులు చేర్పులు
ఇక్కడ ఎప్పుడూ కొత్తదనమే చిగురిస్తుంది.
అంగడిలో కందిపప్పుధర
ఆకాశానికి అంటిన
పేదవాది కడుపుకు కాస్తా
గంజి కోసం కళవరపడిన
అనాథపిల్లల చూపులు
అమ్మకోసం ఆశగచూసిన
అమ్మల భాదతో కృంగి
ఆత్మహత్యల పర్వంలో కొనసాగిన
రైతు చేనేత కార్మికులు
ఆడవాళ్ళపై అధికమైన యాసిడ్ దాడులు
అవన్నీ ఒక్కరోజు వార్తతో పాతపడిపోతాయి.
బారుల తవ్వకాలవల్ల నేలతల్లి ముసలిదైపోయి
నిట్టూర్పు సెగలతో కాలాన్ని దొర్లిస్తుంది.
ప్రపంచీకరణతో మనిషికి
ఆకలికన్నా ఆనందమే గమ్యం.
మల్లన్న మగధీర లాంటి కొత్తచిత్రాలకు
అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నట్లే
చల్లని అందమైన్ జాబిలిపై
ఆడుకోవడానికి ఇదొక
బంగారు తరుణం.
నీటి కోసం కలవరం లేదన్న శాస్త్రవేత్తల వార్త
భూలోకవాసులకు శుభవార్త.
ఇప్పుడే ఈక్షణమే త్వరపడండి. చందమామపై కొత్త ఇంటికోసం
అందమైన ప్రకటన వెలువడకముందే
అడ్వాన్స్ బుకింగ్ చేద్దాం.
అంతరిక్షంలో చందమామను కలుసుకుందాం.


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం