అనాదినుండి రేపెప్పుడో భవిష్యత్తులో
ఎదురు చూసే అంతం వరకూ
అమే కదా అన్నింటికీ ఆదీ అంతమూ కూడా....
ఎండి బీడై బీటలు వారిన సమయాన్ని
నిలువెల్లా పాలవెల్లువ జీవధారలో తడిపేస్తూ
హౄదయం తీగల్ను సవరించి
దిగంతాలచుట్టూ ఊపిరి పాటల
పారిజాతాల్ను ఆరబోసినది ఆమే కదా!
నిరంతర సహౄద్భావ సమీకరణాల్లో
సామరస్య సరిగమల్ను
గమకాలుగా పలికిస్తూ రంగుల సింగిణీలనోవైపు
సతత హరిత భావలనూ-
నైర్మల్యపు వెలుగు అలలను మరోవైపు
సమతూకం వేసేదీ ఆమేకద _విష్వ జనని.
బూడిదైన ఆశలను ప్రోది చేసి
సంజీవనిగా సజీవతనందిస్తూ
చుట్టూ లోకానికి-ఫీనిక్స్ లా మారుస్తూ
మళ్ళీ మళ్ళి పునర్జన్మ నిచ్చే
మాంత్రికురాలు ఆమేకదా -ఆదిశక్తి
మబ్బుమసకల్లో తూనీగల హోరులా
మమతల సందడి నీరసించి
వేళ్ళడబడిపోయిన మానవతకు
చూపుల కాంతి రెక్కలమీద
పుష్పక విమానం మీద
మాటల
అమౄతాన్ని మోసుకువచ్చేదీ ఆమేకద!
వెలుగు రధ చక్రాలమీద అలవోకగా వాలి
వేలికోసల స్పర్శకే పులకించి చిగురించే
క్రొన్ననల రాగరంజిత సింధువై
ఆకాశానికీ భూమికీమధ్య
అణువణువునూ స్వంతంచేసుకున్న
గాలిఆమె నీరు ఆమె
వాన ఆమే వరదా ఆమే
ఆర్తిగా బ్రతుకును చుట్టేసే వెలుగే ఆమె.
మనసు అరలనిండా పదిలంగా విరబూసే
పున్నాగల గుసగుసల పరిమళాం ఆమె.
చుక్కలు చుక్కలుగా
దివినుండిభువికి
ప్రవహించే పృరేమ సరిత్తు ఆమె.
ఓ చిరునవ్వు చల్లగాలి తోణకని ఓ అమౄతబిందువు.
అందుకే అమె జగన్మాత.
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం