12 నెలల అంతస్ధుల భవనానికి పునాది
6 ఋతువులే ద్వారాలుగా అమరిన లోగిలి
మూడు కాలాలు ముగ్గులుగా మురిపించే ముంగిలి
రోజులనే రోజాపూల తోటలోకి కనిపించే
"విరోధి" నామ సంవత్సర బాట
వినిపించాలి సప్తస్వరాల స్వస్తినాదాల కోయిల పాట
అందించాలి శుభాశ్శీసుల మూట
అలరించాలి "భళి" అని అందరినోట
జగతియే పాఠశాల , జీవితం ఓ పరీక్ష
నెలలు వారాలు , పాఠ్యగ్రంధాలు
పగలు రేయిలు, కష్టసుఖాలు
ఈ అనుభవాల బాటలో
అరవై ఏళ్ళకు తిరిగి వచ్చిన ఓ అతిధి!
కాలమనే పళ్ళెంలో ఆశల హరతి
ఆశలు కరిగినా ఆశయాల సువాసనలు తరుగునా?
భావాలు పంచుకుని, అనుభవాలు పెంచుకుని
వచ్చింది కవిసమ్మెలన ప్రియ వినోదిని
కమనీయ రమ్యాతి రమ్య ప్రియ ఉగాది
కావాలి నవ్య వసంతాల ప్రగతి.
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం