కవితా స్రవంతి

ఊండెడ్ హార్ట్

- అయినంపూడి శ్రీలక్ష్మి

ఇన్ ది వార్డ్

క్యాన్సర్ ఆసుపత్రి
కారిడార్లలో ప్రయాణం
సందేహం కుంచెను
భయం కలర్స్ లో ముంచి
భవిష్యత్ క్యాన్వాస్ పై చిలికించిన
అబ్సర్డ్ చూపులే అంతటా..
ముందే కూసిన క్యాన్సర్ కోయిల పిలుపులకి
తొందరగా వచ్చిన మృత్యు వసంత చిగుళ్ళే అంతటా..
ముందస్తు మరణాలు, అకాల వృద్ధాప్యాలే
అక్కడి గోడలపై వేలాడుతున్న
అదృశ్య పేయింటింగ్స్

అక్కడ -
వర్షించే ప్రతికన్ను
పొడి చేతి ఆనకట్ట కోసం
ఎదురుచూస్తుంది
అక్కడ -
కూలిపోయిన ప్రతి మనసు
ఆసరానిచ్చే భుజం కోసం
ఆరాట పడుతుంది
ఛిద్రమైన పతి చెక్కిలీ
ఊరటనిచ్చే స్పర్శకోసం
తహతహలాడుతుంది.
చిన్నాభిన్నమైన ప్రతి పెదవీ
చిరునవ్వు దీపం కోసం
వెతుకులాడుతుంది.
అశ్శబ్దమైన ప్రతి చెవీ
‘you are ok' మాట కోసం
ఒళ్ళంతా చెవులను చేసుకుంటుంది.

అక్కడ
గడ్డ కట్టిన ప్రతి హృదయం
నీకేం కాదన్న భరోసా వాక్యం కోసం నిరీక్షిస్తుంది

ఎటు చూసినా
కొంగుచాటు చంద్రుళ్ళు చేసే
అలజడులు
డాల్బీ సిస్టంలో
నిశ్శబ్దంగా శబ్దిస్తుంటాయి..

ఫ్లాష్ బ్యాక్

చిన్నప్పుడు
‘చందమామ రావే’ అనే అమ్మపాటతో
ఆమ్ తింటూ
చంద్రుణ్ణి ఆశ్చర్యంగా చూసేదాన్ని
ఎప్పటికైనా ఆ చంద్రుణ్ణి
నా గుండెలకి హత్తుకోవాలని కలలుకనేదాన్ని
సంకల్పం బలంగా ఉంటే
సాధన సుళువవుతుందట
నా సంకల్పం ధృడమైందనుకుంటా
పన్నెండవ యేటనే మొలిచాయి
నా గుండెలపై నిండు చంద్రుళ్ళు

ఆ రెండు చంద్రుళ్ళు నా 8 వ తరగతిలో తొలిసారిగా
నేను స్త్రీనన్న
అస్తిత్వాన్ని గుర్తుచేసిన
ఆత్మ గౌరవ ప్రతీకలు
అప్పటివరకూ ఉన్న నా నడకతీరుని
మార్చిన గురువులు
నిటారుగా నిలిచి, నడచి, పరుగెత్తే దేహం
లోపలికి కుంచించుకుపోయేలా చేసిన బరువులు

పదోతరగతికొచ్చాక
నా పుస్తకాలకు మరో ప్రయోజనాన్ని కూడా
ఆపాదించిన పూర్ణ కలశాలు
నాలోని పున్నమి వెలుగులను ఎవరికంటాపడకుండా
దాచేసేందుకు కూడా పుస్తకాలు ఉపయోగపడ్తాయని
కొత్త అర్ధాన్నిచ్చిన ఆకాశదూతలు

ఇంటర్లో -
క్లాస్ మేట్స్ అందరిలో
నాకు స్పెషల్ సిగ్నిఫికెన్స్ తెచ్చిన
హృదయ సౌందర్య బింబాలు
పెళ్ళి చూపుల్లో
మా ఆయన్ని
కనికట్టు చేసిన ఇంద్రజాలాలు
పెళ్ళి వేడుకలో
ముత్తయిదువుల చేత
లక్ష్మీదేవికి ‘క్లోన్’ అని పొగిడించిన నిండురూపాలు

శోభనం రాత్రి ఆయనకు అమరత్వాన్ని ప్రసాదించిన
అమృత భాండాలు
మా నుండి వచ్చిన పిల్లలకి
జీవాన్ని ధారగాపోసిన
పాలవెల్లులు

జీవితాన్ని అందించిన
మురిపాల జల్లులు
ఏ అపరాత్రో
ఉలిక్కిపడి నిద్రలేచిన నా పిల్లలకి
ధైర్యాన్నిచ్చే నిండు భరోసాలు

నీకు తెలుసో లేదో
మగాళ్ళలో ఒక్క కర్ణుడు మాత్రమే
సహజ కవచ కుండలాలతో పుట్టాడట
కానీ స్త్రీలందరూ
కర్ణులు అయింది వీటివల్లే కదా!

నాకు అర్ధమైన కాలం నుండి గమనిస్తున్నా
నా వాళ్ళనుకున్న వాళ్ళందరూ
నన్నంటి పెట్టుకుని ఉన్నకాలం
బహు లిప్తనే..
నాకు పాలు ఇచ్చేప్పుడు
లాలపోసేప్పుడు -
జడవేసేప్పుడు
అమ్మ అంటిపెట్టుకుని ఉండేది




మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)