Sujanaranjani
           
  శీర్షికలు  
       తెలుగు తేజోమూర్తులు
 
 

- రచన : ఈరంకి వెంకట కామేశ్వర్.     

 

తమ తమ రంగాలలో నిష్ణాతులై, విశిష్టతనాపదించుకుని, పేరు ప్రఖ్యాతులనార్జించి "గొప్పతనం" సాధించిన తెలుగువారెందరో ఉన్నారు. వాళ్ళు యెదుర్కున్న ప్రతిబంధకాలు, సంక్లిష్ట పరిస్థితులు, అనుభవించిన నిర్భందాలు, పడిన ఆవేదన, చేపట్టిన దీక్ష, చేసిన కృషి, సాధన, కనపరచిన పరాకాష్ట, సాధించిన విజయాలు, ఆ విజయ రహస్యాలు, ఇలాంటి విషయాలని పరిశీలించి, సమీకరించి, పొందుపరచి ఈ కధనాలలో మీ ముందు ప్రస్తుతీకరిస్తున్నాం


మహాసహస్రావధాని డాక్టర్ గరికిపాటి నరసింహారావు

అష్టావధాన, శతావధాన, ద్విశతావధాన, సహస్రావధానం నిర్వహించి ఏక ధాటిగా ఏడు వందల యాబై పద్యాలు ధారణ చేసిన ధారణా బ్రహ్మ రాక్షసుడు తెలుగు కవి, పండితుడు, కవి కంటీరవ, అవధాన భారతి డాక్టర్ గరికిపాటి వెంకట బసవ నరసింహారావు గారు.

నూట యాబైకి పైగా అవధానాలు, 3 శతావధానాలు, ద్వి శతావధానం, మహాసహస్రావధానం చేశారు. దీన్ని బట్టి తెలుగు భాషపై వీరి పట్టు ఎంత గొప్పదో చెప్పకనే తెలుస్తోంది. కావ్యం సైన్స్ ఐతే, అవధానం కావ్యాన్ని ప్రజలకు అందించే టెక్నాలజీ అని ఓ సందర్భంలో సెలవిచ్చారు గరికిపాటి నరసింహారావు గారు. అవధాన ధారణ! భావితరాలకు ప్రేరణ!. గరికిపాటి వారు ఇలా తెలుగు భాషా వైభవాన్ని పెంపొందిస్తూ వస్తున్నారు.

ఊహకి వాస్తవం జోడించి సమర్ధిస్తే లేదా వాస్తవానికి ఊహ జోడిస్తే కవిత్వం అవుతుంది; ఈ రెండిటిని తగు పాళ్ళలో రంగరిస్తారు నరసింహారావు గారు. అందుకనే వారి కవిత్వం ప్రత్యేకత సంతరించుకుంది. వీటితో పాటు అఖండమైన మేదస్సు, జ్ఞాపక శక్తి, భాష, వ్యాకరణం మీద పట్టు, పరిసుద్ధమైన వాక్కు, చమత్కార బాణి కలిగి ఉన్నవారు. వినయం, నమ్రతలు ఉన్నా ముక్కకి ముక్క విరగదీయడం వీరి ప్రత్యేకత. భాష మీద పట్టు, సమయ స్పూర్తి, ప్రగాడ ఆత్మ విశ్వాసం ఉంటే కాని ఇవి సాధించలేరు. కవికి సమాజ శ్రేయస్సు కోరే దృష్టి కోణం ఉండటం చాలా అవసరం. జాతీయత కూడా కలిగి ఉండాలి. ఈ సుగుణాలు సంతరించుకున్న వారు గరికిపాటి నరసింహారావు గారు. వీరు అక్షుణ్ణమైన జాతీయ భావాలు కలిగిఉన్నవారు. వీరికి జాతి ప్రయోజనాలు ముఖ్యం. జనాలు కూడా ఈ బాటలో నడవాలని వారి ఉపవాచ.

సాగర తీరంలో సహస్రావధానం చేసి ఏడువందల యాబై పద్యాలు ఎనిమిది గంటల్లో ధారణ చేసిన అసలు సిసలు, పస గల అవధాని అని అభివర్ణించారు ప్రముఖ సినీ గీతరచయిత శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు.

అవధాన ధారయ!:

ఇరవై ఏళ్ళ క్రితం గరికిపాటి నరసిం హారావు గారి అవధాన ప్రస్థానం మొదలైయ్యింది. 1992 విజయ దశమి నాడు శుభారంభమైన గరికిపాటి వారి అవధాన ధారణ నిరంతరము కొనసాగుతోంది. ఇంతింతై, వటుడింతై అన్న నానుడి యదార్ధం చేస్తూ అవధానిగా, శతావధానిగా, ద్వి శతావధానిగా, మహాసహస్రావధానిగా ఎదిగారు. ధారణా బ్రహ్మ రాక్షసుడు గా నిలచి స్వర్ణ కంకణం వేయించుకున్నారు.

డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారు అసాధారణ ధారణా శక్తి కలిగి ఉన్నవారు. మాటలలో తంత్రికుడు. సమయ స్పూర్తి గలవారు. అష్టావధాన ప్రక్రియలో అప్రస్తుత ప్రసంగం వచ్చినప్పుడు, పృచ్చకుడికి ధీటుగా నిలచి, చమత్కారంతో సమాధానం చెప్పి జనాలని అబ్బురపరుస్తారు.

మే 1996 లో, తూర్పు గోదావరి జిల్లా, కాకినాడలో 1,116 పృచ్చకులతో చేసిన అవధానంలో 750 పద్యాలు ఏకధాటిగా ధారణ చేసిన ధారణా బ్రహ్మ రాక్షసుడు. అఖండమైన మేదస్సు, జ్ఞాపక శక్తి, భాష వ్యాకరణం మీద పట్టు, పరిశుద్ధమైన వాక్కు, నిశితమైన దృష్టి కలిగి ఉండటం వీరి ప్రత్యేకతలు; చమత్కార బాణి వీరి మరో సుగుణం.

నూట యాబైకి పైగా అవధానాలు, 3 శతావధానాలు, ద్వి శతావధానం, మహాసహస్రావధానం చేశారు. దీని బట్టి తెలుగు భాషపై ఆయనకు ఉన్న పట్టు ఎంత అపారమో స్పష్టమౌతోంది; భాషా ప్రయోజనాలు ఆయన ఎంత పెంపొందించగలరో విదితమౌతోంది.

తెలుగులో ఆప్యాయంగా మాట్లాడుకోవడమే ఒక ఆనందం. దానికి తోడు పాండిత్య ప్రకర్షలు కనపరుస్తున్న వ్యక్తితో ఇష్టా గోష్టి విషయ పూరితంగా, ఆశక్తిగా ఉంటుంది. దానికి తోడు అనర్ఘళ కవితా ధారణ పటిమ ఉందా ఇక ఏమి చెప్పాలి; పండగే పండగ. తెలుగు భషా సముద్రములో ఓల లాడుతూ ఉండవచ్చు. ఇది గరికిపాటి వారి అవధాన సభలలో స్పష్టంగా చూడవచ్చు. ప్రతీ ఒక్కరూ బాగా చెప్పారురా అనటం ఖాయం (మనలో మాట ఇది జనం చెప్పుకోవడం నే చాలా సార్లు విన్నాను; వీరి చమత్కార బాణిని ప్రత్యేకించి శ్లాఘిస్తారు).

2002 లో అమెరికా సిలికాన్ వ్యాలిలో, సిలికానాంధ్ర నిర్వహించిన సభలో విచిత్రావధానం చేశారు. కావ్యం సైన్స్ ఐతే, అవధానం కావ్యాన్ని ప్రజలకు అందించే టెక్నాలజీ అని సెలవిచ్చారు గరికిపాటి నరసిం హారావు గారు.

గరికిపాటి వారికొక ప్రత్యేకత ఉంది. ఏ సభావేదిక ఎక్కనీ, తల్లిని తలవక మానరు. మాతృ భక్తి పరాయణుడు. అమ్మ దయా సముద్ర వీరికి. గరికిపాటి వారికి జాతి ప్రయోజనాలు ముఖ్యం. జనాలు కూడా ఈ బాటలో నడవాలని వారి ఉపవాచ. తన వంతు కృషి చేస్తూ, భాషా వైభాన్ని పెంపొందిస్తూ వస్తున్నారు.


 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
   

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech