కుళాయి చెరువు,
కాకినాడ టౌన్,
ఉదయం ఆరు గంటలు
ఊరిని మేలుకొలపడానికి ఉదయభానుడి లేత
కిరణాలు,
గుళ్ళో
స్వామివారి సుప్రభాతం పోటి పడుతున్నాయి....ఏమీ
పట్టని పార్కులో పక్షుల తీపి పలకరింపులు,
ఆకుపై మంచు
బిందువు బాలన్స్
ఆటలు,
విసుగొచ్చే నడకని
‘మోకాలి
నొప్పినీ
మాటలతో
మరిపిస్తున్న వాకింగ్ స్నేహితుల నేపధ్యంలో
రిటైర్డ్ టీచర్ సుందరంగారు స్లో
‘మోషన్
లో ఎంట్రీ ఇచ్చారు’
నైకీ బనీను, నిక్కరు, రీబాక్
షూస్‌తో
కనబడిన
ప్రతీవారీకీ
చేయ్యూపే
అభ్యర్దిలా పలకరిస్తూ హాపీగా,
చలాకీగా వాకింగ్ చేస్తున్నారు.
అంతకు మునుపు విష్ చేసిన యజమానిని
సుందరంగారు మళ్ళీ
"హౌ
ఆర్ యు?"
అనగానే బద్ధకమైన కోపంతో నడుస్తున్న
బొచ్చుకుక్క ఫీలయ్యి
గొణుక్కుంది
–
"అదేదో
ఇందాకంటే ఊరుకున్నాంగా,
ఇట్టా ఊరికే ఎక్క సెక్కాలు జేస్తే మొరిగి
గలాభా జేస్తా...ఇంకా
మానకపోతే కరుస్తా"
కుక్క
బాష
అర్థం
కాని సుందరంగారు
దాని
బొచ్చు
సవిరించి...ఈ
మధ్యే
నేర్చుకున్న,
విపరీతంగా
నచ్చిన పలకరింపు
"హౌ
ఆర్
యూ?" నెమరు
వేసుకుంటూ
ముందుకెళ్ళారు.
చికాగో మహా నగరం,
యు.ఎస్.ఏ
(డే లైట్ సేవింగ్ వల్ల
ఇండియాలో లెక్క తెల్లేదు)
చికాగో డౌన్ టౌన్లోకి అడుగెట్టగానే
పద్దతిగా నుంచున్న పొగరైన,
సొగసైన స్కై–స్క్రేపర్లు
(Sky
Scrapers);
మనిషి మేధస్సు,
అహంకారం,
కాంక్షలు అన్నీ సమపాళ్ళలో కలిపి
కట్టిన కాపిటలిస్ట్
సామ్రాజ్యానికి నిచ్చెనలు...ఠీవీగా,
తీవ్రంగా ప్రపంచాన్ని పరికిస్తున్న ఆ మహా కట్టడాలని
దాటుకుంటూ ఓ ముప్పై మైళ్ళు నేపర్విల్
వైపుకి వెళ్ళామంటే,
ఓ మైలు
దూరం నుండి సాంబార్ వాసనల ఘుమ,
ఘుమలు...శీను,
బెటర్ హాఫ్ భార్గవిల
'స్వీట్
హోం'
మాడిసన్ అపార్ట్మెంట్స్
మెల్లిగా తలుపు
తియ్యగానే..బిసీగా, గాఢంగా
ఇద్దరూ కళ్ళతో ఊసులు చెప్పుకుంటూ
కనపడ్డారు -
"ఆయ్
చిలిపి!
నిన్నింకా
పెళ్లి పీటలపై చూసినట్టే ఉంది పచ్చటి
పారాణి,
కాంట్రాస్ట్ గోరింటాకు,
ఓర
చూపులు,
పూల బరువుతో కదల్లేని వాలుజడ....ఏ బరువూ
మోయలేని నువ్వు నా పక్క....అబ్బా! ఆ
మొమెంట్ తలుచుకుంటే ఇప్పటికీ పులకరింతగా
ఉంది!!! నన్ను నమ్మి ఏడడుగులు, నమ్మకం
పెరిగి ఏడు సముద్రాలు దాటిన నిన్ను ఆరు
నూరైనా, నూరు
ఎంతైనా పూలల్లో పెట్టి చూసుకుంటా...నేను
లేనప్పుడు బోర్ కొట్టి చాటింగులు, అక్కర్లేని స్టేటస్సులు
గుప్పించకు....సున్నితమైన నీ వేళ్ళు
కందిపోతాయి, వోనేజీ
ఫోను అన్లిమిటెడ్ అని అతిగా మాట్లాడకు
గొంతు తడారిపోతుంది....ఇహ మరీ తప్పకపోతే ఆరారగా
జూస్ తాగుతూ మాట్లాడు ...ఇంకో విషయం ఈ
వీకెండ్ మన పెళ్లి డీవీడీ చూద్దాం ."
"నా
రాజా, నా
స్వామీ"
"వాళ్ళిద్దరూ
ఎవరు?"
"పాచి
మొహంతో పరాచికాలు ఏమిటండి?
మీరే నా రాజా,
నా స్వామి...ఎండనక, వాననక
కంప్యూటర్ ముందు కదలకుండా కష్టపడి, కార్లో
ఇంటికొచ్చి..
సోఫాలో టీవీ చూసి రోజూ అలసిపోతారు..పురుడు
వల్ల ఈ మధ్య బాగా నలిగి పోయారు,
నేను తేరుకుని పూరీలు,
పెసరట్లు చేసే దాకా ఆహారం అశ్రద్ధ
చెయ్యకండి
..వేళకి
ఫ్రెంచ్ ఫ్రైస్,
పీజాలు..బొబ్బట్లు
ఇప్పుడే చెయ్యలేను కాబట్టి డోనట్లు తినండి,
వంటికి బలమని శైలజ చెప్పింది….మరొక్క
విషయం మన పెళ్లి డీవీడీ
వందసార్లు
చూసే
సరికి
అరిగిపోయింది"
“పర్వాలేదు
నా
దగ్గర
డూప్లికేట్
డీవీడీ కాపీ
ఉంది…మీ
పేరెంట్స్ షాపింగ్
చేసుకుని,
క్రెడిట్ బిల్ల్స్ మనకిచ్చి హాపీగా
వెళ్ళిపోయారు,
నిన్ను చూస్తే సొంతంగా ఫేస్‌బుక్‌లోకి కూడా
లాగిన్ కాలేవు....ఇక
చంటి పిల్ల, పోపుల
డబ్బా అంటే మాటలు కాదు..ఒక
బాధ్యతైన భర్తగా,
శోభన్‌బాబుగా నేను ఏమి
చెయ్యాలో తెలియట్లేదు”
"మీరు
అంత ఆలోచించకండి,
హెడ్
ఏక్
వస్తుంది…ఇద్దరి
బుర్రలు కలిపి నేను ఆల్రెడీ ఆలోచించేసాను
...$%^&#@@**&"
"అబ్బో
ఐడియా అదిరింది, ఏమో అనుకున్నాను శైలజ
నుంచి చాలా నేర్చుకున్నావు...ఈ ఆనందంలో ఒక
నెక్లెస్ కొనాలనిపిస్తోంది"
భార్య, భర్తలు
అన్నాకా మాటలతో, రాతలతో కాదు...వేసే
అడుగుతో, పీల్చే
ఊపిరితో పిచ్చి
,
పిచ్చిగా
అర్థం చేసేసుకోవాలి... చెప్పినా
అర్థం కాని వాళ్ళకి
ఆదర్శం
మన శీను, భార్గవి
జంట
కడియం, వీరాంజనేయ
నర్సరీ,
మధ్యాహ్నం 3
PM
సంపెంగలు,
మల్లెలు,
గులాబీలు,
బంతి పువ్వులు....ముద్దు
మొహాలతో అల్లరి చేస్తూ,
కేరింతలు కొట్టే బుజ్జి పిల్లలు అనుకుంటూ
నర్సరీ ముందు అలా ఆగిపోకండి...రెండడుగులు
వెయ్యండి,
నర్సరీ కుడిపక్క సందు మూడో ఇంటిలో
వరలక్ష్మిగారు అద్దం ముందు నుంచుని కొప్పు
సరి చేసుకుని,
చంద్రహారం సవరించుకుని,
అప్పటికే మూడు సార్లు పౌడర్ రాసినా ఇంకా
టచ్-అప్ ఎక్కడ ఇవ్వాలా సతమతమవుతున్నారు.
వరండాలో ఆవిడ భర్త సుబ్బారావు గారు వేడి,
వేడి పకోడీలాంటి బై-ఎలెక్షన్ వార్తలు
పేపరు పైకీ,
కిందకి కదుపుతూ అక్షరం మిస్ అవకుండా
జాగ్రత్తగా చదువుతున్నారు, నిజానికి
ఆయన్ని ఎలక్షన్ కమిషనర్ చేస్తే ప్రతీ ఆరు
నెల్లకి కామెడీగా జనరల్ ఎలెక్షన్
పెట్టేస్తారు...రాజకీయాలు అనే వీర, ఉచిత
కాలక్షేపం లేకపోతే అఖండ భారతదేశం ఒక్కటిగా
మిగలదని అయన ప్రగాడ విశ్వాసం!!
పసందైన,
రంజైన రియాలిటీ
ప్రోగ్రాం
లాంటి రాజకీయాలు...సుబ్బారావుగారు
'మేడ్
ఫర్ ఈచ్ అదర్'
!!
"ఏవండోయ్
నా చీర ఎలా ఉంది?"
‘నిశ్చల
తటాకంలో ఆకతాయి వేసిన బెడ్డ’
వరలక్ష్మిగారి
కన్ఫరమేషన్
ప్రశ్న,
అది
వినగానే సుబ్బారావుగారు తాచుపాములా సర్రున
వెనక్కి తిరిగారు, అయన
కోపానికి రెండు
కారణాలు - 'రిటైర్
అయిన వాడంటే అందరికి లోకువే" అనే సంపూర్ణ
నమ్మకం, రెండోది
ఆవిడ జోరీగలా రొద చేసి ఆయన్ని
నాలుగోసారి డిస్టర్బ్
చెయ్యడం, వెనక్కి చూడకుండా చాలా బావుందని
మూడుసార్లు చెప్పారు..ఈ
సారి అయన వల్ల కాలే
"తిన్నగా
ఎడ్వచ్చు కదా నా అందం ఎలా ఉందని..దానికి
చీర, బొట్టు
బిళ్ళ,
సవరం అంటూ డొంకతిరుగుడు అసలు నిన్ను కాదు
అనాల్సింది..మీ
జీలుగుమిల్లి
వాళ్ళంతా ఇంతే"
పుట్టింటివారిని అనగానే వరలక్ష్మిగారి
పుట్టెడు దుఖం వచ్చి గిర్రున
రెండు బొట్లు కాటుకని డైల్యూట్ చేస్తూ
కిందకి రాలాయి
ఆ సాయంత్రం,
కాకినాడ,
గాంధీ నగర్..వనజగారింట్లో
వరలక్ష్మి వ్రతం
పేరంటంలో కొత్త చంద్రహారం
ప్రదర్శిద్దామన్న వరలక్ష్మిగారి ఆలోచనకి
వనజగారు తెలీకుండా అడ్డం పడ్డారు, దాని
తాలూకు మచ్చు తునకలు –
"అమెరికా అంటే తీరని తియ్యటి కల, ఓ
అధ్బుతం,
ఓ ఇంద్రజాలం! ప్రపంచంలోని
సుగుణాలు, సుఖాలు,
నవ్వులు,
కార్లు...(ఈ సోదంతా కాదు) అమెరికా= భూతల
స్వర్గం!!....
వీకేండంటే అవధులు దాటిన ఆనందం, స్వేచ్చా
సాగరం, వయసుతో పనిలేని
ఎంజాయ్మెంట్....ఇంట్లో పార్టీలు,
పార్కులో
షికారులు, లాంగ్
డ్రైవులు
ఇంకా విసుగనిపిస్తే సినిమాలు,
షాపింగులు!! మా అల్లుడు
మరీను..ఎప్పుడూ కూడా
తిరుగుతూ....అత్తయ్యా! మీరు వెళ్ళిపోతే
మాకు అస్సలు తోచదు, మీరు ఇక్కడే ఉండాలి
అని బుంగమూతి పెట్టుకుని అలుగుతూ సోఫాలో
కూర్చుంటాడు, మేము వెళ్ళే రోజైతే తలుపు
బిడాయించుకుని అసలు బయటకి కూడా రాలేదు
వెర్రి
నాయన! అక్కడ ఉన్నన్నాళ్ళూ ‘టామీ’ లేని
లోటు తెలియనీయలేదు!
ఆత్మీయతలు, మమకారాలు సాఫ్ట్వేర్ తో పాటు
అమెరికాకి ఎక్స్పోర్ట్ అయిపోయి మన
ఇండియాలో
ఏమీ
మిగల్లే
, ఇక్కడి మనుషులకి ఎప్పుడూ టీవీ 9,
రాజకీయాలు, పక్క వాడిపై చాడీలు తప్ప
మనుషుల విలువ లేదు.... ఎక్కడో అమెరికాలో
ఉన్నా
మనవాళ్ళు బాషకి, మనుషులకి, పద్ధతులకీ
ప్రాణం ఇస్తారు, కళ్ళలో పెట్టుకుని
చూసుకుంటారు....మా అమ్మాయి గ్రీన్ కార్డు
చేస్తాను ఇక్కడే ఉండి పోండి అని
పట్టుపట్టింది..మాస్టారే వద్దన్నారు"
పద్మ గారు వరలక్ష్మిగారి చెవిలో గుసగుసలు-
"సరోజగారు చెప్పేవన్నీ నిజమేనంటారా?
నాకైతే ఈవిడ మాటలు చందమామ కథ
విన్నట్టుంది, మీ అబ్బాయి ఆల్రెడీ
అమెరికాలో ఉన్నాడు మీకు
అన్నీ తెలుస్తాయి అని అడుగుతున్నా సుమా!"
"ఆమ్..అన్నీ
నిజమేనండి...ఒక్క న్యూయార్క్
‘న్యూజెర్సీ
మన రాజమండ్రి’
కాకినాడలా జంట నగరాల్లా అన్న మాటే అర్థం
కాలే.....అదేం పోలికండి
మనకీ, రాజమండ్రికీ మధ్య వంద ఊళ్లుంటేనూ "
(పద్మగారు) "ఇప్పట్లో
అమెరికా ప్రయాణం ఏమైనా ఉందా?"
"మాకు అమెరికా వెళ్ళాలని అస్సలు లేదండి, ఫోన్
ఎత్తడం పాపం మా వాడు ఎప్పుడు వస్తారు, మీరు
రాకపోతే మేము వెనక్కి వచ్చేస్తాం అని
ఏడిచినంత పని చేస్తాడు..వాడి మనసంతా
ఇక్కడే"
ముందు చెప్పిన సందర్భాలు,
పూసలు కూర్చిన దండలా
ఇప్పుడే వరలక్ష్మిగారింటికి చేరాయి
సుబ్బారావుగారు,
వరలక్ష్మిగారు నోటితో మాట్లాడుకున్నా,
అరుచుకున్నా ఒకళ్ళ మాటలు ఇంకొకరికి
పెద్దగా అర్థం కావు,
అయినా ముప్పై ఏళ్ళ నుండి
నెట్టుకొస్తున్నారు.
"నిన్న
సుందరంగారి వాలకం చూసి తెలిసిన వాళ్ళంతా
నోటి మీద వేలేసుకుంటున్నారు..పొట్టి
నిక్కర్లు, జబ్బల
బనీను,
విప్పని బూట్లతో పేరంటాళ్ళకి నిన్న ఫల-పుష్ప
ప్రదర్శన
(Exhibition)..పేరంటంలో
కళ్ళు కింద పెట్టుకునే కూర్చున్నాం"
(పేపర్
చదువుతూ)
"వాడు
అమెరికా రిటర్న్ కదా,
అక్కడిలా బట్టలు వేసుకుంటేనే అందరికీ
తెలుస్తుందని అస్సలు విప్పట్లేదనుకుంటా"
"మన
చవటాయి
ఉన్నాడు ఎందుకు విగ్రహ పుష్టి..అమెరికాలో
ఉన్నాడు అని చెప్పుకోవడమే తప్ప వీసమెత్తు
ప్రయోజనం లేదు, వెళ్ళిన
మూడేళ్ళు 'ఎక్కే
గడప దిగే గడప' పట్టుమని
నేల్రోజులు కూడా
ఓ
ఉళ్ళో
ఉన్న దాఖలాలు లేవు..మనల్ని
పిలిచినా పాపాన పోలేదు"
"ఏదైనా అంటే ప్రాజెక్టు అంటాడు,
వీసా అంటాడు. నా పిండాకూడు
అంటాడు...వాడితో మాట్లాడితే ఫిడేలు రాగం,
ఏడుపు కలిపి విన్నట్టే
ఉంటుంది..అందుకే వాడు ఫోను చేస్తే టీవీ
వార్తలు చూస్తూ మధ్య మధ్యలో ఊ కొడుతూ
వింటాను"
"బాగా చెప్పారు,
నేను టీవీ సీరియల్ చూస్తూ 'ఆ, ఆ' అంటూ
ఉంటా....ఈ మధ్యన కాస్త సెటిల్
అయ్యాడంటే...వెంటనే కోడలు పురుడు....వీడే
కనేస్తున్నటు తప,
తపలాడిపోయి వీసా తెప్పించి, టికెట్ కొని
మరీ మావగారిని,
అత్తగారిని తీసుకెళ్ళాడు అమెరికా"
"వాళ్ళ మావగారు జీవితంలో విజయవాడ కూడా
సరిగ్గా చూసి ఉండరు,
ఇప్పుడు ఏకంగా అమెరికా..మనం కష్ట పడ్డం,
వేరే వాళ్ళు పళ్ళు తినడం..అసలు లోకంలో
న్యాయం,
ధర్మం అంటూ ఏమీ మిగల్లేదు...పురాణాల్లో,
టీవీ సీరియల్లో తప్ప”
ఈ
లోగా
ఫోన్
మ్రోగింది-
"హలో
అమ్మా!
నేను
మోహన్ని..ఎలా
ఉన్నారు?"
"ఓరే
నాన్నా
వందేళ్ళు!!..
ఇప్పుడే నువ్వు
పంపిన
ఫోటో
చూస్తూ నాన్నగారితో
'మోహన్
చిక్కినట్టున్నాడండి'
అని
అంటున్నాను,
ఈ
లోగా
నువ్వే
చేసావు,
నాన్నగారైతే ఏమీ
మాట్లాడరు కాని ఎప్పుడూ మీ గురించే అయన
బెంగ "
"పర్వాలేదమ్మా
ఏదో
మేనేజ్
చేస్తున్నాం"
"ఇక్కడ
పక్క
బట్టలు
కూడా
ఎత్తేవాడు
కాడు,
అక్కడ ఆ
పని
తప్ప
అన్నీ
నువ్వే చెయ్యాలి...
అసలు
విషయం మా
కోడలు,
మనవరాలు ఎలా
ఉన్నార్రా?"
"తనకే
బాలేదు..మొన్న
డాక్టర్ దగ్గరకి వెళితే బాగా రెస్ట్
కావాలన్నారు"
(సుబ్బారావుగారు
ఫిడేలు
రాగం
మొదలు
అనుకున్నారు)
"నాన్నగారితో
మొన్న
అదే
అంటున్నాను-
పాపం వీళ్ళకి మనిషి
సాయం
ఉండదు ఎలా నెట్టుకోస్తారోనని"
"అమ్మా!
ఈ
మధ్య
మీ
కోడలు............"
|