Sujanaranjani
           
  సారస్వతం  
  పుస్తక పరిచయం - 2

ఆసక్తిగా  సాగిన కదల ప్రయాణం తూరుపు వెళ్ళే రైలు

 
 

                                                                - పరిచయకర్త:    శైలజామిత్ర

 

 
 

కు నేపధ్యం, నిర్వహణా విధానం ఎంతో అవసరం. కాని కధలంటే ఉహా జనితాలని, థానికలంటే వాస్తవాలని ప్రముఖ కులు, విమర్శకులు, పరిశోధకులు వేదగిరి రాంబాబు గారు అంటారు. విషయాన్ని గురించి ఆలోచిస్తే కధలకు బదులుగా థానికలే అందరూ రాస్తున్నారనే చెప్పాలి.  వాస్తవంగా నేటి కధలన్నీ సమాజంలోనో లేక మన జీవితాలలోనో ఎదురయ్యే సంఘటనలే.  అలాగే ప్రముఖ థా రచయిత ఎం.ర్.వి. సత్యనారాయణ మూర్తి గారి కధల్లో వాస్తవం కొట్ట వచ్చినట్లు కనిపిస్తుంది. సమకాలీన పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం కనిపిస్తుంది. ఎండిపోయిన గుండెలకు ఒక హెచ్చరికలా అగుపిస్తుంది. వెరసి మంచి కధలుగా పదుగురి మన్ననలను అందుకుంటుంది... రచయిత తన కోసం కాదు ఒక సాంఘి ప్రయోజనాన్ని ఆశించి రచించారు..

గురు శిష్యులకు అర్థమే మారిపోతున్న రోజుల్లో విలువను తెలిపిన కధ గురు దక్షిణ. మధ్య తరగతి జీవితాలలో అవసరాలు అందరికంటే ఎక్కువే ఉంటాయి. అంటే సంపాదన ఒక వంతైతే, ఖర్చు నాలుగు వంతులు ఉండటం జీవితాల ప్రత్యేకత. లేమితనం ఆకలిని, అవసరాన్ని పెంచుతుంది అని చెప్పే అద్భుతమయిన భావన కధ. ఎక్కడా రాజీ పడకపోవడం, శిల్పానికి మరింత శ్రద్ధ తీసుకోవడం ప్రత్యేకత.

భార్య భర్త అనే పదాలు, వాటి స్థానాలు రెండూ ఎంతో విలువైనవి. ఎందుకంటే జన్మనిచ్చిన తల్లి తండ్రులకంటే ఎక్కువ కాలం వీరితోనే జీవిస్తాము కనుక. కాలం ఎలా ఉన్నా, ఎంతగా నాగరికతను సంతరించుకున్నా, ఆధునికతనుపోసన పట్టినా కుడా ఇంకా భర్త నీడలో ఇంకా స్వార్థం, అహంకారం నిలిచే ఉన్నాయి అనడానికి తల్లీ నీ పాద ధూళి శిరస్సున ధరించి అనే తార్కాణం. బిడ్డల్ని పెంచలేని ఒక అయోగ్యపు తండ్రి మరొకరికి కన్నబిడ్డల్ని అమ్మేయడం, భర్తకు ఎదురు చెప్పలేక లోలోపల కుమిలిపోతూ తల్లి ఉండడం థా ఇతివృత్తం. కాని చివరికి తన న్న బిడ్డ ఎక్కడో ఉన్నా, తన కన్న తల్లిని గురించిన విషయాలను తెలుసుకుని బిడ్డ తల్లి పాద ధూళిని శిరస్సుపై వేసుకోవడంతో కధ సుఖాంతమవుతుంది. విషయం పాతదే అయినా కధనం లో కొత్తదనం, విషయ వ్యక్తీకరణలో నూతనత్వం ఉండటం కధ విశేషం.

నేడు మనిషికి ఆకారం తప్ప మనిషి తత్వం ఒక్కటీ లేకపోవడం మనకు తెలుసు. కాని మనిషిగా పుట్టినందుకైనా మనిషి తత్వాన్ని, ప్పుడో ఒక్కసారి జీవిత కాలంలో మానవత్వం ఉపయోగించడం అవసరం. కాని అవన్నీ పక్కకు తోసిపుచ్చి, నిత్యం అత్యాశతోదో ఒకటి సాధించాలనే పిచ్చి తప్ప మరేది ఆలోచించని మానవాళికి కనీసం చెట్టును, జంతువులను, పక్షులను చూసయినా నేర్చుకోవాలి అనే తాత్విక చింతన కలిగించిన శివుని కోరిక మానవీయత లేనిదే మనిషి బతకడం వృధా అనే మాట సత్యనారాయణ గారు తెలిపిన తీరు ఎంతో ఆదర్శవంతంగా ఉంది

నేడు తల్లి తండ్రులు పిల్లలకు డబ్బును అందించాలనే చూస్తున్నారు తప్ప, డబ్బు ద్వారా వారు ఏమి కోల్పోతున్నారో తెలుసుకోవడం లేదు.  కాని డబ్బుతో పిల్లలు ఎంతవరకు ఆనందపడుతున్నారు? ఏమేమి కొనుక్కొని తమ దారులను పక్కకు మరల్చుకుంటున్నారు? అనేది ఆలోచించే వారు లేరు. ఇప్పుడు కంప్యూటర్స్, సెల్ ఫోన్స్ ద్వారా వారు నేర్చుకునేది ఏమిటి? తరపు యువతరంలో వస్తున్న వికృత ఛాయల్ని  తెలిపే కధ వెలుతురులోకి పయనం

తాతల నాటి ఆస్తి పాస్తులను చూసుకుని ఎగిరి పడే బబ్లుకు ఆస్తిని సేవా సంస్థలకు రాసి ఇవ్వడం ఒక విధంగా కనువిప్పు కలుగుతుంది. పిల్లల భవితవ్యాన్ని ఎలా తీర్చి దిద్దాలనే ధోరణిలో రచించిన యువతరానికి మార్గదర్శకం.

వీటన్నిటికి సంభంధం లేకుండా కధను ఒక విభిన్న ధోరణిలో నడిపించిన తీరు రివర్స్ గేర్. హాస్యం పండు వెన్నెల గా మారితే గుండెకు మందుగా మారుతుంది. లేకుంటే గుండె బరువుగా మారుతుంది. నేడు హాస్య కధలే కరువుతున్న రోజుల్లో నిజమై పండువెన్నెలే !  టివి లో నిత్యం మనం చూస్తున్న వంటల కార్యక్రమం గురించి మనకు తెలుసు. పదార్ధం ఏమిటో.. నిజంగా బావుందా లేదా? లేక యాంకర్ తప్పని సరిగా సూపర్ అంటోందా అనేది పరమాత్మునికే తెలియాలి.. వస్తువును గా తీసుకుని అద్భుతంగా మలిచిన ఘనత రచయితదే అనిపించింది. హాస్యం అపహాస్యం అవుతున్న రోజుల్లో ఇంత సున్నితంగా హాస్యాన్ని పండించిన తీరుకు మనం మెచ్చుకోవాలి

వీరి ప్రతి కధలో సమాజాన్ని మేలుకొలపాలనే దృక్పధం ఉంది. స్త్రీని స్త్రీగా గౌరవంగా చూసే రోజులు ఇప్పుడు లేవు. పర స్త్రీని గురించి పరమ నీఛంగా చిత్రీకరిస్తూ, తమ భార్యలను అనుమానిస్తూ   రోజుల్లో  గొప్పవారు ఎవరు? అసలు గొప్పవారు అనే ఎవరిని అంటారు? చిన్నవారిని లోకువగా చూసే గుణం ఎందుకు అలవాడుతోంది అనే ప్రశ్నకు చక్కని సమాధానం చెప్పిన కద తూరుపు వెళ్ళే రైలు . పరస్త్రీని కోరుకుంటే కలిగే పర్యవసానం విపులంగా తెలియజేసింది

అలాగే జీవిత సత్యం, అవార్డ్స్, కొత్త అధ్యాయం, సెల్ కు సెలవ్, అనే కధల్లో కూడా  ఎంతో సామాజిక భాద్యతను కనపరిచారు. స్పష్టత, వస్తు ప్రాధాన్యతకు ఎంతో విలువ ఇచ్చిన కధలు అందరు చదవ దగినవి అనడంలో అతిశయోక్తి లేదు.

కధా విధానాన్ని చక్కగా ఔపోసన పట్టిన సత్యనారాయణ మూర్తి గారి కధల ఆంధ్ర దేశంలో తెలియని వారంటూ లేరనే చెప్పాలి. సాహిత్యాన్ని ఒక వ్యాపారంగా కాకుండా ఒక సామాజిక సేవగా, తెలుగు సాహితీ సేవగా గుర్తించి నిస్వార్ధంగా చేసే వారి పనుల లాగే వారి రచనలు కుడా ఉండటం గమనార్హం. రచనలకు, జీవితానికి పొంతనను సమకూర్చుకుంటూ జీవితపు విలువలను కాపాడుకునే రచయితగా పేరెన్నిక గన్న వీరి కలం నుండి ఇలాంటి కధలు మరిన్ని రావాలని కోరుకుంటూ అభినందిస్తున్నాను.
 


 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech