సమస్యాపూరణము:
ఈ క్రింది "సమస్యని" అంటే
ఆ వ్యాక్యన్ని యదాతధంగా
ఒక పద్యంలోకి ఇమిడ్చి
వాడుకుంటూ రాయాలి. ఒకవేళ
పద్యం కాకపోయినా ఒక కవిత
రాసినా కూడా వాటిని మేము
సగౌరవంగా స్వీకరిస్తాము.
మీ జవాబులు ఈ-మెయిల్ (విద్యుల్లేఖ)
ద్వారా (padyam@tallapragada.com)
మాకు 20వ తారీఖు లోపల
పంపించండి. ఉత్తమ పూరణలను
తరువాయి సంచికలో
ప్రచురిస్తాము. ఇక్కడ
రెండు సమస్యలను ఇస్తున్నాం.
ఈ రెండికీగానీ, లేక ఏ
వొక్క దానికైనాగానీ మీరు
మీ పూరణలను పంపవచ్చు.
ఈ మాసం సమస్యలు:
1. గానము వంటి విద్య మరి
గానము (వేదుల బాలకృష్ణ
గారు పంపినది)
2. నూతన సంవత్సర
శుభాకాంక్షలు తెలుపుతూ
స్వేచ్చా ఛందస్సులో
పద్యము
గతమాసం సమస్యలు
1.
మతమును వీడిన మనుజుడె
మాన్యుండిలలో
2. (దత్తపది) పద్యము,
గద్యము, సేద్యము, వేద్యము
– స్వేచ్చా ఛందస్సులో
తెలుగు పద్యము వర్ణన (వేదుల
బాలకృష్ణగారు పంపినది)
ఈ సమస్యలకు మాకు అందిన
క్రమములో పూరణలు ఇలా
వున్నాయి.
నేదునూరి రాజేశ్వరి,
న్యూజెర్సీ
తే.గీ||
తెలుగు పద్యము విని నంత
కలుగు హాయి
మధుర పదముల సేద్యము మణుల
పంట
కవన గద్యము హృద్యము కవుల
ఘనత
హితము వేద్యము రసరమ్య
కృతము గాదే !
కం||
సేద్యము జేయుచు పోతన
పద్యములను వ్రాసె మెండు
భగవం తునిపై !
గద్యము లను రంగరించి నై
వేద్యము రాఘవున కిచ్చెవేద
విధుండై !
కం||
కతలను చెప్పెడి వారలు
వెతలందున కలిసి రారు
వేడుక పడినన్ !
హితముగ చెలిమిని గోరుచు
మతమును వీడిన మనుజుడె
మాన్యుండిలలో !
వారణాసి సూర్యకుమారి
చం||
తెలుగును నేర్చినంతనిక
తేలును సాహితి సేద్యమన్ననో
వెలుగు యటంచు పద్యములు
వేలకువేలుగ పంట పండగా
కలమును పట్టగానె
కడుగద్యములున్ దుముకంగ
తృప్తియున్
కలుగుట భారతమ్మ దయ కాదె?
సదానుభవైక వేద్యమున్
తే.గీ||
తెలుగు పద్యము భాషకు
తెచ్చు ఘనత
గద్య మాధురీ గరిమయు కాదె
మిన్న
సాహితీ సేద్య ఫలమైన సకల
రచన
వాణి కర్పించు నైవేద్య
మనగ నొప్పు
కం||
మత మేదైనను మంద
స్మిత వదనంబు మృదువైన
మితభాషణలన్
వెత దీర్చ పరులకొర కభి
మతమును వీడిన మనుజుడె
మాన్యుండిలలో
తటవర్తి కళ్యాణ్
కం||
ఇతరుల జిత్తుల దెగడి స్వ
మతమును పాటించు వాడె
మహనీయుండౌ !
ఇతర మతద్వేష మనెడి
మతమును వీడిన మనుజుడె
మాన్యుండిలలో ||
కం||
అతిచంచల చిత్త గతిని
పతనదిశన సాగకుండ బట్టి
నిలి పి తాఁ
మతియందు నఘ భరిత యభి
మతమును వీడిన మనుజుడె
మాన్యుండిలలో ||
డా.రామినేని రంగారావు
యం.బి.బి.యస్, పామూరు,
ప్రకాశం జిల్లా
కం||
సతతము నితరుల తెగడుచు
గత దోషము లెత్తిచూపి కాలము
గడిపే
కితవుడె పూనిక తన రెట
మతమును వీడిన మనుజుడె
మాన్యుం డిలలో
యం.వి.సి. రావు, బెంగళూరు
ఉ//
పద్యము ఇంపుసొంపులకు
పాదునుజేయగ పండితోత్తముల్
సేద్యము జేసినట్లుగను
చేవగ దున్నిరి
కావ్యభూములన్
గద్యమువ్రాయుటే
పరమకష్ఠతరంబుగ
నెంచువారకున్
వేద్యముజేసి చాటిరట
వేడ్కను పద్యపు వైభవంబులన్.
ఉ//
సేద్యముసేయు బ్రాహ్మణుడు
చేవగుపద్యములన్ రచించి సం
వేద్యము సేసినాడిలను
వేదవిధుండగు పోతనార్యుడై
గద్యముకన్న నింపుగను
కంజదళాక్షుని కృష్ణలీలలన్
పద్యముపద్యమందునను
భాసిలజేసెను భక్తిమీరగన్.
కం//
మతమే జీవన మార్గము
మతమౌడ్యపుముసుగువీడి మనవలె
నిరతిన్
వెతలను గూర్చెడి దౌష్ట్యపు
మతమును వీడిన మనుజుడె
మాన్యుండిలలో.
వేదుల బాలకృష్ణ మూర్తి,
శ్రీకాకుళం
ఉ//
పద్యము తెల్గువారలకు
భాగ్యప్రదంబుగ
ప్రాప్తమౌటచే
గద్యము కన్న నెక్కువగు
గౌరవమిచ్చుచు
పండితోత్తముల్
సేద్యము చేయరే
హృదయసీమలయందున హృద్యపద్య
నై
వేద్యము నిత్తు గైకొనుడు
వేడుకమీరగ ఆంధ్ర సోదరుల్
కం//
మతమనగ అభిప్రాయము
ఇతరుల మతములన భేధమెంచక స
మ్మతముగ మెలగుచు ఛాందస
మతమును వీడిన మనుజుడె
మాన్యుండిలలో
మాజేటి సుమలత, క్యూపర్టీనొ
ఉ//
విద్యల నమ్మనంచు, మది
నీశ్వరు భక్తితొ
నమ్మియుండి భూ
సేద్యము సేయుచున్, సహజ
సిద్దత సొంపగు భావనా
కృతిన్
పద్యము గద్యమున్ పలుక
భాగవతామృతమాంధ్రమాయె సం
వేద్యము, పోతరాజొకడు
దివ్యపదంబున చేరె భారతీ
క౦||
మతముల చెప్పిన హితవుల
మతలబు మరచుచు, సతతము తనదగు
మతమే
మతమని వాదించెడి అభి
మతమును వీడిన మనుజుడె
మాన్యుండిలలో
ఇంద్రగంటి సతీష్ కుమార్
క౦||
మిత మెరుగని కోరికలను,
మతి జెరచెడి మద్య పాన
మత్తును మరియున్
ఇతరుల కడు హి౦సి౦చెడు
మతమును వీడిన మనుజుడె
మాన్యు౦డిలలో!
క౦.||
కను తెరకెక్కెడి పద్యము
లను, ఏరుగ పారు పదములచె
గద్యములన్,
ఘన భక్తి సేద్యముగ పో
తన, నైవేద్యముగ హరి కథా
ఫలములనే!
పుల్లెల శ్యామసుందర్, శాన్
హోసే
కం//
మితిమీరి సురను త్రాగుట,
అతిగా తా చీట్లపేక ఆడుట,
రెండున్,
సతతము గొను దుర్జన స
మ్మతమును - వీడిన మనుజుడె
మాన్యుండిలలో
|