 |
|
|
శీర్షికలు |
|
|
మాస ఫలాలు |
|
- రచన :
బ్రహ్మశ్రీ
క్రిష్టిపాటి విశ్వ ప్రసాద్ శాస్త్రి గారు |
|
|

బ్రహ్మశ్రీ
క్రిష్టిపాటి
విశ్వ
ప్రసాద్
శాస్త్రి
గారు
వైదిక
కుటుంబములో
జన్మించి
తన
తండ్రిగారైన
శ్రీ
సుబ్బరామయ్య
గారి
వద్ద
తొలిపలుకులు
ప్రారంభించి,
కేంద్రీయ
సంస్కృత
విశ్వ
విద్యాలయమున
పూజ్య
గురుదేవులు
శ్రీపాద
భట్
గారి
వద్ద
సిద్ధాంత
జ్యోతిషమును
అభ్యసించి,
తెలుగు
విశ్వ
విద్యాలయము
నందు
ఫలిత
జ్యోతిషము
నందు
ఉత్తీర్ణులై
గత
పుష్కర
కాలముగా
ఆంధ్ర
దేశమున
జ్యోతిష
పరమైన
ముహూర్త,
జాతక,
సాముద్రిక
మరియు
వాస్తు
శాస్త్ర
సేవలందించుచున్నారు
.వీరు
ప్రస్తుతము
కాలిఫోర్నియా
ఫ్రీమాంటు
హిందూ
దేవాలయంలో
అర్చకులుగా
సేవలను
అందిస్తున్నారు.
|
|
|
|
 |
మేషరాశి
అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు , కృత్తిక 1 వ పాదము |
ఈ రాశి వారికి ఈ మాసంలో ఆరోగ్య విషయంలో చాలా
జాగ్రత్త అవసరం. భాగస్వామి విషయంలో వ్యతిరేకతలు
వస్తాయి. మాతృ,పితృ సంబంధించి సమస్యలు
వస్తాయి.మిత్రులతో జాగ్రత్త అవసరం.ఉద్యోగమూ
,వృత్తి,వ్యాపారము లలో ఆదాయము అధికంగా ఉంటుంది.
సమస్యలు తగ్గుటకు అవకాసం ఉన్నది. మాస ప్రారంభంలో
గొప్పవారి కలుసుకొనుట,దైవచింతన , ధన లాభము ,అధికశ్రమ
కలుగుటకు అవకాసం ఉన్నది.మాసం మధ్యలో ధనవృద్ది , విశేష
ఆరోగ్యము ,విద్యార్దులకు అధిక శ్రమ కలుగుటకు అవకాసం
ఉన్నది. మాసాంత్యంలో స్థాన చలనము ,కార్యహాని ,శుభ
కార్య ప్రాప్తి ,అధికార ప్రాప్తి కలుగుటకు అవకాసం
ఉన్నది.
ఈ రాశి వారు రాహు,కేతు పూజలు మంచిది .
|
|
|
|
|
 |
వృషభరాశి
కృత్తిక 2 ,3 ,4 పాదములు, రోహిణి 4 పాదములు , మృగశిర
1 , 2 పాదములు |
ఈ రాశి వారికి ఈ మాసం లో సృజనాత్మకంగా వ్యవహరించి
పనులు సాధిస్తారు ఎముకలకు సంబంధించి నొప్పులు వచ్చుటకు
అవకాసం ఉన్నది .ఆహార విషయాలలో జాగ్రత్త అవసరం
.వృత్తి,వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకొంటారు
.లౌకిక విషయాలలో రాణించగలరు . మాస
ప్రారంభంలోభార్యా,పుత్రులతో విరోదాలు కలుగుటకు అవకాసం
ఉన్నది.విదేశీ వస్తువులు కొనుట ,స్త్రీ మూలక సమస్యలు
కలుగుటకు అవకాసం ఉన్నది. మాసం మధ్యలో నీచులతో కలహములు
,వాహన యోగము ,భూ,గృహ వసతుల ఏర్పాటు,ఉద్యోగాభివృద్ధి
,మానసిక ఆందోళనలు కలుగుటకు అవకాసం ఉన్నది.మాసాంత్యంలో
ధర్మ రక్షణ ,విద్యాభివృద్ధి ధన ప్రాప్తి ,స్వల్ప ధన
లాభాలు కలుగుటకు అవకాసం ఉన్నది
ఈ రాశి వారు సుబ్రమణ్య స్వామి పూజలు చేయుట మంచిది .
|
|
|
|
|
|
 |
మిథునరాశి
మృగశిర 3 ,4 పాదములు, ఆరుద్ర 4 పాదములు , పునర్వసు
1 , 2 ,3 పాదములు |
ఈ రాశి వారికి ఈ మాసంలో శ్రమకు తగ్గా ఫలితము
వచ్చును .సమాజంలో పేరు,ప్రతిష్టలు పెరుగును.కోర్టు
వ్యవహారములలో విజయము కలుగుటకు అవకాసం ఉన్నది
.మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి .అనారోగ్యము
కలుగుటకు అవకాసం ఉన్నది. మాసం ప్రారంభంలో బందు
సౌఖ్యము, ఉద్యోగ ప్రాప్తి ,అనుకొన్నది సాధించలేక పోవుట
,సోమరితనం ,గౌరవభంగము కలుగుటకు అవకాసం ఉనది. మాసం
మధ్యలో అధికారుల ఒత్తిడి ,ఉద్యోగ విజయము ,స్థాన చలనము
కలుగుటకు అవకాశం ఉన్నది. మాసాంత్యంలో కలహములు
,గృహమునందు ఋణములు ,,భోజన సౌఖ్యము,యాత్ర సందర్శనములు
చేయుటకు అవకాశం ఉన్నది.
ఈ రాశి వారు దక్షిణామూర్తి,సాయి బాబా పూజలు .
అభిషేకాలు చేయుట మంచిది
|
|
|
|
|
 |
కర్కాటక
రాశి
పునర్వసు 4 వ పాదము, పుష్యమి 4 పాదములు , ఆశ్లేష
4 పాదములు |
ఈ రాశి వారికి ఈ మాసంలో కొన్ని ముఖ్యమైన పనులు
పెద్దవారి ద్వారా విజయం కలుగును .సంఘంలో గౌరవ మర్యాదలు
పెరుగును.ఇంటిలో శుభ కార్యాలు కగుటకు అవకాశం
ఉన్నది.వృత్తి యందు స్థాన చలనము కలుగుటకు అవకాశం
ఉన్నది ఉన్నత పదవులు వచ్చుటకు అవకాశం ఉన్నది. మాస
ప్రారంభంలో ఉద్యోగము నందు ప్రమోషన్స్ వచ్చుటకు అవకాసం
ఉన్నది,శత్రు బాధలు,వాహన యోగము ,శారీరక,మానసిక
సంతోషములు, కోపము కలుగుటకు అవకాసం ఉన్నది . మాసం
మధ్యలో ధన నష్టము ,స్నేహితులను కలుసుకొనుట,స్త్రీ లచే
బాధలు ,అధిక శ్రమ కలుగుటకు అవకాశం ఉన్నడి.మాసాంత్యంలో
భార్య పుత్రుల విరోధములు ,ధర్మ రక్షణ ,వ్యాపార లాభములు
,దూర దేశ ప్రయానములు కలుగుటకు అవకాశం ఉన్నది.
ఈ రాశి వారు ఇంద్రాణి దేవిపూజలు శుక్ర వారం రోజున
చేయుట మంచిది.
|
|
|
|
|
 |
సింహరాశి
మఖ 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1 వ పాదము |
ఈ రాశి వారు ఈ మాసంలో ఖర్చుల అధికంగా ఉండుటకు
అవకాశం ఉన్నది.ఇంటికి సంబంధించి ఖర్చు చేస్తారు.ప్రతి
విషయము నందు ఆచితూచి వ్యవహరించుట మంచిది .గృహములో శుభ
కార్యలకుగాను ధనవ్యయము కలుగుటకు అవకాశం నూతన
ప్రయత్నాలు కలిసి వచ్చును .ధనాదాయము సామాన్యముగా
ఉండునను. మాస ప్రారంభంలో శారీరక శ్రమ, వస్తువులు
అమ్ముట,వ్యాపారము తగ్గును ,విద్య ,వివాహ
సమస్యలు,ఆకస్మిక కోర్టు వ్యహారములు కలుగుటకు అవకాశం
ఉన్నది. మాసం మధ్యలో ప్రశాంతత ,శుభ కార్య ప్రాప్తి
,స్వల్ప ధన లాభములు,పాప కార్య చింతన ,ఋణములు చేయుటకు
అవకాశం ఉన్నది. మాసం చివరలో వృధా సంచారము ,స్త్రీ మూలక
అనారోగ్యము ,దూర ప్రయాణాలు ,కుటుంబ గౌరవాభివ్రుద్ధి
పెరుగుటకు అవకాశం ఉన్నది.
ఈ రాశి వారు అరుణ పారాయణము చేయుట మంచిది.
|
|
|
|
|
 |
కన్యా రాశి
ఉత్తర 2 ,3 ,4 పాదములు, హస్త 4 పాదములు , చిత్త
1 , 2 పాదములు |
ఈ రాశి వారు ఈ మాసంలో ఆర్ధిక లావాదేవీలు
ఆశించినంతగా ఉండవు.స్త్రీ మూలక ఇబ్బందులు
ఎదుర్కోనవలిసి వస్తుంది.ఉద్యోగస్తులు తమ సహచరులతో
జాగ్రత్త అవసరం. స్వజనులతో మాట భేదాలు వచ్చుటకు అవకాసం
ఉన్నది .నిత్య జీవన విధానము నందు జాగరూకత అవసరం. . మాస
ప్రారంభంలో పాప కార్య చింతన ,జాయింటు వ్యాపారం లో
వైరములు వచ్చుటకు అవకాసం ఉన్నది.వ్యాపారంలో ఆదాయం
తగ్గును. మాస మధ్య మందు నేత్ర బాధలు,ప్రజా
విరోధములు,గృహ లాభములు కలుగుటకు అవకాసం
ఉన్నది.మాసాంత్యంలో సామాన్య వ్యాపారము, దేశ సంచారము
,ఋణములు చేయుటకు అవకాశం ఉన్నది.
ఈ రాశి వారు శనివారం శనైశ్చరునికి పూజలు,పంచాక్షరీ
జపం చేయుట మంచిది.
|
|
|
|
|
 |
తులారాశి
చిత్త 3 ,4 పాదములు, స్వాతి 4 పాదములు , విశాఖ 1
, 2,3 పాదములు |
ఈ రాశి వారికి ఈ మాసంలో వృత్తి,వ్యాపారము నందు
ఆకస్మిక ధన లాభములు కలుగుటకు అవకాశమున్నది.
స్థిరాస్తుల విషయంలో జాగరూకత అవసరం.నూతన వ్య క్తులను
తొరగా నమ్మకండి .పుణ్యక్షేత్రాల సందర్శనం చేయుట చాల
మంచిది .ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మాస
ప్రారంభంలో ప్రమాదాలు,కీర్తి భంగము, ,వ్యాపారములో
స్వల్ప లాభము కలుగుటకు అవకాశం ఉన్నది . మాసం మధ్యలో
అధికారుల కోపానికి గురి అవుతారు. వాహన సౌఖ్యము,ధన
లాభము కలుటకు అవకాశం ఉన్నది. మాసాంత్యంలో
ప్రమోషన్స్,వ్యవసాయముల యందు వ్యతిరేకతలు,అధికార
సందర్శము,భార్యతో కలహములు కలుగుటకు అవకాశం ఉన్నది.
ఈ రాశి వారు శనివారం నాడు శనైశ్చరునుకి
తైలాభిషేకాలు,వెంకటేశ్వర స్వామికి ప్రదక్షణాలు చేయుట
మంచిది.
|
|
|
|
|
 |
వృశ్చికరాశి
విశాఖ 4 వ పాదము, అనూరాధ 4 పాదములు , జ్యేష్ట 4
పాదములు |
ఈ రాశి వారు ఈ మాసంలో ఆర్ధిక లావాదీవీలు
మెరుగుపడును జీవిత భాగస్వామితో కొంచం కలహాలు కలుగుటకు
అవకాశం ఉన్నది.స్నేహితులతో తిరిగేటప్పుడు జాగ్రత్త
అవసరం.ప్రతీ పనిలో ఆలోచించి నిర్ణయాలు తీసుకొనుట
మంచిది.ధన లాభము సామాన్యముగా ఉండును. మాస ప్రారంభంలో
వ్యాపారం తగ్గును.కుటుంబ కలతలు,రాజ దండనలు,ఉద్యోగ
విరోధములు,హృదయ సంకటములు కలుగుటకు ఆకాశం ఉన్నది.. మాసం
మధ్యలో వ్యసనములచే దుర్వ్యయములు,వాక్కాట్టిన్యము
,తక్కువ వారితో వైరములు,అధికారులకు కోపము వచ్చుటకు
అవకాశం ఉన్నది. మాసం చివరిలో కార్య సాధన,విద్యా,
వినోదాలు,దూర దేశ ప్రయాణాలు కలుగుటకు అవకాశం ఉన్నది.
ఈ రాశి వారు వెంకటేశ్వర స్వామి కి పూజలు ,రుద్రాభి
షీకాలు అర్చనలు చేయుట మంచిది .
|
|
|
|
|
 |
ధనూరాశి
మూల 4 పాదములు, పూ.షా 4 పాదములు, ఉ.షా 1 వ పాదము |
ఈ రాశి వారికి ఈ మాసంలో అనుకోకుండా ధనం వచ్చుటకు
అవకాశం ఉన్నది.మీ పిల్లల విషయం లో జాగ్రత్త
అవసరం.పిల్లల చదువుల గురించి ఆలోచించుట మంచిది. వారు
దారి తప్పే ప్రమాదాలు కలుగుటకు అవకాశం ఉన్నది .ధనాదాయం
సామాన్యంగా ఉంటుంది. మాస ప్రారంభంలో వాక్కాట్టిన్యము
,రావలిసిన ఋణములు వచ్చుటకు అవకాశం ఉన్నది.ధన
ప్రాప్తి.మాసం మధ్యలో స్త్రీ మూలక సమస్యలు,స్థాన
చలనము,విదేశే వస్తువులు సేకరించుట ,అనారోగ్యము
కలుగుటకు అవకాశం ఉన్నది .మాసాంత్యంలో వృధా
వాదోపవాదములు ,సామాన్య ధన లాభములు,దూర ప్రయాణాలు
కలుగుటకు అవకాసం ఉన్నది.
ఈ రాశి వారు గురువారం రోజున దక్షిణ మూర్తి స్వామి
వారి పూజలు చేయుట మంచిది .
|
|
|
|
|
 |
మకరరాశి
ఉ.షా 2 ,3 ,4 పాదములు, శ్రవణం 4 పాదములు , ధనిష్ఠ
1 , 2 పాదములు |
ఈ రాశి వారికి ఈ మాసంలో ధన ప్రాప్తి యోగము
రాణించును.ఋణములు కొన్ని తీర్చేదురు. ఉద్యోగమునందు
ఆదాయము సామాన్యముగా ఉందును .వ్యాపారములో కొన్ని
చీకాకులు ఉన్నను చివరకు ఆనందంగా ఉండగలరు. మాస
ప్రారంభంలో శారీరక బాధలు,కార్యహాని,సోమరితనం ,వృత్తి
యందు ధన లాభములు కలుగుటకు అవకాశం ఉన్నది. మాస మధ్యమందు
అధికారుల ఒత్తిడి ,వ్యాపార సమస్యలు ,వృధా ఖర్చు
,విరోధములు కలుగుటకు అవకాశం ఉన్నది. మాసాంత్యంలో
ప్రయత్న కార్య సిద్ది ,దూర దేశ ప్రయానములు ,శారీరక
శ్రమ ,శుభ కార్య ప్రాప్తి కలుగుటకు అవకాశం ఉన్నడి.
ఈ రాశి వారు రుద్రాభిషేకాలు చేయుట మంచిది .
|
|
|
|
|
 |
కుంభరాశి
ధనిష్ఠ 3 ,4 పాదములు, శతభిషం 4 పాదములు , పూ.భా
1 , 2 ,3 పాదములు |
ఈ రాశి వారికి ఈ మాసంలో చేసే ప్రయాణాలలో లాభాలు
వచ్చుటకు అవకాశం ఉన్నది.పాత బాకీలు వసూలు అగును. క్రయ
విక్రయాలు బాగుగా ఉండును . నిపుణులతో స్నేహము
కుదురును.ముందు చూపుతో ఆలోచించి జీవనము
సాగించుదురు..మాస ప్రారంభంలో ఒత్తిడి అధికముగా ఉండును,
వ్యాపార వృత్తి యందు లాభములు,ఆకస్మిక కోర్టు
వ్యవహారములు కలుగుటకు అవకాశం .మాసం మధ్యలో తొందర పాటు
చర్యలు, శారీరక శ్రమ ,పేద వారి సమస్యలు
తీర్చుట,ప్రమోషన్స్ కలుగుటకు అవకాశం.మాసాంత్యంలో
వ్యాపారంలో లాభములు,శక్తి సామర్ద్యముల గుర్తింపు,నేత్ర
బాధలు స్త్రీ లచే బాధలు కలుగుటకు ఆకాశం ఉన్నది.
ఈ రాశి వారు ఇంద్రాణి దేవికి అర్చనలు ,పూజలు చేయుట
మంచిది.
|
|
|
|
|
 |
మీనరాశి
పూ.భా 4 వ పాదము, ఉ.భా 4 పాదములు , రేవతి 4
పాదములు |
ఈ రాశి వారు ఈ మాసంలోవృత్తి ,వ్యాపారము యందు
నష్టములు వచ్చుటకు అవకాశం ఉన్నది.విలాస వస్తువుల కోసం
ఖర్చు చేస్తారు. శరీరంలో కొలస్త్రాల్ పెరిగి గుండెకు
సంబందిచి ఇబ్బందులు వచ్చుటకు అవకాశం
ఉన్నది.స్నేహితులతో కలిసి ఆనందంగా ఉంద్ురు.అధికారం కోసం
చర్చలు వస్తాయి . మాస ప్రారంభంలో ఉద్యోగులకు ధన లాభం,
శుభ కార్యాలు ,దైవ చింతన ,బుద్ధి చాంచల్యం ,ధార్మిక
చింతన , కలుగుటకు అవకాశం..మాసం మధ్యలో ప్రమోషన్స్
,శత్రు బాధలు ,బంధు ,మిత్రుల కలహములు,విలాసములకు
అవకాశం ఉన్నది. మాసాంత్యంలో ఆర్ధిక సమస్యలు,వాహన
యోగము,శుభ కార్య ప్రాప్తి , ఉద్యోగ ప్రాప్తి,సంతాన
సమస్యలు కలుగుటకు అవకాశం ఉన్నది.
ఈ రాశి వారు ఆదిత్య హృదయం ,విష్ణు సహస్ర నామ పారాయణ
చేయుట మంచిది.
|
|
|
|
|
|
|
మీ
అభిప్రాయాలు, సలహాలు మాకెంతో
అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ
క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)
|
|
సుజనరంజని
మాసపత్రిక
ఉచితంగా మీ
ఇమెయిల్
కి పంపాలంటే
వివరాలు
కింది
బాక్స్‌లో టైపు
చేసి
సబ్‌స్క్రైబ్
బటన్ నొక్కగలరు.
|
|
|
|
|
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ
పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ
అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any
unsolicited purposes. Please keep comments relevant.)
|
|
|
|
|
|
|
|
|
Copyright ® 2001-2012
SiliconAndhra. All Rights Reserved.
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
Site Design: Krishna,
Hyd, Agnatech
|
|