తమాష
చూద్దాం,
భళారె అందాం, తళాంగు తకధిమి చిందులు వేసి గలాట చేద్దామా (2)
తల
తిరిగే మహిమల సుడిలో - ఒక నిమిషం దిగుదామా - కను చెదిరే కనుమల
నడుమే - కావాలనె తప్పిపోదాం (2)
కొండను న్న కోతి నైనా,
గూటి ను న్న గువ్వ నైనా,
ఎక్కడున్నా దేనిని ఐనా, గిన్నేనుంచె తీసివ్వగలడు
ఒంటిమీది బట్టనైనా,
మూతికున్న మీసమైనా,
కన్నుమూసి తీసేలోగా, మంత్రమేసి తీసేయగలడు
గారడీ కాదేమి వినర,
ఆరడీ లేదు (2),
మంత్రశక్తి,
తంత్రశక్తి, సంధించే వీరఘనుడు
తమాష
....
బాలలైనా గోలలాపు,
పెద్దలైనా విద్దెలాడు,
ముగ్ధలైనా ముగ్ధులు అయ్యి, ముద్దుసేసి ముచ్చటగొలుపు
ఆస్తులైనా పాస్తులైనా,
కాసులైనా రాసులైనా, రాకుమారిని కోరుకున్నా దండమెత్తి
తెచ్చియ్యగలడు
కోరికుంటే కోరుకోరా,
రోజు నీదేనోయ్ (2)
తారభక్తి,
శూరశక్తి అందించే
దివ్యగురుడు
తమాష
....
|