కవితా స్రవంతి  
      జానపద గేయం

- రచన : జగన్నాథ రావ్ కె. ఎల్.

 

సందేల సెల్లెత్తీ
సెల్లెత్తి 'అలోయ్' అనీ ( = cell ఎత్తి ' హలో ' అని )
సల్లంగ కబురొదిలీ  
'ఊరెల్తా 'నని యంటే
నువ్ - ఊరెల్తా  నని యంటే
ఓ! సినదానా! నువ్ 
సెయ్యూపి 'వత్తా 'నంటే -
టేసనూ కాడికొస్తినే
నే - వొగురుస్తూ -
టేసనూ  కాడికొస్తినే.

టికాయిట్టు  కొట్టమనీ
యెన్క దిరిగి సూడబోతే
రత్నాచలు రైలు పాయెనే
రత్నాలూ!
నువ్వెక్కిన రైలు పాయెనే
నన్నొదిలీ రైలు పాయెనే
సినదానా!
కూతెట్టీ పరుగు దీసెనే - ఆ రైలూ -
నా గుండె మీద
కోతెట్టీ పరుగు దీసెనే
నల్గురిలో -
రైలు నా - పరువు దీసెనే .

నాలో సగమన్నావ్ - నువ్ -
నాలో సగమన్నావ్ - సినదానా -
నేనే  సగమైనానే
నువ్ లేకా -
సిక్కీ  సగమైనానే.

రేయంతా పగలంతా
నా మదిలో రొద సేసేనే
సినదానా -
ఎండైన వానైనా
నీ ఊసే రొద సేసేనే
నా వసంతమా !
కోయిలనై  నే  రాబోనే ,
రాయే యెనక్కి  నీవిక నైనా
రాయే  రాతిరి కలలో కైనా
రాయే సినదానా!
యెనక్కి తిరిగి
రాయే ఇకనైనా! - నువ్ - రాయే ఇకనైనా! 

   
   

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech