నేస్తం
ఎన్నాళ్లని యిలా
మౌనాన్నాశ్రయించిన
మహర్షిలాబతకమంటావు?
రాగద్వేషాలకతీతంగా
రాయిలా
నిలిచిపొమ్మంటావు?
నేత్రానందానికి దూరంగా
వీనులవిందుకు వెలిగా
కబోదిలా,
బధిరసమానంగా
హృదయ విదారక దృశ్యాలను
వీక్షించుకుంటూ
కడుపు తరుక్కుపోయే
సంఘటనలను
సమీక్షించుకుంటూ
కాలం
వెళ్ళదీయమంటావు?
ఎప్పుడూ
నేనిలానిరాసక్తంగా
నిరామయంగా
శిశిరతరువులా మిగిలిపోతే
వసంతాగమనానికి స్పందించే
హృదయ
వైశాల్యాన్ని కోల్పోతాను
నేస్తం!
అందుకే మరీ మరీ
వేడుకుంటూ యిలా
విన్నవించుకుటున్నాను
నన్నిలా మామూలు
మనిషిగా బ్రతకనీ
మహోజ్వలంగాఎదగనీ
శాంతి సౌఖ్యాలకు
శమదమాదులకు
చేరువగాచేరిపోనీ
ఎప్పుడూ
నేనిలానిరాసక్తంగా
నేస్తం అందుకే మరీ మరీ
వేడుకుంటూయిలా
విన్నవించుకుటున్నాను
నన్నిలా మామూలు
మనిషిగాబతకనీ
ప్రకృతి రామణీయకతను
పరిపూర్ణంగా ఆస్వాదించనీ
మానవీయస్పందనలతో
మనిషిగా
చరిత్రపుటల్లో నిలిచిపోనీ
-----------------------------------------------------------------
ప్రకృతిమాత ఒడిలో
ఆకుల అందం
వాటి హరిత వర్ణంలో దాగుంటుంది
పూల పరరిమళం
వాటిరెక్కల మెత్తదనంలో హత్తుకొని ఉంటుంది
ప్రకృతిలోపరవసించేందుకు
ప్రత్యక్ష సోదాహరణాలు ఇలా ఎన్నెన్నో.
పచ్చికబయళ్ళలో
మృదువైన గడ్డిపోచల
సోయగాలు
తరుశాఖల కదలికల్లో
మలయమారుత పవన వీచికలు
చల్లని సాయంత్రాలు
నులివెచ్చని
శారదరాత్రులు
సాయం
సంధ్యవేళల్లో
పక్షుల
కిలకిలారావపు
మనోహరంపు
రాగప్రస్తారాలు
బావాల చలువ పందిళ్ళ కింద
కవిసమ్మేళనపు సౌరభాలు
ఆరుబయట అరుగులమీద
వేదపఠనాల
మనసోల్లాసాలు
అందుకే ఆఅమ్మవొడిలో
అనునిత్యం మమేకమై సేదతీరాలని తపన
ఆరోగ్యప్రదాతయైన ఆదిత్యునికి
హృదయోల్లాసమైన అష్టోత్తర శతనామాల తో అర్చనల పరంపరలు
|