ఆ చేతుల్లో ఏం మహత్యం వుందో
ఎంతమందికి
అంగాంగాలనమర్చిందో
మరెంత మందికి
ప్రాణం పోసిందో
బ్రతికినంతకాలం తీర్చుకోలేనిదా రుణం
కనిపించే దైవసమానుడవని
కనిపిస్తే చేతులెత్తి మొక్కాలనీ..
ఏ వృత్తికుంది ఇంతటి పవిత్రత?
దేవుడు హుండీకి అమ్మూడుపోవడమా?
వైద్యాన్ని డబ్బుతో తూచడమా?
ప్రాణాలని తృణప్రాయంగా చూడడమా?
మానవతా విలువలు ఇంతగా నశించి పోతున్నాయేమిటి?
తెల్ల దుస్తులవెనుక కటిక కాఠిన్యాన్ని చూడలేము
దేవదూతలుగా..ధవళ పావురాల్లా
కదలాడే మీరు
వైద్యాన్ని డబ్బుతో తూకంవేయకండి!
మా ఉసురు పోసుకోకండి!!
|