Sujanaranjani
           
  కవితా స్రవంతి  
 

అస్తమయం - నిష్క్రమణం  

 

రచన: - మూర్తి మధిర

 
 

 

సంధ్య చీకట్లను చీల్చుకుంటూ ఉదయించిన భానుడు
తల్లి ప్రసవ వేదనకు తెర దించుతూ జనియించిన బాలుడు

మానవాళికి వెచ్చని కిరణాలను ప్రసరిస్తూ పయనం
చూచినవారికందరికీ ఆనందాన్నిస్తూ సాగిన బాల్యం

మధ్యాహ్న సమయానికి విశ్వాన్ని వేడెక్కించిన మహా మార్తాండుడు
సమస్యలతో సతమతమై విసుగు వేడిని వెళ్ళగక్కుతున్న మధ్యవయస్కుడు

తనకూ అలసట ఉన్నదన్నట్లుగా వాడి తగ్గిన సాయంకాల సూర్యుడు
బాధ్యతల బరువును దించుకుని అలుపు తీర్చుకుంటున్న వృద్ధుడు

మర్నాడు వస్తానంటూ సంధ్య చీకట్ల మాటుకు అర్కుని అస్తమయం
మరో జన్మలో ఎక్కడోనంటూ తిరిగి రాని లోకాలకు మానవుని నిష్క్రమణం



 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 







సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech