ఆవేశం
సామరస్యం తరువాత
తనకు ఉనికి ఉండదని కాబోలు
ముందే తనను నాకు
పరిచయం చేసుకుంటుందా ఆవేశం.
*******
మనసు
మౌనాన్ని తాను మెచ్చడానికి
ఎంత మాట్లాడి అలసిపోయిందో
నా మనసు.
********
గోదారి
ఎందుకు అన్ని ఒంపులు తిరుగుతూ
మెట్టినిల్లు చేరునో ఆ గోదారి!
వయ్యారమనే ఘనమైన కట్నాన
అంతటి వరుణ్ణి కొనేందుకే గాదా?
********
సెలయేరు
గాత్రము నాట్యము
రెండూ అమరిన ఆ సెలయేటికి
ఒయ్యరమో ఆభరణమై
అదిగో అలా చూడు
ఎలా పోతోందో.
********
సకల కళా వల్లభుడు
వెదురులో దూరి
ఆకులతో ఆడి
కాయలెన్నో తుంచి ఆ సెలయేటిలో రాల్చి
ఎండుటాకుల ఆటకు పల్లవి పాడించే
సకల కళావల్లభుడా గాలి
ఆ వనసీమలందు.
********
మానవత
మాలోని మానవతకు
మోమాటమెక్కువ
సిగ్గు పడుతూ మా నుండి
బయటకు రాదు.
మీ
అభిప్రాయాలు, సలహాలు మాకెంతో
అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ
క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)
సుజనరంజని
మాసపత్రిక
ఉచితంగా మీ
ఇమెయిల్
కి పంపాలంటే
వివరాలు
కింది
బాక్స్‌లో టైపు
చేసి
సబ్‌స్క్రైబ్
బటన్ నొక్కగలరు.
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ
పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ
అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any
unsolicited purposes. Please keep comments relevant.)
Copyright ® 2001-2012
SiliconAndhra. All Rights Reserved.
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
Site Design: Krishna,
Hyd, Agnatech