మేజేర్
సాబ్,
ఇక మీరు హ్యాపీగా వెళ్ళండి.
రెండేళ్లగా
మీ పరిచయాన్ని,
ఇక్కడ అందరితో మంచి స్నేహితుడిలా
మెలిగిన మిమ్మల్ని మిస్ అవుతామని కాస్త
బాధగానే ఉంది.
అయినా ఈ ఆర్మీ సైకియాట్రిక్
హాస్పిటల్ నుండి మీరు ఫ్రీ అవడం ఆనందంగా
ఉంది. టేక్
కేర్ సార్,
కరచాలనం చేసారు డాక్టర్ గారు.
అర్జెంట్ గా చూడవలసిన పేషంట్
ఉన్నాడు,
అంటూ, డేవిడ్,
ఇలా వచ్చి మేజేర్ గారికి సాయం చేయి,
ఎసిస్టెంట్ కి చెప్పి రూం నుండి
వెళ్లారు
డా .
రావు.
పదండి సార్,
ఈ నాటితో మీకు ఈ పిచ్చాశుపత్రి
నుండి విడుదల,
పిచ్చోడు అన్న ముద్ర నుండి
శాశ్వతంగా విముక్తి దొరుకుతున్నాయి,
అంటూ నా చేతికర్ర నందించాడు డేవిడ్.
తలపైన నా మిలిటరీ కాప్ కూడా
సవరించి,
సాయం పట్టి సైకియాట్రిక్ చీఫ్ డా.
గోపాల్ రావు గారి గది నుండి బయటకి
నడిపించాడు అతను.
హెడ్
నర్స్ తో పాటు మరికొందరు స్టాఫ్,
ఆయాలు,
కుర్ర నర్సులు చేతిలో పూల
గుచ్చాలతో నా కోసం గది బయట వేచి ఉండడం
చూసి నా కళ్ళు చెమర్చాయి.
ఇకపైన మాకు పామిస్ట్రీ చెప్పే వారు
గాని,
సలహాలిచ్చేవారు కాని,
ఎవరున్నారు సార్?
అని నర్స్ మాల వాపోయింది.
యెన్.టి.ఆర్
లాగా డైలాగ్ చెప్పేవాళ్ళు గాని,
ఆర్మీ ఆఫీసరుగా అనుభవాలు కధలుగా
వినిపించేవారు గాని ఉండరు కదా సార్,
అయినా మీరిక్కడ ఉండవలసిన వారు కాదు
మేజేర్ సాబ్,
అందుకే హ్యాపీగా వెళ్ళండి,
అంటూ విషెస్ చెప్పాడు తెరపిస్ట్
విష్ణు.
అక్కడ
ఓ రోగిలా కాక,
రెండేళ్ళగా వారికి స్నేహితుడులా
మెలిగానన్నారు.
ఓ ఐదు నిముషాలు పాటు వారందరూ నాపై
అభిమానంతో ప్రేమగా వీడ్కోలు పలుకుతూ అన్న
మాటలవి.
అన్నీ విన్నాను.
ఆనందించాను.
అందరితో కరచాలనం చేసి,
శెలవు తీసుకొని అప్పటికే కాళ్ళు
నొప్పెట్టడంతో,
మెల్లగా డేవిడ్ ఆసరాతోనే వరండా
దాటుకుంటూ బయటకి వచ్చాను.
జానకి ,
భర్త మూర్తి
నాకోసం తెచ్చిన టాక్సి ముందు
నిలబడి ఉన్నారు.
గబగబా నా వద్దకు నడిచి,
నా చేయి అంది పుచ్చుకొని,
బాగున్నారా నాన్న?
కళ్ళనీళ్ళు పెట్టుకొంది జానకి.
ముందు సీట్లో కూర్చోండి అంకుల్,
అంటూ కార్ డోర్ తీసాడు మూర్తి.
ఈ సారి నన్ను ఇంటికి
తీసుకెళ్ళడానికి వచ్చిన వారిద్దరినీ చూసి
ఆనందమనిపించింది.
కాని ,
అసలు నేను ఈ సైకియాట్రిక్
హాస్పిటల్లో ఉండడానికి,
నా ఈ స్థితికి కారణమైన మా అమ్మాయి
వైశాలి,
అల్లుడు ఉమాపతి గుర్తుకొచ్చి మనస్సు బాధతో
బరువయ్యింది..
***
నా
కిష్టమైన వంటకాలు,
కొబ్బరి పచ్చడి చేసి ప్రేమతో
దగ్గరుండి వడ్డించిన జానకి గురించి
ఆలోచిస్తూ భోజనం ముగించి,
అలసటగా పక్క మీద వాలాను.
ఆమెకి
మాపట్ల ఉన్న ఆపేక్షలోని అనుభూతి నాకు,
చనిపోయిన నా భార్య శాంతకే తెలుసు.
మా జీవితాలని జానకి ఎంతలా
ప్రభావితం చేసిందో,
మా ఆరోప్రాణంగా ఎలా మెలిగిందో
గుర్తుకొస్తేనే,
నాలుగేళ్ళప్పటి జానకి రూపం నా కళ్ళ
ముందు మెదులుతుంది.
జానకి చుట్టూతే తిరుగుతూ సాగింది
నా ఆలోచనా శ్రవంతి.
***
పెళ్ళై
ఏడేళ్ళైనా సంతానం కలగలేదని నాకంటే నా
భార్య శాంత
దిగులుపడుతుండేది.
డెహ్రాడున్ లో ఇండియన్ మిలిటరీ
అకాడెమీ నుండి ట్రైనింగ్ అయి ఇంటికి
వచ్చిన సెలవల్లో అమ్మతో కలిసి నేను,
శాంత
భద్రాచలం తిరణాలకి వెళ్ళాము.
అక్కడ మాకు తటస్థ పడింది నాలుగేళ్ల
ఓ అనాధ బాలిక.
చిరిగిన బట్టలతో,
దెబ్బ తగిలి నెత్తురోడుతున్న ఎడమ
మోకాలితో,
దీనావస్థలో సత్రం ముందు చేయి చాచి
యాచిస్తున్న ఆ పసిదాన్ని చూసి కడుపు
తరుక్కుపోయింది మాకు.
శాంత విలవిల లాడిపోయింది.
పోస్టింగ్
వచ్చే లోగా నాలుగు వారాల సమయం ఉండడంతో
అక్కడే ఉండి,
ఆ పసిదాని గురించి ఆరా తీశాము.
అనాధ అని తేలింది.
పోలిస్ వాళ్లకి ఫిర్యాదు కూడా
ఇచ్చి,
స్థానిక శిశు సంక్షేమం వారి వద్ద నమోదు
అయ్యి, అన్ని
లాంఛనాలు ముగించుకొని,
ఆ పసిదాన్ని ఇంటికి తెచ్చుకున్నాము.
ఆ
తరువాత టెరిటోయల్ ఆర్మీలో కెప్టెన్ గా ఎ.ఓ.సి
(ఆర్మీ
ఆర్డినెన్స్ కోర్)
సెంటర్
కి పోస్టింగ్ రావడంతో హైదరాబాద్ చేరాము.
శాంత
ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
శ్రీ రామచంద్రుడే తన మొర ఆలకించి
ఇచ్చిన బిడ్డ అని పసిదానికి జానకి
అని పేరు
పెట్టుకొన్న
శాంతకి, ఆ
పసిదే ప్రపంచమయిపోయింది.
అదే యేడు మేము ఆశించని విధంగా శాంత
కడుపు పండి,
మాకు ఆడపిల్ల పుట్టింది.
వైశాలి అని పేరు పెట్టాము.
మా ఆనందం రెట్టింపయ్యింది.
వైశాలి
పుట్టాక మా అమ్మ వైఖరిలో వచ్చిన మార్పు
మాత్రం మాకు చాల బాధ కలిగించింది.
జానకితో
కఠినంగా
వ్యవహరిస్తూ,
దాన్ని వైశాలికి ఓ పనిమనిషిలా చేసింది.
జానకిని అనాధ అని,
అడుక్కునేదానా అని తను తిట్టి,
తిట్టించేది.
అక్కా చెల్లెళ్ళలా మెలగవలసిన
పిల్లల్లో వైషమ్యాలు పెంచింది.
అమ్మ నోటికి,
అధికార దర్పానికి భయపడి జానకికి మా
ప్రేమను పంచడం మినహా ఏమీ చేయలేక పోయాము.
జానకి
పదేళ్ళ పుట్టినరోజు నాడు వైశాలి,
అమ్మ కలిసి నువ్వు అసలు మా ఇంటి
పిల్లవే కావు,
సత్రం దగ్గర దొరికిన అనాధవు,
అంటూ గేలి చేసి ఏడిపించారు.
మిమ్మల్ని వదలను నాన్నా,
అంటూ ఏడుస్తూ నా కాళ్ళని
చుట్టేసింది ఆ రోజు జానకి.
అయినా,
అన్నీ తట్టుకొని,
నన్ను,
శాంతని కంటికి రెప్పలా చూసుకొనేది
జానకి. ఒకే
ఇంట్లో రెండు భిన్న కుటుంబాలుగా మెలగ వలసి
వచ్చింది కొన్నేళ్ళు.
చదువుపై
ఆశక్తి లేని జానకి అతి కష్టంగా పదవ తరగతి
పాస్ అయింది.
ఇంట్లో వంట పని చేస్తూ,
ఎంబ్రాయిడరీ,
కుట్టు నేర్చుకుంది.
కన్నతల్లి కన్నా మిన్నగా దగ్గరుండి
నాకన్నీ అమర్చేది.
ఎంతో క్రమశిక్షణలో పెంచాలనుకున్న
నా పాప వైశాలి మాత్రం,
మా అమ్మ పెంపకంలో,
ఓ రాక్షశిలా తయారయింది.
కేవలం జానకి పైనున్న ద్వేషంతో,
అమ్మ అవలంభిస్తున్న వైఖరి వల్ల,
వైశాలి మొండిగా,
మాక్కుడా ఎదురుతిరిగి మమ్ము అగౌరవ
పరిచేది.
ఇరవైయేళ్ళ
జానకికి,
ఆర్మీ కమీషన్డ్ ఆఫీసర్ సుబేదార్ మూర్తితో
గుళ్ళో వివాహం
జరిపించాము.
జానకి అత్తారింటికి వెళ్ళిపోయాక,
యింట శాంత జీవనం మరీ దుర్భరమయింది.
తరగని
ప్రేమతో, ఈ
రోజున కూడా డెబ్బైరెండేళ్ళ ముదసలినయిన
నాకోసం,
ఎంతగానో పోరాడి,
పిచ్చాసుపత్రి జీవితం నుండి,
మేజర్ పిచ్చోడు
అన్న ముద్ర నాపై పడనివ్వకుండా
పట్టుబట్టి కాపాడి,
నన్ను కన్నతల్లిలా ఇంటికి
తెచ్చుకొంది జానకి.
చిందర
వందరగా శాంత,
జానకీల ఆలోచనలతో గుండె భారంగా అనిపించింది.
ఆగని కన్నీళ్లతో చూపు మసక బారడంతో,
గది లోకి వచ్చిన జానకి జాడ తెలియ
లేదు నాకు.
నాన్నా ఇంకా నిద్ర పోలేదుగా,
కాసిన్ని వేడి పాలు తాగి పడుకోండి.
రేపు పొద్దుటే పెన్షన్ ఆఫీస్ కి,
డాక్టర్ చెకప్ కి వెళ్ళాలి.
ఓపికుంటే,
సాయంత్రం ఏడింటికి లాయర్ గారి
ఇంటికి వెళ్ళాలి,
అని చెంగుతో నా కళ్ళు తుడిచి,
కప్పుడు పాలు తాగించి మరీ గది
నుండి వెళ్ళింది
జానకి.
***
ఇండియన్
ఆర్మీ వారి
పెన్షన్ ఆఫీస్,
ఎ.ఓ.సి
సెంటర్
మేనేజర్
తెప్పించిన కాఫీ సిప్ చేస్తూ,
ఆఫీసర్ కోసం వెయిట్ చేస్తున్నాము
నేనూ, మూర్తి.
పెన్షన్ ఆఫీసర్,
ట్రిబ్యూనల్ జడ్జ్ సంతకాల కోసం
తెచ్చిన ఫైల్లోని కాగితాలని తేదీల వారీగా
అమర్చుతున్నాడు మూర్తి.
ఏమోయ్
మూర్తి,
నన్ను ఒక పిచ్చివాడిగా ముద్రించి,
నా పెన్షన్ కూడా నాకు దక్కకుండా
చేసి,
పిచ్చాసుపత్రిలో పడేసారు నా కన్న కూతురు,
దాని భర్త.
అలాంటి కిరాతకం నుండి నన్ను
కాపాడ్డం కోసం,
పోరాడి ఇన్ని సాక్ష్యాలు
సంపాదించడానికి ఎంత కష్టపడ్డారో కదా,
మీరు,
మీ
రుణం ఎలాగయ్యా తీర్చుకునేది?
అన్నాను మూర్తి తో.
మేము పరాయి
వాళ్ళమనే భావిస్తున్నారు అంకుల్ మీరు.
మీకు ఈ వయస్సులో ఈ మాత్రం చేయూత
నివ్వడం మా భాగ్యంగానే అనుకుంటున్నాము
జానకి, నేను
కూడా, అంటూ
ఫైల్ బల్ల మీద పెడుతుండగా లోనికి వచ్చాడు
ఆఫీసర్ శివరాం.
నమస్తే
సార్ మేజేర్ గారు,
మీరు నిజమైన ఫైటర్ సార్.
మిమ్మల్ని నేను మళ్ళీ ఇలా
ఆరోగ్యంగా చూడగలగడం మహా విశేషం.
మీ అల్లుడు ఇదిగో ఈ మూర్తి,
మీకోసం ఎన్ని సార్లు నా వద్దకు
వచ్చాడు?
అన్ని సంగతులు చెప్పేవాడు సార్,
గుక్క తిప్పుకోకుండా నన్ను చూసిన
సంతోషాన్ని వ్యక్తపరిచాడు శివరాం.
అంతలో
జస్టీస్ అవినాష్ శర్మ కూడా వచ్చారు.
హైకోర్ట్ చీఫ్ జస్టీస్ గా రిటైర్
అయ్యి, ఆర్మీ
ట్రిబ్యూనల్ వారి స్పెషల్ కేసులు
చూస్తుంటారు ఆయన.
రెండేళ్లగా
నాకు బదులు మా అమ్మాయి వైశాలికి వెళుతున్న
నా పెన్షన్ నాకే తిరగి వచ్చేలా చేయమని
నేను వేసిన పిటీషన్ కి స్పందించి ఆర్మీ
ట్రిబ్యునల్ వారు అనుకూలంగా తీర్పు
నిచ్చారు.
దాని సంభందిత డాక్యుమెంట్స్ పరిశీలిస్తూ
మాతో రెండు గంటలు గడిపారు,
అవినాష్ గారు.
ఈ
పిటీషన్ విషయం,
ఏమి జరిగిందో క్లుప్తంగా
వివరించమని జడ్జ్
అవినాష్ అడిగారు.
గ్లాసుడు
చల్లటి
మంచి
నీళ్ళు తాగి చెప్పడం మొదలెట్టాను....
నాలుగేళ్ళ క్రితం
మహవీర్ హిల్స్ లోని నా 1500 గజాల స్థలంలో
ప్రశాంత అపార్ట్మెంట్ కాంప్లెక్ష్
నిర్మాణం చేపట్టాను. పర్యవేక్షణ నిమిత్తం
అవుట్ హౌజ్ లో నివసిస్తూ, 68 సంవత్సరాల
వయస్సులో ఎంతో కష్టపడి పని చేసాను.
రెండేళ్ళకి భారీగా పనంతా పూర్తయిన ఆ భవంతి
పై సర్వాధికారాలు తమకి దక్కాలన్న
దురుద్దేశంతో నా కుమార్తె వైశాలి, భర్త
ఉమాపతి తో కలిసి నాపై తప్పుడు కేసు పెట్టి
పోలిస్ రిపోర్ట్ ఇచ్చింది. తమ కాంప్లెక్స్
నిర్మాణం పర్యవేక్షణ పేరిట లక్షలకి మోసాలు
చేసానని నా పై నిందలు మోపారు వారు. రెండు
రోజులు పోలిస్ కస్టడీలో కూడా ఉన్నాను. ఓ
క్షణం ఆగి,
ఊపిరి తీసుకొని,
మళ్ళీ చెప్పడం మొదలెట్టాను.
వాస్తవానికి ఆస్తి
తమదని, మతిస్తిమితం తప్పి, నేను వారి
ఆస్తిని నా ఆస్తులుగా భావించి,
ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నానని నా
పై కోర్టులో తప్పుడు కేసు కూడా వేసారు
వైశాలి దంపతులు. మతి స్థిమితం కోల్పోవడమే
ప్రధాన సమస్యగా చూపి నన్ను సైకియాట్రిక్
హాస్పిటల్ కి తరిలించారు. నిర్మాణ సమయంలో
నా కాలుకి, నడుముకీ గాయాలవడంతో శారీరకంగా
కూడా బాధలో ఉన్న సమయం అది. అకస్మాత్తు
పరిణామాలని తట్టుకునే సమయం గాని, శక్తి
గాని లేకపోవడంతో వారి కుట్రని ఎదుర్కోలేక
పోయాను.
.
నాకు
తెలియకుండానే అసహనంగా నిట్టూర్చాను.
ఆగి
అందరి వంక చూసాను.
ఆదుర్దాగా
వింటున్నారు...
బ్యాంక్ లోన్,
కాంట్రాక్టర్ల విషయాల్లో మాట సాయం చేసిన
వైశాలి ఆధీనంలో నా ఆస్థి దస్తావేజులు
ఉండిపోయాయి. అందుచేత ఆరోపణలు అబద్ధమని
నిరూపించుకునే అవకాశం వెంటనే అప్పట్లో
దక్కలేదు. అంతే కాక, నా పెన్షన్ తనకే
ఇప్పిస్తే, హాస్పిటల్లో ఉన్న నాకు ఇతరత్రా
కావలసిన సదుపాయాలన్నీ చూసుకుంటానని
ఆర్మీకి దరకాస్తు వేసుకొంది వైశాలి.
ప్రేత్యేక పరిస్థితిగా పరిగణించి,
ఎడాదిన్నరకి పైగా నెలకి ఇరవైఐదు వేల వరకు
నా పెన్షన్ వైశాలికే అందజేస్తున్నారు
ఆర్మీ రిటైర్మెంట్ వారు. ఆ కోర్ట్ కేసులు,
ఆ సైకియాట్రిక్ సమస్య అంతా నాపై ఆక్రమంగా
మోపబడినవే కావున, నా పెన్షన్ తిరగి వెంటనే
నాకే దక్కాలని కోరుతూ అన్ని డాక్యుమెంట్స్
మీ ముందుంచాను సార్,” అని ముగించి ఊపిరి
తీసుకున్నాను.
ఫైల్
లోని రిపోర్ట్స్ అన్నీ వరుసగా,
మరోసారి పరిశీలించారు,
జెడ్జ్ గారు,
శివరాం.
వాటిలో సమగ్రంగా పొందుపరిచిన
తీర్మానాల్లో,
డెబ్బైరెండేళ్ల మేజేర్ గారికి
మానసిక రుగ్మత లేదని నిర్ధారిస్తూ
చీఫ్
అఫ్ సైకియాట్రీ డా.
వినోద్ వర్మ రిపోర్ట్ తోపాటు,
పోలిస్ డిపార్ట్మెంట్,
ప్రభుత్వ న్యాయవాది వారి
రిపోర్ట్స్ నాకే
అనుకూలంగా
ఉన్నాయి.
అంతే
కాక, మేజర్
సూర్యనారాయణ 40
యేళ్ళగా ఓ
స్థిరమైన
గొప్ప వ్యక్తిత్వంతో మెలిగిన ఆఫీసర్ అని
బ్రిగేడియర్ శ్రీరాం కోటే,
టెరిటోరియల్ ఆర్మీ తరఫున
నిర్ధారించారు.
రాజేంద్రనగర్
రిజిస్టార్ ఆఫీస్ నుండి ప్లాట్ కొనుగోలు
పత్రాల కాపీ ద్వారా
1500 గజాల
ప్లాట్ నం.15
సొంతదారుణ్ణి
నేనే
నని కూడా
నిర్ధారణయ్యింది.
అన్ని
పత్రాలు సంతృప్తికరంగా ఉండడంతో
తమ
సమ్మతి తెలుపుతూ అవినాష్ గారు,
శివరాం కాగితాల మీద సంతకం చేసారు.
“చూడండి మేజెర్ గారు,
మీ పెన్షన్ మీకే తప్పక అందుతుంది.
అంతే కాదు మీ అనుమతి లేకుండా మీ
కుమార్తె ఇటువంటి మోసానికి దిగినందుకు,
వైశాలి గారి మీద న్యాయ స్థానంలో మీ
తరఫున ఆర్మీ కంప్లైంట్ కూడా
ఫైల్
చేస్తుంది.
మీరు ప్రశాంతంగా మీ జీవనాన్ని గడపవచ్చు,
ఇది అఫీషియల్.
అంటూ ఆర్డర్ కాగితాల మీద స్టాంప్
వేసారు.
***
మెడినోవ
లోని,
డాక్టర్ రాం
ప్రసాద్ కార్డియాలజీ క్లినిక్
డైబిటిస్ ,
ఇకెజి,
బ్లెడ్ టెస్ట్ అన్నీ ముగించుకొని
డాక్టర్ గారిని కలిసాము.
అంతా సవ్యంగానే ఉందని,
బలానికి
టానిక్, ఐరన్,
విటమిన్స్ ఇచ్చారు.
అన్ని మందులు ఎప్పటిలా
తీసుకోమన్నారు.
మీ
వయస్సుకి బాగానే ఉన్నారు,
మేజేర్
గారు,
అంటూ,
ఆర్మీ యాక్టివిటీ,
కాక ఆ మధ్య కింద పడి తగిలిన దెబ్బల
వల్ల మీ రెండు కాళ్ళు,
నడుము అప్పుడప్పుడు బాధ పెట్టవచ్చు.
థెరపీ మానకండి,
అని ముగించారు
డాక్టర్
సునీల్.
అప్పటికి
మధ్యాహ్నం
ఒంటిగంటయ్యింది.
ఇంటికే వెళ్లి
భోజనం చేద్దాము అంకుల్,
రెండు ముఖ్యమైన పనులు ఈ రోజు
పూర్తయ్యాయి,
అంటున్న మూర్తి తో కలిసి టాక్సీ వైపు
నడిచాను.
***
క్లినిక్
నుండి ఇంటికొచ్చి,
పెరగన్నం
మాత్రం కొంచెం తినేసి నాకని కేటాయించిన
రూంలో పడక మీద వాలాను.
చుట్టూ పరిశీలించాను.
ఏవేవో ఫోటోలు,
పువ్వులు అమర్చింది జానకి.
మంచానికి ఎదురుగా గోడ మీద పెద్ద
ఫోటోలో, నేనూ
నా ఇరువైపులా జానకి,
వైశాలి.
తల మీద వైశాలికి బర్త్ డే హాట్
ఉంది. పదేళ్ళ
పుట్టినరోజు ఆర్మీ క్లబ్ లో సెలెబ్రేట్
చేసినప్పటి చిత్రం అది.
వైశాలి వంక చూస్తే ఎన్నో మనసుని
పిండేసే జ్ఞాపకాలు.
ఆ
పుట్టిన రోజు నాడే,
వైశాలికి పాయసం ఇష్టమని పొద్దున్నే
తలార స్నానం చేసి,
వంటింట్లో పని చేసుకుంటున్న జానకి
పొడవాటి జుట్టుని అక్కసుతో వైశాలి వెనక
నుండి కత్తిరించేసింది.
వైశాలి
పద్నాలుగేళ్ళకే సింగర్ గా మ్యూజిక్ బాండ్
లో చేరి,
డ్రింక్ చేసేది.
అప్పుడప్పుడు మారక ద్రవ్యాలు కూడా
వాడుతుండేదని నా అనుమానం.
బాయ్ ఫ్రెండ్స్,
డేటింగ్ అన్ని అలవాట్లు ఉండేవి.
దాని ఖర్చుకి,
మా అమ్మ తన పొలం,
పల్లెటూరిలో ఇల్లు అమ్మేసిన
డబ్బునుండి కొద్ది కొద్దిగా ఖర్చు చేసేది.
వైశాలి
గురించి వ్యధ చెంది,
బాధతో ఆరోగ్యం క్షీణించి,
క్షయ వ్యాధి తో పాటు,
కంటి చూపు మందగించడంతో శాంత చాల
బలహీనమయింది.
వైశాలి
మ్యూజిక్ గ్రూప్ ఓనర్ జాన్ తో మూడేళ్ళ
పాటు సహజీవనం చేసింది.
అదే సమయంలో అమ్మ హృద్రోగంతో
మరణించాక,
డబ్బుకి మమ్మల్ని వేధించేది.
గొడవ పడలేక శాంత నగలు ఒక్కోటి
ఇచ్చేసేది.
వైశాలికి
ఇరవైయేడేళ్ళప్పుడు నేను మేజేర్ గా రిటైర్
అయ్యి,
కైరతాబాద్ లోని మా చిన్న ఫ్లాట్లోకి మూవ్
అయ్యాము.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ మనజేర్ ఉమాపతిని
పెళ్ళి చేసుకున్నానని చెప్పింది వైశాలి.
ఓ
సారి జానకి,
వాళ్ళ పదేళ్ళ కొడుకు రాజు ఇంటికి వచ్చారు.
అదే సమయానికి వైశాలి కూడా వచ్చింది.
వోర్వలేని వైశాలి నా దగ్గర
కూర్చున్న రాజుని లాగి గుమ్మం బయటకి
తోసింది.
దాని నైజం తెలిసిందే అయినా,
వైశాలి మీద ఆ రోజు అసహ్యం వేసింది.
మరోసారి ,
అనారోగ్యంతో ఊపిరి అందక బాధ
పడుతున్న శాంతని,
హాస్పిటల్ కి తరలించ బోతున్న
సమయంలో వైశాలి
వచ్చింది.
హాస్పిటల్ కి వెళ్ళే మనిషి వంటి మీద నగలు
ఉంచకూడదంటూ,
శాంత చేతి
గాజులు,
మెడలోని గొలుసు,
మంగళసూత్రం
తీసి,
తన పర్సులో వేసుకొంది.
మరో
వారానికి ఇంటికి వచ్చిన శాంత,
జానకి ఆలనలో కొద్ది రోజులు బాగానే
ఉన్నా, ఓ
అర్ధ రాత్రి ఊపిరందక,
మళ్ళీ హాస్పిటల్ కి తరిలించే
లోగానే తీవ్రంగా బాధపడి కన్ను మూసింది.
వైశాలి
అంటే, మాకు ఓ
టెర్రర్ర్,
సంకోచం, బాధ,
కడుపుకోత,
గుండెల్ని పిండేసే గుబులు,
చేతగానితనం.
మా అమ్మ మనమరాలిపై ప్రేమతో అతిగా
వ్యవహరించి,
తప్పు దోవలో పయనించి,
వైశాలిని పూర్తిగా నాశనం చేసిందనే
మా బాధ.
అందుగ్గాను అమ్మని నేనేనాడు క్షమించలేను.
వైశాలి
ఆలోచనలతో వ్యధ చెంది,
వేదనగా పక్క మీద నుండి లేచాను.
బయటకి వచ్చి టివి చూస్తూ
కూర్చున్నాను.
టివి పైన అందంగా నవ్వుతూ రాజు ఫోటో.
రాజు కూడా పాతికేళ్ళ వాడయ్యి,
ఆస్ట్రేలియా లో ఐ.టి
లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుల్లో
ఉన్నాడుట.
ఇల్లు నిశబ్దంగా ఉంది.
జానకి,
మూర్తి కనబడలేదు.
బయటకి వెళ్లుంటారు అనుకున్నాను.
***
టివి
చూస్తూ మగతలోకి జారుకుంటున్న నేను,
తలుపు తీసిన చప్పుడికి కళ్ళు తెరచి
గుమ్మం వైపు చూశాను.
హడావిడిగా
రెండు చేతుల నిండా
సంచులు,
సామానుతో
బజార్
నుండి
వచ్చారు మూర్తి,
జానకి.
సారీ నాన్నా,
ఇదో ఇప్పుడే టీ పెట్టిస్తా,
అంటూ వంటింట్లోకి వెళ్ళింది జానకి.
మూర్తి
సామానంతా సర్దేసి,
ఫ్రెష్ అయ్యి,
లాయర్ గారి కోసం ఫైల్,
కవర్స్ కూడా తెచ్చుకొని సోఫాలో
కూర్చున్నాడు.
హైదరాబాద్
ట్రాఫిక్ గురించి మాట్లాడుతూ జానకి
తెచ్చిన పకోడీ తిని,
టీ సిప్ చేస్తుండగా,
లాయర్ ఇంటికి వెళ్లేందుకు ఓపికుందా
ఇవాళ? అని
లేచి వెళ్ళి,
నా తల పైకి కాప్,
చేతికర్ర తెచ్చిచ్చింది
జానకి.
***
లాయర్
విశ్వనాధ్ గారి ఆఫీస్...
మా
కోసమే ఎదురు చూస్తున్నారు లాయర్ గారు.
న్యాయవిచార
పరంగా ఇప్పటివరకు జరిగినవి,
నాకు వివరించారు....
నిర్మాణం
అయిన
20
అపార్ట్మెంట్స్
అమ్మకాలు కోర్ట్
స్టే ఆర్డర్ తో ఆపి ఉన్నాయని,
వైశాలి వద్ద ఉన్న భూమి ఒరిజినల్
రిజిస్ట్రేషన్,
సేల్ డీడ్ సేకరించామని
అర్ధమయ్యింది.
కొత్తగా
మరో విషయం మాత్రం తెలియ జేశారు ఆయన.
వైశాలి మళ్ళీ కోర్ట్ లో కేస్
వేసిందట.
తాను
మేజేర్ సూర్యనారాయణ గారి ఏకైక వారసురాలననీ,
తానే తండ్రి బాగోగులు
చూస్తున్నానని,
ఆయన ఆస్తిపాస్తుల పైనే కాక,
వయోభారం పైబడ్డ తండ్రి బాగోగుల
విషయంగా కూడా తనకే సర్వాధికారాలు
ప్రసాదించవలసిందిగా,
కోర్ట్ లో అఫడవిట్ ఫైల్ చేసి,
విజ్ఞప్తి చేసుకుందట వైశాలి.
అంతే
కాక, ఎక్కడి
నుంచో వచ్చి,
తన తండ్రి ఆస్తుల పై ఆశతో,
ప్రేమ నటిస్తూ,
ఆయన్ని కష్టాల పాలు చేస్తున్న
జానకి,
మూర్తి గార్లని దూరం పెట్ట వలసిన అవసరం
ఎంతైనా ఉందని న్యాయ స్థానానికి సూచన
చేస్తూ,
ఫిర్యాదు కూడా దాఖలు చేసిందంటూ వివరించారు
విశ్వనాధ్ గారు.
రెండు
నిముషాల నిశ్శబ్దం తరువాత,
అయినా ఏమాత్రం బలం లేని వైశాలి
గారి అఫిడవిట్,
ఆవిడ చేసిన విజ్ఞప్తికి మనం కౌంటర్
వేయవచ్చు.
సొంత తండ్రిని
కుట్రతో మోసంచేయడమే కాక,
కోట్లు విలువ చేసే ఆస్తుల్ని కైవశం
చేసుకోవాలన్న దురుద్దేశంతో తండ్రిని మతి
స్థిమితం లేని వాడిగా చిత్రీకరించి,
డెబ్బై ఏళ్ల తండ్రి పై ఘోరమైన
నేరాలు మోపి,
జైలు పాలు చేసిందని నిరూపణ అయిన పలు
ఆధారాలు ఒకే అఫిడవిట్లో చేర్చి,
సీనియర్ సిటిజెన్ గా ఫాస్ట్ ట్రాక్
కోర్ట్ కి నివేదించి,
తక్షణమే వైశాలి నుండి సూత్ర
ప్రాయంగా కూడా పూర్తి విముక్తి పొందవచ్చు,
అని ముగించాడు.
అన్నీ
విని అర్ధంచేసుకొన్న నేను,
విశ్వనాధ్ గారు,
న్యాయ స్థానానికి అఫడివిట్ ధాకలు
చేద్దాము.
వైశాలికి నా తరఫున ఓ నోటిస్,
సెటిల్మెంట్ ఒప్పందం పంపుదాము.
అలాగే పెద్ద కూతురు జానకికి కూడా.
ఏమని ఎలా రాయాలో నేను చెబుతాను
రాసుకోండి,
అన్నాను ఆయనతో.
నాకు
న్యాయమనిపించిన రీతిలో వాస్తవాలు సమగ్రంగా
వివరించి,
అన్ని డాక్యుమెంట్స్ రాయించాను.
***
మేము
న్యాయబద్ధంగా దత్తత తీసుకున్న మా మొదటి
కుమార్తె జానకికి,
అపార్ట్మెంట్స్ నిర్మాణం వల్ల
మరింత నిధులు సేకరించే అవకాశం ఉందని మంచి
సూచన నిచ్చిన నా రెండో కుమార్తె వైశాలికి,
ప్రేత్యేకంగా నిర్మించిన మూడవ
అంతస్తులోని అపార్ట్మెంట్స్ చెరొకటి రాసి
రిజిస్టర్ చేయించే ఏర్పాటు చేయించాను.
మహవీర్
హిల్స్ స్థలంలో అపార్ట్మెంట్స్ కట్టించి
విక్రయించగా వచ్చిన నిధులతో,
నా భార్య పేరిట ప్రశాంత సేవాసదన్
స్థాపించి,
సీతారాముల గుడి కూడా కట్టించాలని
నా ఆశ. సేవ
కుటీరంలో
స్వచ్చందంగా వృద్ధులకి సేవలందించాలన్నది
నా ఆశయం. ఆ
కార్య సిద్ధి కోసం ప్రశాంత సేవ సదన్,
ప్రశాంత సేవ ట్రస్ట్
సంస్థలు రిజిస్టర్ చేయించాను.
నా
తదనంతరం కైరతాబాద్ ఫ్లాట్ నా మనవడు రాజుకి
చెందేలా ఏర్పాటు చేయించాను.
నే
చెప్పిన విధంగా దస్తావేజులు తయారు చేయించి,
నా తరఫున విధులు
నిర్వహించవలసిందిగా లాయర్ గారికి ఆదేశాలు
ఇచ్చాను.
***
పది
సంవత్సరాల తరువాత..
వందలాది
కార్లు ఆ రోజు ప్రశాంత సేవ సదన్
ఆవరణలోని శ్రీ సీతారామ ఆలయం
చుట్టూ ఆగి ఉన్నాయి.
మేజేర్ సూర్యనారాయణ గారి ఎనభైరెండవ
పుట్టిన రోజు పండుగ ఆశ్రమంలోని వృద్ధులు,
వికలాంగులు,
అనాధలు అంతా కలిసి గుడి ఆవరణలో
జరుపుకుంటున్నారు.
ఆవరణ కిక్కిరిసి ఉంది.
అక్కడే,
అంకిత భావంతో పని చేస్తూ మేజేర్
గారిని కనిపెట్టుకొని ఉంటున్న ఆయన పెద్ద
కూతురు జానకి,
అల్లుడు మూర్తి అజమాయిషీ
చేస్తున్నారు.
అంతే
కాదు ఆ హడావిడికి కారణం మరొకటి కూడా ఉంది.
భారత దేశం లోనే ప్రశాంత సేవ సదన్
అత్యుత్తమ వృద్ధ,
అనాధ స్వచ్చంద సేవా సంస్థగా
గుర్తింపు పొందిన సందర్భంగా,
రాష్ట్ర ముఖ్య మంత్రి,
గవర్నర్ ప్రత్యేకంగా విచ్చేసి
సభాముఖంగా మేజేర్ గారిని పుట్టిన రోజున
అభినందించనున్నారు.
సంస్థ సేవలని గుర్తించి,
కొనియాడి,
ప్రభుత్వం కూడా సంస్థ సేవలో భాగం
పంచుకోవాలని ఆశిస్తూ చేయూత నిస్తామని కూడా
ప్రకటించ నున్నారు.
***
కార్యక్రమం
మొదలయ్యి ప్రసంగాలు కూడా ముగిసాయి.
జరగవలసిన అన్ని అంశాలు చక్కగా
పూర్తయ్యాయి.
సన్మాన కార్యక్రమం జరగబోతుంది.
మేజేర్ గారిని వేదిక పైకి
ఆహ్వానించారు.
అయన జాడ లేదు.
జానకి,
వైశాలి ఆత్రుతగా నాన్న కోసం
చూస్తున్నారు.
కాసేపటికి ఓ పసిగుడ్డుని చేతుల్లో
పొదవి పట్టుకొని,
ఇరువైపులా అనాధాశ్రమ యువకులు చేయూత
నివ్వగా,
వేదిక వద్దకు వచ్చారు మేజేర్ గారు.
అమ్మా జానకి
అని పిలచి ఓ పసి కందుని జానకి
చేతుల్లో ఉంచారు.
సన్మానాలు,
సత్కారాలు నాకు కాదు,
త్యజించబడి,
మనుగడ కోసం
కొట్టుమిట్టాడుతున్నఇటువంటి పసివారికే
చెందాలి,
నన్ను మన్నించండి,
అన్నారు.
ఇంతకు మునుపే ఆశ్రయం కోసం మన
ఆశ్రమం చేరింది ఈ కళ్ళు కూడా తెరవని అనాధ.
శాంత
అని పేరు పెడదాము,అంటూ
జానకిని,
వైశాలిని పసి బిడ్డతో పాటు వేదిక పైకి
నడిపించి,
తాను తెర వెనుక ఉండిపోయారు మేజేర్
సూర్యనారాయణ గారు.
మా నాన్న ఒట్టి
పిచ్చివాడు,
ఇలాంటి గుర్తింపు,
సన్మానాలని కూడా తృణప్రాయంగా
త్యజించ గలవాడు పిచ్చివాడే,
అంది వైశాలి అందరికి వినబడేలా.
వెంటనే జానకి,
నీ దృష్టిలో నాన్న పిచ్చివాడు
అయితే, మా
నాన్న నా దృష్టిలో మహానుభావుడే!,
అంది నవ్వుతూ.
అంతలో ఆకలికేమో ఆ పసిది ఏడవడం
మొదలెట్టింది...
***
|